EPAPER

BJP MLA Pannalal Shakya: పంక్చర్ షాప్ తెరవండి.. విద్యార్థులకు బీజేపీ ఎమ్మెల్యే సలహా

BJP MLA Pannalal Shakya: పంక్చర్ షాప్ తెరవండి.. విద్యార్థులకు బీజేపీ ఎమ్మెల్యే సలహా

BJP MLA Pannalal Shakya: మధ్యప్రదేశ్ బీజేపీ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం సంచలనంగా మారాయి. ఎమ్మెల్యే విద్యార్థులకు చేసిన సూచన విని అక్కడున్న వారంతా అవాక్కయ్యారు. భవిష్యత్తులో విద్యార్థులు బైక్ పంక్చర్ దుకాణాలు తెరవాలని ఎమ్మెల్యే సలహా ఇచ్చారు. బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఎమ్మెల్యే ఈ సూచనలు చేయడంతో తీవ్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.


ప్రధాన మంత్రి కాలేజ్ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో మధ్యప్రదేశ్‌లోని 55 జిల్లాల్లో ప్రత్యేక కేంద్రాలను కేంద్ర హోం మంత్రి అమిత్ షా వర్చువల్‌గా ప్రారంభించారు. గుణ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే పన్నాలాల్ షాక్య ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పీఎం కాలేజ్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఘనంగా ప్రారంభం అయింది. అయితే మీరు చదివే డిగ్రీతో భవిష్యత్తులో పెద్దగా లాభం ఉండదు. అందుకే మీకు ఓ సలహా ఇవ్వాలనుకుంటున్నా. డిగ్రీలకు బదులుగా జీవనోపాధి కోసం కనీసం మోటార్ సైకిల్ పంక్చర్ షాప్ రిపేర్ దుకాణాలను తెరవండి. ఇది మీరు కచ్చితంగా గుర్తుంచుకోండి అని ఎమ్మెల్యే అన్నారు.

ఎమ్మెల్యే మాటలు విన్న అక్కడ ఉన్న వారంతా ఒక్క సారిగా షాక్ అయ్యారు. ఆ స్థాయిలో ఉండి విద్యార్థులకు అలాంటి సూచన చేయడం ఏంటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఒక్క రోజులోనే స్థానికంగా 11 లక్షల మొక్కలు నాటి ఇందౌర్ గిన్నిస్ రికార్డు సృష్టించడాన్ని ఎమ్మెల్యే ప్రస్తావించారు. పెరుగుతున్న కాలుష్యంపై ఆందోళన వ్యక్తం చేశారు. మొక్కలు నాటుతున్నారు కానీ.. వాటి సంరక్షణ మరిచిపోతున్నారని వాపోయారు.


Also Read: విడాకుల కోసం కోర్టులో పిటిషన్ వేసిన మాజీ సీఎం.. భార్యకు నోటీసులు

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు మొక్కలు నాటటానికి ఆసక్తి చూపిస్తున్నారు. కానీ వాటికి మాత్రం కాపాడుకోపవడం లేదని పన్నాలాల్ ఆవేదన వ్యక్తం చేశారు పంచ తత్వాన్ని అంటే భూమి, గాలి, నీరు ,సౌర శక్తి, ఆకాశంలను కాపాడటానికి ప్రయత్నం చేయాలి. పంచ తత్వాన్ని కాపాడుకోవడంపై ఎవరూ దృష్టి సారించడం లేదని అన్నారు. దుష్ప్రభావాల గురించి పట్టించుకోకుండా ప్రజలు ఏది పడితే అది పట్టించుకోకుండా తింటున్నారని అన్నారు. ఆ సందర్భంలోనే ఆ వ్యాఖ్యలు చేశారు. అయితే ఈ వ్యాఖ్యలు మాత్రం హాట్ టాపిక్‌గా మారాయి. ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Tags

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×