EPAPER

SC Notice to Payal Abdullah: విడాకుల కోసం కోర్టులో పిటిషన్ వేసిన మాజీ సీఎం.. భార్యకు నోటీసులు

SC Notice to Payal Abdullah: విడాకుల కోసం కోర్టులో పిటిషన్ వేసిన మాజీ సీఎం.. భార్యకు నోటీసులు

SC Notice to Payal Abdullah: విడాకుల విషయమై జమ్మూకాశ్మీర్ మాజీ సీఎం ఓమర్ అబ్దుల్లా సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ కు సంబంధించి ఆయన సతీమణికి నోటీసులు అందాయి. ఆరు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని ఈ సందర్భంగా కోర్టు ఆ నోటీసుల్లో ఆదేశించింది.


అయితే, తన భార్య నుంచి విడాకులు ఇప్పించాలని అభ్యర్థిస్తూ నేషనల్ కాన్ఫరెన్స్ నేత ఓమర్ అబ్దుల్లా గతంలో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా.. ఆ పిటిషన్ ను కోర్టు కొట్టివేసింది. ఓమర్ విజ్ఞప్తిలో ఎలాంటి అర్హత లేదని స్పష్టం చేసింది. అబ్దుల్లాకు విడాకులు మంజూరు చేసేందుకు నిరాకరిస్తూ 2016లో ఫ్యామిలీ కోర్టు వెలువరించిన ఆదేశాన్ని హైకోర్టు సమర్థించింది. ఈ క్రమంలోనే ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

Also Read: సిగ్నల్ జంప్ చేస్తే నో ఫైన్.. కానీ ఈ అవకాశం వారికి మాత్రమే !


అబ్దుల్లా తరఫున సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ కోర్టులో వాదనలు వినిపించారు. వారిద్దరూ గత 15 సంవత్సరాలుగా విడివిడిగా ఉంటున్నారని, వారి దాంపత్యబంధం దాదాపుగా ముగిసినట్టేనని కోర్టుకు వివరించారు. వీరి విషయంలో ఆర్టికల్ 142ను పరిగణనలోకి తీసుకోవాలంటూ కోర్టును కోరారు.

ఇదిలా ఉంటే.. చక్కదిద్దలేనంతగా విఫలమైన వివాహాలను రద్దు చేసేందుకు రాజ్యాంగంలోని 142(1) అధికరణం ప్రకారం తమకు విశేషాధికారాలు ఉన్నాయని గతంలోనే సుప్రీంకోర్టు వెల్లడించిన విషయం విధితమే.

Tags

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×