EPAPER

Euro Cup 2024: యూరో కప్‌ విజేతగా స్పెయిన్‌..నాలుగో సారి టైటిల్!

Euro Cup 2024: యూరో కప్‌ విజేతగా స్పెయిన్‌..నాలుగో సారి టైటిల్!

Euro Cup 2024 Spain vs England: యూరో కప్ 2024 ఫుట్ బాల్ టోర్నీ విశ్వ విజేతగా స్పెయిన్ నిలిచింది. ఇంగ్లండ్‌తో జరిగిన హోరాహోరీ ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ యూరో కప్ విజేతగా అవతరించింది. ఈ మ్యాచ్‌లో ఇంగ్లాండ్‌ను 2-1 తేడాతో విజయం సాధించింది. దీంతో స్పెయిన్ నాలుగోసారి యూరో టైటిల్ సాధించింది.


బెర్లిన్ వేదికగా జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో స్పెయిన్ రెండు గోల్స్ చేయగా..ఇంగ్లండ్ ఒక్క గోల్ చేసి ఓడింది. దీంతో స్పెయిన్ నాలుగోసారి యూరో కప్ గెలుచుకుంది. అంతకుముందు 1964, 2008,2012లలో స్పెయిన్ యూరో కప్ గెలుచుకున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీలో ఓటమి అన్నదే లేకుండా ఫైనల్ చేరిన స్పెయిన్..ఇందులోనూ అదరగొట్టి విక్టరీగా నిలిచింది.

అయితే తొలిసారి యూరో కప్ సాధించాలని అనుకున్న ఇంగ్లాండ్ ఆశలు ఆవిరయ్యాయి. గత యూరోకప్ టోర్నీలో రన్నరప్ అయిన ఇంగ్లండ్ ఏసారి కూడా అదే హోాదాతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. రెండు సార్లు ఫైనల్ చేరిన ఇంగ్లండ్‌కు అదృష్టం కలిసిరాలేదు. తొలి అర్ధభాగం తీవ్రంగా పోరాడినప్పటికీ రెండో భాగంలో స్పెయిన్ ఆధిక్యం సాధించింది.


Also Read: జకోవిచ్‌ను చిత్తుగా ఓడించి ‘వింబుల్డన్ టైటిల్’ గెలిచిన అల్కరాస్

తొలి సెషన్‌లో ఇరు జట్లు గోల్ చేయలేకపోయాయి. కానీ రెండో సెషన్‌ ప్రారంభమైన రెండు నిమిషాలకే స్పెయిన్ గోల్ చేసి ఖాతా తెరిచింది. 47 నిమిషాల వద్ద స్పెయిన్ ఆటగాడు నికో విలియమ్స్ అద్భుతంగా గోల్ చేశాడు. తర్వాత 73 నిమిషాల వద్ద ఇంగ్లండ్ ఆటగాడు కోలె పాల్ మెర్ గోల్ చేశాడు. దీంతో ఇరు జట్లు 1-1తో సమమయ్యాయి. ఇక చివరిగా 86వ నిమిషంలో స్పెయిన్ రెండో గోల్ చేసింది. స్పెయిన్ ఆటగాడు మైకెల్ ఒయార్జాబల్ గోల్ చేయడంతో స్పెయిణ్ ఆధిక్యంలోకి వెళ్లింది. తర్వాత ఇంగ్లండ్ గోల్ చేయలేకపోవడంతో స్పెయిన్ విశ్వ విజేతగా నిలిచింది.

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×