EPAPER

Amit Mishra About Virat Kohli: కొహ్లీ మారిపోయాడు.. వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా

Amit Mishra About Virat Kohli: కొహ్లీ మారిపోయాడు.. వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా

ఇంతకుముందు రిపోర్టర్లు రాయాలి, సబ్ ఎడిటర్లు దిద్దాలి. ఇంఛార్జి ఓకే చేయాలి, వీడియో ఎడిటర్ మేకప్ వేయాలి. అవి చూసి పొద్దున్నే ఎవడో ఒకడు తిట్టాలి. ఇవేం నేడు అక్కర్లేదు. సోషల్ మీడియా జన జీవితాల్లోకి అంతగా చొచ్చుకుపోయింది. ఎవరికి కోపం వస్తే, అక్కడే కామెంట్ బాక్సుల్లో ఠపీమని పెట్టేస్తున్నారు.

ఇంత ఉపోద్ఘాతం ఎందుకంటే.. భారత వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా ఉన్నట్టుండి విరాట్ కొహ్లీపై వివాదాస్పద కామెంట్లు చేశాడు. అవిప్పుడు నెట్టింట వేడి పుట్టిస్తున్నాయి. తను ఒక యూట్యూబ్ ఛానల్ కి ఇంటర్వ్యూ ఇస్తూ.. విరాట్, రోహిత్ శర్మల్లో ఎవరు బెస్ట్, ఎవరికి ఎక్కువ మంది ఫ్రెండ్స్ ఉన్నారని అడిగిన ప్రశ్నకు తను చెప్పిన సమాధానం నెట్టింట ఇప్పుడు ట్రెండింగ్ గా మారింది.


ఇంతకీ తనేమన్నాడంటే, విరాట్ కొహ్లీ కి కెప్టెన్సీ ఇచ్చిన తర్వాత పూర్తిగా మారిపోయాడని అన్నాడు. అంతకు ముందు జట్టులో ఎంతో స్నేహభావంతో ఉండేవాడు, స్నేహానికి ప్రాణమిచ్చేవాడు, కానీ కెప్టెన్సీ రాగానే ఒక్కసారి అతనిలో మార్పు వచ్చిందని అన్నాడు. బహుశా అపజయాలు ఎదురుకావడం, జట్టుని గెలిపించాలనే ఒత్తిడిలో ఉండటం, వివాదాలు, అలుపెరగని ప్రయాణాలు వీటన్నింటితో చికాకుగా ఉండేవాడని అన్నాడు. అందుకే జట్టులో అతనికి స్నేహితులు తగ్గిపోయారని అన్నాడు. కానీ ఒక క్రికెటర్ గా నేను కొహ్లీని ఎంతో గౌరవిస్తానని అన్నాడు.

Also Read: యూరో ఫుట్ బాల్ విజేత..స్పెయిన్

ఒకప్పుడు కొహ్లీతో ఎంతో స్నేహంగా ఉండేవాడిని. ఇప్పుడలా ఉండటం లేదు. దాదాపు మాట్లాడటం మానేశాను. అంటూ ఒక బాంబ్ పేల్చాడు. మనకు పేరు ప్రఖ్యాతులు, డబ్బు వచ్చింది కాబట్టి, ఎవరైనా ఏదో ప్రయోజనం ఆశించి వస్తారని కొంతమంది భావిస్తారు. కానీ నేను అలాంటివాడిని కాదని అన్నాడు. ఇదే ఇప్పుడు నెట్టింట సెగ పుట్టిస్తోంది.

ఇక రోహిత్ శర్మ విషయానికి వస్తే, తను అలా ఉండడు. అప్పుడెలా ఉన్నాడో, ఇప్పుడు కూడా అలాగే ఉంటాడు. నవ్వుతూ ఉంటాడు. మనం చెప్పే సమస్యను కూల్ గా వింటాడు. ఏదైనా ఈవెంట్ లేదా ఐపీఎల్ సందర్భంగా కలిస్తే, చాలా సరదాగా మాట్లాడతాడు. పూర్వపు స్నేహభావాన్ని అలాగే కొనసాగిస్తాడు. తను కెప్టెన్ అయినా సరే, జోక్స్ వేస్తూ నవ్విస్తూ ఉంటాడు. ఒక ఫ్రెండ్లీ కెప్టెన్ అని మెచ్చుకున్నాడు. తనే ప్రపంచంలో నెంబర్ వన్ కెప్టెన్, అంతే కాదు టీ 20 ప్రపంచకప్ విజేత, ఐదు ఐపీఎల్ టైటిల్స్ సాధించాడని మిశ్రా పేర్కొన్నాడు.

Tags

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×