EPAPER

Rohit Sharma reveals: వన్డే, టెస్టుల రిటైర్మెంట్‌పై రోహిత్‌శర్మ క్లారిటీ

Rohit Sharma reveals: వన్డే, టెస్టుల రిటైర్మెంట్‌పై రోహిత్‌శర్మ క్లారిటీ

Rohit Sharma reveals: టీమిండియా కెప్టెన్ రోహిత్‌శర్మ ఇప్పుడేం చేస్తున్నాడు? మైదానంలోకి వచ్చే అవకాశం ఉందా? వన్డేలు, టెస్టులకు రిటైర్మెంట్ ఇస్తున్నాడా? టీ20 కప్పు గెలవడంతో రిటైర్‌మెంట్‌కు ఇదే సమయమని అంటున్నారు. అందులోనూ వయస్సు 37 పైమాటే. ఇప్పుడు మిగతా ఫార్మాట్లకు దూరంగా ఉంటే బెటరనే ప్రచారం సాగుతోంది.


టీ20 ప్రపంచకప్ గెలవడంతో ఆ ఫార్మాట్ నుంచి రిటైర్‌మెంట్ తీసుకున్నారు కెప్టెన్ రోహిత్ ‌శర్మ, విరాట్ కోహ్లి, రవీంద్ర జడేజాలు. మిగతా రెండు ఫార్మాట్ల నుంచి ఎప్పుడు దూరంగా ఉండబోతున్నారనే దానిపై అనేక ఊహాగానాలు లేకపోలేదు. రోహిత్ ఇప్పుడున్న సమయంలో క్రికెట్ కెరీర్‌కు గుడ్ బై చెప్పేస్తే బెటరని అంటున్నారు. కాస్త గౌరవప్రదంగా ఉంటుందని అంటున్నారు. దీనివల్ల కొత్తవారికి ఛాన్స్ ఇవ్వడమేకాదు.. జట్టుకు సలహాలు ఉపయోగపడతాయని అంటున్నారు.

వచ్చే ఏడాదిలో జరగనున్న వరల్డ్ టెస్టు ఛాంపియన్‌షిప్‌కు కెప్టెన్‌‌గా రోహిత్‌శర్మ వ్యవహరిస్తాడని బీసీసీఐ సెక్రటరీ జై షా కొద్దిరోజుల కిందట క్లారిటీ ఇచ్చారు. అయినా రోహిత్ రిటైర్‌మెంట్ వార్తలు జోరుగా వస్తున్నా యి. ప్రస్తుతం అమెరికాలోని డాలస్‌లో క్రికెట్ అకాడమీ ప్రారంభానికి అక్కడికి వెళ్లాడు హిట్ మ్యాన్. ఈ కార్యక్రమం తర్వాత అభిమానులు అడిగిన ప్రశ్నలకు తనదైన శైలిలో సమాధానం ఇచ్చాడు. ఇంకొంత కాలం తాను క్రికెట్ ఆడుతానని ఈ విషయంలో ఎలాంటి ప్రణాళికలు లేవని మనసులోని మాట బయట పెట్టాడు.


Also read: ‘టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ మా దేశంలో ఆడాల్సిందే’.. పాకిస్తాన్ బెదిరింపు

ఇదిలావుండగా ఈనెలలో శ్రీలంక టూర్ ఉంది. ఈ సిరీస్‌కు రోహిత్‌శర్మ, విరాట్‌కోహ్లీ విశ్రాంతి తీసుకునే ఆలోచన ఉన్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో వన్డేలకు కెప్టెన్‌గా కేఎల్ రాహుల్‌ను నియమించే ఛాన్స్  తీసుకునే ఛాన్స్ వుంది. శ్రీలంక టూరు నుంచే కోచ్‌గా గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టనున్నాడు.

 

Tags

Related News

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

Big Stories

×