EPAPER

BRS Merge In BJP: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం? బండి సంజయ్ లీక్..?

BRS Merge In BJP: బీజేపీలో బీఆర్ఎస్ విలీనం? బండి సంజయ్ లీక్..?

BRS Party Merge In BJP Bandi Sanjay leak: తెలంగాణ సార్వత్రిక ఎలక్షన్స్ లో ఘోర పరాజయం పాలైన బీఆర్ఎస్ పార్టీకి వరుస షాక్ లు  తగులుతూనే ఉన్నాయి. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తగులుతున్న షాక్‌లతో కారు పార్టీ కోలుకోలేని పరిస్థితి నెలకొంది. అసెంబ్లీలో 39 నుంచి 29కి తగ్గిపోయింది బీఆర్ఎస్ బలం.. లోక్‌సభలో కారుపార్టీకి అసలు ప్రాతినిధ్యమే లేదు. ఇక రాజ్యసభలో ఉన్న నలుగురు సభ్యులు కూడా పార్టీ మార్చే పరిస్థితి కనపడుతోంది. దాంతో అసలు బీఆర్ఎస్ ఉనికే ప్రశ్నార్ధకంగా మారింది.


తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో ఓటమిపాలైన బీఆర్‌ఎస్‌కు షాక్‌ల మీద షాక్‌లు తగులుతూనే ఉన్నాయి. ఘోర పరాజయం నుంచి గులాబీ బాస్ కోలుకోకముందే పార్టీలో వలసల పర్వానికి తెర లెగిసింది. ఇటు రాష్ట్రంలో అటు కేంద్రంలో తగులుతున్న షాక్‌లతో కారు పార్టీ కోలుకోలేని పరిస్థితి నెలకొంది. కాంగ్రెస్‌లో బీఆర్ఎస్ఎల్పీ విలీనమే టార్గెట్‌గా ఆపరేషన్ ఆకర్ష్ నడుస్తున్నట్లు కనిపిస్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి 39 మంది ఎమ్మెల్యేలు గెలిచారు.

కంటోన్మెంట్ ఉపఎన్నికలో కాంగ్రెస్ గెలుపుతో 38కి బీఆర్ఎస్ బలం తగ్గిపోయింది. ఇప్పటి వరకూ 9 మంది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు గులాబీ పార్టీకి గుడ్ బై చెప్పి కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. దీంతో అసెంబ్లీలో కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలం 73కు చేరుకుంది. మరో 20 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, 10 మంది ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరడానికి క్యూలో ఉన్నారంట.


పార్టీని ఏదో ఒకటి చేసి గాడిన పెట్టాలని గులాబీ బాస్ ఫాంహౌస్ బుజ్జగింపులు మొదలుపెట్టిన ప్రతిసారీ వరుస ఎదురుదెబ్బలే తగులుతుండటం గమనార్హం. వాస్తవానికి మూడింటి రెండొంతుల మంది ఎమ్మెల్యేలు పార్టీ మారితే ఆ పార్టీ ఎల్పీ వీలినమైట్లే. ఆ లెక్క ప్రకారం బీఆర్ఎస్ నుంచి 26 మంది ఎమ్మెల్యేలు జెండా ఎత్తేస్తే ఆ పార్టీ ఉనికి శాసనసభలో గల్లంతవుతుంది. ఇప్పటికే కంటోన్మెంట్ బైపోల్స్‌లో గెలుపు, 9 మంది ఎమ్మెల్యేలు వచ్చి చేరడంతో కాంగ్రెస్ 10 స్థానాలు పెంచుకుంది. ఇంకో 16 మంది ఎమ్మెల్యేలు కారుదిగితే ఆ వీలినం తతంగం ముగిసిపోతుంది.

తెలంగాణలో అధికారంలో ఉన్న కాంగ్రెస్.. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను చేర్చుకునే పనిలో ఉంటే అటు కేంద్రంలోని బీజేపీ కూడా ఆపరేషన్ ఆకర్ష్ స్టార్ట్ చేసినట్లు కనిపిస్తుంది. అయితే ఎమ్మెల్యేలను చేర్చుకోవాలంటే వారు పదవులకు రాజీనామా చేసి బైపోల్స్‌కు సిద్దమై రావాలంటున్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్ పనిలో పనిగా బీఆర్ఎస్ నేత, మాజీ మంత్రి హరీశ్ రావుపై కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన కామెంట్స్ చేశారు. హరీష్ రావు మంచి నాయకుడని, ప్రజల మనిషని కొనియాడారు. హరీష్ బీజేపీలోకి వస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రావాలని చెప్పారు. హరీష్ రావు వివాద రహితుడని, తానేమి ఆయనతో మాట్లాడలేదని బండి పేర్కొన్నారు. బీఆర్ఎస్ నేతల్లో హరీశ్ ఒక్కడే మంచి నేతని కితాబిచ్చారు.

Also Read: రికవరీ నోటీసులపై సీఎస్ కీలక ఆదేశాలు

ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల్లో పదవులకు రాజీనామా చేసి బీజేపీలో చేరే సాహసం ఎవరూ చేయరన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది. మరోవైపు బీఆర్ఎస్‌కు లోక్‌సభ ఎంపీలు లేకపోవడంతో ఉన్న రాజ్యసభ సభ్యులను చేర్చుకునే పనిలో బీజేపి పడిందంటున్నారు. ఈ క్రమంలో బీజేపీలో బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ విలీనం చేయడానికి రంగం సిద్ధమైందని తెలుస్తోంది. బీఆర్ఎస్‌కు ఉన్న నలుగురు రాజ్యసభ సభ్యులు కమలం గూటికి నలుగురు చేరతారన్న ప్రచారం గట్టిగానే జరుగుతోంది.

విలీనంపై ఢిల్లీలో బీజేపీ పెద్దలతో బీఆర్ఎస్ కీలక నేతలు, మాజీ మంత్రులు కేటీఆర్, హరీశ్ రావులు ఒప్పందం చేసుకున్నట్లు బీఆర్ఎస్‌లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ విలీనం తర్వాత ఎమ్మెల్సీ కవిత తీహార్ జైలు నుంచి బయటికి వచ్చే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంటున్నారు . బీఆర్ఎస్ నుంచి ప్రస్తుతం రాజ్య సభలో పార్థసారథి రెడ్డి, దామోదర్‌రావు, సురేశ్ రెడ్డి, వద్ధిరాజు రవిచంద్రలు ఎంపీలుగా ఉన్నారు. ఆ క్రమంలో తమ ఎంపీలు కాంగ్రెస్‌లో చేరకుండా బీఆర్ఎస్ పెద్దలు కమలం పార్టీ వైపు మొగ్గుచూపుతున్నారంటున్నారు. అందుకే బండ సంజయ్ స్వయంగా హరీష‌రావుని ఆకాశానికెత్తేస్తున్నారంట. మరి అదే జరిగితే బండి సంజయ్ పఠిస్తున్న రాజీనామా మంత్రం రాజ్యసభ ఎంపీలకు వర్తిస్తుందో లేదో చూడాలి.

Tags

Related News

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Big Stories

×