EPAPER

Rohit Sharma’s ODS and Test Retirement Plans: 37ఏళ్ల రోహిత్ శర్మ.. ఎప్పుడు రిటైర్ కావాలి?

Rohit Sharma’s ODS and Test Retirement Plans: 37ఏళ్ల రోహిత్ శర్మ.. ఎప్పుడు రిటైర్ కావాలి?

Rohit Sharma has talked about his ODS and Test Retirement plans: 2007 లో వన్డేల్లో ఆరంగేట్రం చేసిన టీమ్ ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ, తన కెరీర్ ప్రారంభించి నేటికి 17 ఏళ్లు అవుతోంది. ఇప్పుడు తనకి 37 సంవత్సరాలు. మహా అయితే మరో మూడేళ్లు ఆడే అవకాశాలున్నాయని అంటున్నారు. ఇండియా తరఫున అత్యధిక సంవత్సరాలు క్రికెట్ ఆడిన వారిలో సచిన్ టెండూల్కర్ (22 ఏళ్లు) ఉన్నాడు. తర్వాత హర్భజన్ (17 ఏళ్లు), అనిల్ కుంబ్లే, కపిల్ దేవ్ (16 ఏళ్లు) ఇలా ఉన్నారు. ఈ లెక్కన చూసుకుంటే రోహిత్ శర్మకి టైమ్ దగ్గరపడిందనే చెప్పాలి. ఈ నేపథ్యంలో తన రిటైర్మెంట్ పై మరి రోహిత్ శర్మ ఏమన్నాడో చూద్దామా…


తాజాగా డలాస్‌లో క్రికెట్ అకాడమీ ప్రారంభోత్సవ కార్యక్రమానికి రోహిత్ శర్మ హాజరయ్యాడు. ఈ సందర్భంగా అభిమానులు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చాడు. అందులో భాగంగా రిటైర్మెంట్ పై రోహిత్ సమాధానం ఇచ్చాడు. ‘ఇంకొంత కాలం క్రికెట్ ఆడాలని అనుకుంటున్నా. అయితే సుదీర్ఘ ప్రాణాళికలేమీ లేవు’ అన్నాడు. అంతర్జాతీయ టీ20లకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ వన్డే, టెస్టు మ్యాచ్ లు, తర్వాత ఐపీఎల్‌లో కొనసాగనున్నాడు.

ఇంతకుముందు కూడా పలువురు రిటైర్మెంట్ పై అడిగిన ప్రశ్నకు పలు సందర్భాల్లో సమాధానమిచ్చాడు. ఇప్పుడు నా బ్యాటింగ్ మంచి రిథమ్ లో ఉంది. అది ఉన్నంతవరకు ఆడతానని అన్నాడు. లేదంటే ఒక ఫైన్ డే ఉదయం లేవగానే, నాకు క్రికెట్ పై ఇంట్రస్ట్ పోయిందని అనిపించిన క్షణం, మరో ఆలోచన లేకుండా గుడ్ బై చెప్పేస్తానని అన్నాడు. ఇటీవల టీ 20 ప్రపంచకప్ గెలిచిన అనంతరం టీ 20ల వరకు రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ శర్మ.. ఒకట్రెండు ఏళ్లలో జాతీయ క్రికెట్ కు గుడ్ బై చెబుతాడని అంటున్నారు.


Also Read: క్రికెట్ స్టేడియంలో పొగాకు యాడ్స్ వద్దు : కేంద్రం ఆలోచన

ఇకపోతే ప్రస్తుతం రవిచంద్రన్ అశ్విన్ వయసు కూడా 37 సంవత్సరాలు కావడం విశేషం. ఇండియా నుంచి సచిన్ టెండూల్కర్ 40, సునీల్ గవాస్కర్ 38, శ్రీలంక నుంచి సనత్ జయసూర్య 41 ఏళ్లనాడు రిటైర్మెంట్ ప్రకటించారు. పాకిస్తాన్ నుంచి ఇమ్రాన్ ఖాన్, జియా ఉల్ హక్, షాహిద్ ఆఫ్రిది వీరందరూ 40 ఏళ్లు దాటించారు. క్రికెట్ జీవితంలో 37-40 మధ్య రిటైర్మెంట్ వయసుగా క్రికెట్ బోర్డులు పరిగణిస్తాయి.

అంతకుమించి ఆడుతుంటే మాత్రం, బోర్డులే ఆటగాళ్లను పక్కన పెడతాయి. లేదంటే ఫలానా సిరీస్ లో రిటైర్మెంట్ ప్రకటించమని అంతర్గతంగా వారికి చెబుతాయి. అది వింటే మంచి బెనిఫిట్స్ తో బయటపడతారని అంటారు. ఇదండీ సంగతి. ప్రస్తుతం విరాట్ కొహ్లీ 36, రోహిత్ శర్మ 37, రవీంద్ర జడేజా 35, మహ్మద్ షమీ 33 ఇలా వరుసగా రిటైర్మెంట్ క్యూ లో ఉన్నారు.

Tags

Related News

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్: బంగ్లాదేశ్ 26/3

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Big Stories

×