EPAPER

Kaspersky is Shutting Down: అమెరికాలో కాస్పర్‌‌స్కై దుకాణం బంద్.. ఈనెల 20 చివరిరోజు..

Kaspersky is Shutting Down: అమెరికాలో కాస్పర్‌‌స్కై దుకాణం బంద్.. ఈనెల 20 చివరిరోజు..

Kaspersky is Shutting Down in America: రష్యాకు చెందిన ప్రముఖ యాంటీ వైరస్ సాప్ట్‌వేర్ కంపెనీ కాస్పర్ స్కై అమెరికాలో తన వ్యాపారాలను మూసివేస్తోంది. ఈనెల 20 ఆ కంపెనీకి అక్కడ చివరి రోజు. అమెరికాతో రెండు దశాబ్దాల బంధం ముగియనుంది.


అమెరికాలో 20 ఏళ్లగా తన కార్యకలాపాలను సాగిస్తూ వస్తోంది కాస్పర్ స్కై సంస్థ. రష్యాకు చెందిన యాంటీ వైరస్ సాప్ట్‌వేర్ కంపెనీ.. అక్కడ దుకాణాన్ని క్లోజ్ చేస్తోంది. ఈనెల 20తో ఆ కంపెనీకి అమెరికాతో ఉన్న బంధం తెగిపోతోంది. తమ ప్రొడక్టును బైడెన్ సర్కార్ బ్యాన్ చేయడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్ల డించింది. విషాదకరమైన నిర్ణయంగా వర్ణించింది. కంపెనీల నుంచి అవకాశాలు తగ్గిపోవడంతో వెళ్లిపోవడ మే బెటరని నిర్ణయించుకుంది ఆ కంపెనీ.

రష్యాకు చెందిన సంస్థ కాస్పర్ స్కై సంస్థ 1997లో మాస్కో కేంద్రంగా ప్రారంభమైంది. అక్కడి నుంచి అంచెలంచెలుగా తన వ్యాపార కార్యకలాపాలను విస్తరించింది. ప్రపంచవ్యాప్తంగా 31 దేశాల్లో తన కార్యకలాపాలను సాగిస్తోంది. దాదాపు 40 కోట్ల మంది వినియోగదారులు ఉన్నారు. 200 దేశాల్లో 2 లక్షల 70 వేల కంపెనీలు కాస్పర్ స్కై సాఫ్ట్‌వేర్‌ను వినియోగిస్తున్నారు. ప్రపంచంలో నెంబర్ వన్ కంపెనీగా కాస్పర్ స్కై నిలిచింది.


Also Read: జాబిల్లిపై గుహ, అయితే షెల్టర్లు ఖాయమా?

ఇప్పటికే అమెరికాలోని ఆ సంస్థ యాంటీ వైరస్, సైబర్ సెక్యూరిటీ టూల్స్ విక్రయాలను నిలిపివేసింది. అమెరికాలోని కామర్స్ డిపార్ట్ మెంట్ కూడా ఈ సాప్ట్‌వేర్ అప్‌డేట్లు అందుబాటులో ఉండవని తేల్చి చెప్పేసింది. ఇప్పటికే కాస్పర్ స్కై తన సంస్థకు చెందిన అమెరికా విభాగంలోని ఉద్యోగులకు క్రమంగా తొలగించింది. అయితే వారికి ప్యాకేజ్ కూడా ఆ స్థాయిలో ఇచ్చినట్టు సమాచారం.

జో బైడెన్ సర్కార్ సమాచారం ఇచ్చిన నెల రోజులకు దుకాణం మూసి వేస్తోంది కాస్పర్ స్కై. యాంటీ వైరస్ ద్వారా అమెరికా సమాచారాన్ని సేకరించి ఆయుధాలుగా మార్చడానికి ఉపయోగపడుతుందనేది అమెరికా ప్రభుత్వ భావన. పదేపదే ఈ విషయాన్ని రష్యా నిరూపించినట్లు అమెరికా వాణిజ్య శాఖ కార్యదర్శి గినా రైమోండో చెబుతున్నమాట. రష్యా టెక్నాలజీ అమెరికా పౌరులకు ముప్పుగా పరిణమించినప్పుడు ఎలాంటి చర్యలైనా తీసుకోవడానికి వెనుకాడబోమని బైడెన్ సర్కార్ తేల్చిచెప్పింది.

Also Read: Joe Gow: భార్యతో శృంగారం చేస్తూ వీడియో తీసిన యూనివర్సిటీ చాన్సెలర్.. అడల్ట్ వెబ్‌సైట్‌లో వీడియో పోస్ట్..

అమెరికాలో అధ్యక్ష ఎన్నికల వేళ ప్రెసిడెంట్ జోబైడెన్ తీసుకున్నట్లు నిర్ణయంపై చాలామంది హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల్లో బైడెన్‌కు కలిసిరావడం ఖాయమని అంటున్నారు.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×