EPAPER

Rohit Sharma Speaks Telugu: తెలుగులో మాట్లాడిన రోహిత్ శర్మ.. నెట్టింట్లో వీడియో వైరల్!

Rohit Sharma Speaks Telugu: తెలుగులో మాట్లాడిన రోహిత్ శర్మ.. నెట్టింట్లో వీడియో వైరల్!

Rohit Sharma Speaks in Telugu: టీమిండియా కెప్టెన్ అనగానే మనకు టక్కున గుర్తుకొచ్చేది రోహిత్ శర్మ.ఎందుకంటే 2024 టీ20 ప్రపంచకప్‌ని తన సారథ్యంలో టీమిండియా టీమ్ ఈ టోర్నీని భారత్‌కి దక్కేలా చేశారు.అంతేకాదు ప్రపంచకప్ సొంతం చేసుకున్న అనంతరం రెస్ట్ మూడ్‌లో ఉన్న రోహిత్ అమెరికా టూర్‌కి వెళ్లి ఎంజాయ్ చేస్తున్నాడు. తాజాగా అమెరికాలోని డల్లాస్‌లో ఓ ప్రోగ్రామ్‌లో పార్టీస్‌పేట్ చేశాడు. అక్కడున్న ఇండియన్ ఫ్యాన్స్‌ని అప్యాయంగా తెలుగులో పలకరించాడు. ఎందుకంటే డల్లాస్‌లో ప్రవాస తెలుగువాళ్లు అధిక శాతం నివసిస్తుంటారు ఇక్కడ. అందుకే వారిని ఉద్దేశించి తెలుగులో మాట్లాడి అందరికి షాక్ ఇచ్చారు. ఓ వ్యక్తి ఎలా ఉన్నారని తెలుగులో క్వచ్ఛన్ వేయగా దానికి బదులుగా రోహిత్ శర్మ ఎలా ఉన్నారంటూ బదులిచ్చాడు. దీంతో అక్కడున్న ఆడిటోరియం అంతా కేరింతలతో మారుమోగిపోయింది. ఈ వీడియో చూసిన తెలుగు అభిమానులందరూ తన మాటలకి ఫిదా అవుతున్నారు. అంతేకాదు రోహిత్‌ని డైరెక్ట్‌గా చూసిన ఆనందంలో తెలుగు అభిమానులు ఫుల్ ఖుషీగా ఫీల్ అవుతున్నారు. అంతేకాదు ఈ వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.


ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే రోహిత్‌ శర్మకి ఇంతకు ముందే తెలుగు టచ్ ఉంది. ఎందుకంటే రోహిత్ శర్మ తల్లిగారిది ఏపీలోని వైజాగ్. తండ్రి మాత్రం మహారాష్ట్రకి చెందిన వ్యక్తి.దీంతో అటు తెలుగు, ఇటు హిందీ, ఇంగ్లీష్ భాషలు వచ్చు.ఇక టీ20 ప్రపంచకప్ 2024 విషయానికి వస్తే.. తన సారథ్యంలో ఈ కప్‌ని భారత్‌కి అందించి అంతర్జాతీయ టీ20 మ్యాచ్‌లకు స్వస్తి పలికాడు. ఇక టెస్ట్‌, వన్డే మ్యాచ్‌లు తన ఫార్మాట్లలో కంటిన్యూ అవుతాయని క్లారిటీ ఇచ్చాడు. అంతేకాదు ఇంకో విషయాన్ని కూడా షేర్ చేసుకున్నాడు. నేను దేని గురించి ఎక్కువగా థింక్ చేయనని తెలిపాడు. ఒక విషయం చెప్పాలనుకుంటున్న అది ఏంటంటే.. కొంతకాలం పాటు టెస్ట్, వన్డే టెస్ట్ పార్మాట్‌లలో మళ్ళీ తన గేమ్‌ని త్వరలోనే వీక్షిస్తారని హిట్ మ్యాన్ తెలిపాడు.

Also Read: వింబుల్డన్ విజేతల నైట్ పార్టీ, అల్కరాస్‌తో క్రెజికోవా డ్యాన్స్


ఇక ఇదిలా ఉంటే..ఈ ఏడాదిలో జరగబోయే వరల్డ్‌టెస్ట్‌ ఛాంపియన్‌షిప్‌తో పాటుగా వచ్చే సంవత్సరం జరిగబోయే ఛాంపియన్స్‌ ట్రఫీ వన్డే టోర్నీలో సైతం భారత కెప్టెన్‌గా హిట్ మ్యాన్ సారథ్యం వహించనున్నాడని బీసీసీఐ సెక్రటరీ జైషా ప్రకటించారు. ఈ మంథ్ ఎండింగ్‌కి టీమిండియా 3 టీ20లు, వన్డేల కోసం శ్రీలంక పర్యటనకు వెళ్ళనుంది. ఈ పర్యటనతో టీమిండియా నయా హెడ్‌ కోచ్ గౌతమ్ గంభీర్‌ తన బాధ్యతలను తిరిగి స్వీకరించనున్నారు. అంతేకాదు టీ20 సిరీస్‌కు వచ్చే ఆటగాళ్లను ఎంపిక చేసే ఛాన్స్‌ ఉన్నట్టు తెలుస్తోంది. విరాట్ కొహ్లీ, శ్రీలంక పర్యటనతో మైదానంలోకి రీ ఎంట్రీ ఇస్తారా..? లేక ఈ టూర్ నుంచి కూడా వారందరికి రెస్ట్ ఇవ్వనున్నారా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. మరో రెండు రోజుల్లో ఈ పర్యటనకు భారత జట్టు సభ్యులను అనౌన్స్ చేసే ఛాన్స్ కనిపిస్తోంది.

Tags

Related News

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

Big Stories

×