EPAPER

Online Liquor Supply in TG: మందుబాబులకు ఇక ప్రతి రోజు పండుగే.. ఆన్ లైన్ లో లిక్కర్ సప్లై..?

Online Liquor Supply in TG: మందుబాబులకు ఇక ప్రతి రోజు పండుగే.. ఆన్ లైన్ లో లిక్కర్ సప్లై..?

Liquor Supply in Online Planning to Implement in Telangana: మద్యం నిషేధించాలని పలు రాష్ట్రాలో మహిళలు ఆందోళన చేస్తున్న క్రమంలో మందుబాబులకు ఇక ఊహించని రీతిలో పండుగ లాంటి వార్త వినిపించబోతోంది. చాలా మందికి తాగాలని ఉన్నా సామాజిక పరిస్థితుల దృష్ట్యా వైన్ షాపుల ముందు క్యూలో నుంచుని మందు బాటిల్లను కొనుగోలు చేయడానికి సిగ్గుపడుతుంటారు. బహిరంగంగా తాగి అల్లరి పాలవడం వీరికి ఇష్టం ఉండదు. ఎవరైనా చూసి తనని తాగుబోతు అని ముద్ర వేస్తారేమో అని భయపడి ఆ ప్రయత్నాన్ని మానుకుంటుంటారు. అయితే అలాంటి వారు ఇకపై తంటాలు పడనక్కర్లేదు. ఆన్ లైన్ లో మద్యం ఇంటికే ఆర్డర్ ఇచ్చుకోవచ్చు నిరభ్యంతరంగా. త్వరలోనే తెలంగాణ లో ఇలాంటి సదుపాయంపై కసరత్తు చేస్తున్నాయి మద్యం డెలివరీ చేసే కంపెనీలు. ఇందుకోసం స్విగ్గీ, జమేటా వంటి ఆన్ లైన్ డెలివరీ సంస్థలతో ఒప్పందం చేసుకునేలా ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఇప్పటిదాకా కేవలం ఫుడ్ డెలివరీకే పరిమితమైన సంస్థలు మద్యం ఆన్ లైన్ లో సరఫరా చేసేందుకు సుముఖత వ్యక్తం చేస్తున్నాయి.


పొరుగు రాష్ట్రాలలో..

ఇప్పటికే పలు రాష్ట్రాలలో మద్యం ఆన్ లైన్ లో సరఫరా చేస్తున్నారు. పొరుగు రాష్ట్రాలైన కేరళ, తమిళనాడు, కర్ణాటక, ఢిల్లీ, పంజాబ్, హర్యానా,గోవా వంటి రాష్ట్రాలలో ఆన్ లైన్ అమ్మకాల ద్వారా రెట్టింపు లాభాలను సొంతం చేసుకుంటున్నాయి మద్యం సరఫరా సంస్థలు. తెలంగాణలోనూ ఇప్పుడు ఈ దిశగా ప్రయత్నాలు ముమ్మరం చేస్త్నన్నారు మద్యం వ్యాపారులు. మద్యం ఆన్ లైన్ అమ్మకాల ద్వారా 20 నుంచి 30 శాతం అమ్మకాలు పెరిగినట్లు ఆయా రాష్ట్రాల గణాంకాలు చెబుతున్నాయి. ఇక హైదరాబాద్ లో మద్యం అమ్మకాల విషయంలో వ్యాపారులు ఎప్పుడూ హ్యాపీనే. ఇక్కడ మద్యం అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయి. మద్యంతో పాటు నాన్ వెజ్ కూడా ఎక్కవ స్థాయిలో కొనుగోళ్లు ఉంటాయి. ప్రతి ఏడాది మద్యం అమ్మకాలు పెరుగుతున్నాయే తప్ప తగ్గడం లేదు.


Also Read: Farm Loans: పంద్రాగస్టు కంటే ముందే రుణమాఫీ: సీఎం రేవంత్ రెడ్డి

ఆన్ లైన్ కే ఓటేసిన హైదరాబాద్

ఇటీవల ఓ సర్వే సంస్థ మద్యం ఆన్ లైన్ అమ్మకాలపై హైదరాబాద్ లో సర్వే నిర్వహించింది. ఈ సర్వేలో అధిక శాతం మంది మద్యం ఆన్ లైన్ విధానానికే మొగ్గు చూపారు. రాత్రుళ్లు బార్లు, రెస్టారెంట్లకు వెళ్లే బాధ తప్పుతుందని ఓ మద్యం ప్రియుడు తెలిపాడు. మరికొందరైతే డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులనుంచి విముక్తి కలుగుతుందని..హ్యాపీగా ఇంటికే మందును రప్పించుకుని స్సేహితులతో ఎంజాయ్ చేయవచ్చని అంటున్నారు. కొందరు ఆడవాళ్లు తమ భర్తలు ఎక్కడ మద్యం తాగి రోడ్డుపై యాక్సిడెంట్ కు గురవుతారో అని ఆందోళనలో ఉండేది. ఇక ఆన్ లైన్ అందుబాటులోకి వస్తే ఇంటి వద్దకే మద్యం తెప్పించుకోవడంలో తమకు ఎలాంటి అభ్యంతరం ఉండదని..ప్రత్యేక గదులలో వాళ్లు మద్యం తాగి కామ్ గా రెస్ట్ తీసుకుంటే చాలని అంటున్నారు.

పబ్బుల కన్నా బెటర్

అయితే ఈ విధానం వలన డెలివరీ రేటు సైతం కస్టమర్లు లెక్క చేయడం లేదు. ఎక్కడో ఊరికి దూరంగా ఉండే పబ్బులు, రెస్టారెంట్లకు వెళ్లే ఖర్చుతో పోల్చుకుంటే ఇది తక్కువే అంటున్నారు. ఇక మద్యం సరఫరా చేసే సంస్థలు కూడా తమకు వచ్చే లాభనష్టాలను అంచనా వేసుకుని త్వరలో ఇతర రాష్ట్రాలలో అమలవుతున్న ఆన్ లైన్ మద్యం డెలివరీని హైదరాబాద్ నగరానికి సైతం అందుబాటులోకి తేవాలని చూస్తున్నాయి. సేల్స్ బట్టి తెలంగాణలో ప్రముఖ నగరాలకూ ఈ విధానాన్ని ప్రవేశపెట్టాలనే యోచనలో ఉన్నారు.

Tags

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×