EPAPER

IND VS ZIM 5th T20I Match: ఆఖరి మ్యాచ్ లో చిత్రమైన రికార్డ్.. బాల్ పడకుండానే..13 పరుగులు

IND VS ZIM 5th T20I Match: ఆఖరి మ్యాచ్ లో చిత్రమైన రికార్డ్.. బాల్ పడకుండానే..13 పరుగులు

Yashasvi Jaiswal Creates new World Record (sports news today) : జింబాబ్వే పర్యటనలో టీమ్ ఇండియా ఆఖరి టీ 20 మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. ఈ సంగతి అందరికీ తెలిసిందే. క్రికెట్ మ్యాచ్ ల్లో కొన్ని రికార్డులు చాలా చిత్రంగా ఉంటాయి. ఒక చిన్న పిన్ను పడినా, అది కూడా రికార్డే అంటుంటారు. అలాంటిదే ఇక్కడ ఒకటి జరిగింది. మరి అది బ్యాటర్ కి వచ్చిందా? బౌలర్ కి వచ్చిందా? లేదంటే మ్యాచ్ కి వచ్చిందా? అంటే అదేం కాదు. బాల్ పడకుండానే 13 పరుగులు వచ్చాయి. అంతేకాదు అదే స్కోరు మీద, ఒక వికెట్ కూడా కోల్పోయిన జట్టుగా టీమ్ఇండియాకి ఒక రికార్డు వచ్చింది. అదెలా జరిగిందని అనుకుంటున్నారా?


టాస్ ఓడిన టీమ్ ఇండియా మొదట బ్యాటింగ్ కి వచ్చింది. యశస్వి స్ట్రయికింగ్ లో ఉన్నాడు. అనూహ్యంగా పేసర్ ని పంపించకుండా జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా తను బౌలింగుకి వచ్చాడు. మొదటి ఓవర్ ని స్పిన్ తో మొదలెట్టాడు. మరి యశస్వి ఊరుకుంటాడా? అంతకుముందు మ్యాచ్ లో 93 పరుగులు చేసి నాటౌట్ గా ఉన్నవాడు, ఈసారి మ్యాచ్ లో మరింత దూకుడుగా మొదలెట్టాడు.

అలా వేసిన ఫస్ట్ బాల్ ని సిక్స్ కొట్టాడు. అనుకోకుండా అది నోబాల్ వచ్చింది. అంటే అప్పటికి లీగల్ గా బాల్ పడకుండానే స్కోరు బోర్డుపై 7 పరుగులు వచ్చాయి. తర్వాత ఫ్రీ హిట్ గా వచ్చిన బాల్ ని కూడా యశస్వి సిక్స్ కొట్టాడు. దీంతో బాల్ పడకుండానే స్కోరు బోర్డుపై 13 పరుగులు వచ్చాయి. తర్వాత అదే ఓవర్ నాలుగో బంతికి యశస్వి అవుట్ అయిపోయాడు. అంటే రెండు డాట్ బాల్స్ తర్వాత వికెట్ వచ్చింది.


Also Read: వన్డే, టెస్టుల రిటైర్మెంట్‌పై రోహిత్‌శర్మ క్లారిటీ

ఇలా ఒక బంతికి ఒక జట్టు 10 లేదా అంతకంటే ఎక్కువ పరుగులు చేయడం గతంలో జరిగినట్టు చెబుతున్నారు. ఇంతకుముందు ఈ ఫీట్ శ్రీలంక, పాకిస్థాన్ జట్టు పేరిట ఉండేది. న్యూజిలాండ్ తో జరిగిన మ్యాచ్‌లో పాక్ బౌలర్ 1 బంతికి 9 పరుగులిచ్చి వికెట్ తీసుకున్నాడు. అలాగే మరో మ్యాచ్ లో శ్రీలంకకు చెందిన బౌలర్ దిల్షాన్ మధుశంక లీగల్ బాల్‌లో 10 పరుగులు ఇచ్చాడు. ఇప్పుడు జింబాబ్వే-ఇండియా మధ్య బాల్ పడకుండానే 13 పరుగులు వచ్చాయి.

Related News

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Big Stories

×