EPAPER

Champions Trophy 2025: ‘టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ మా దేశంలో ఆడాల్సిందే’.. పాకిస్తాన్ బెదిరింపు

పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పిసీబీ).. టీమిండియాకు ఒక హెచ్చరిక జారీ చేసింది. 2025 చాంపియన్స్ ట్రోఫీ సిరీస్ లో మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్ లో జరుగనున్నాయి. టీమిండియా కూడా మిగతా దేశాలతోపాటు పాకిస్తాన్ లోనే మ్యాచ్‌లు ఆడాలని పిసీబీ చెబుతోంది. అలా చేయకపోతే.. 2026లో భారత్, శ్రీలంకలో జరగబోయే T20 ప్రపంచకప్‌కు పాకిస్తాన్ క్రికెట్ జట్టు బాయ్ కాట్ చేస్తుందని ప్రకటించింది.

Champions Trophy 2025: ‘టీమిండియా చాంపియన్స్ ట్రోఫీ మా దేశంలో ఆడాల్సిందే’.. పాకిస్తాన్ బెదిరింపు

Champions Trophy 2025: పాకిస్తాన్ క్రికెట్ బోర్డు(పిసీబీ).. టీమిండియాకు ఒక హెచ్చరిక జారీ చేసింది. 2025 చాంపియన్స్ ట్రోఫీ సిరీస్ లో మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్ లో జరుగనున్నాయి. టీమిండియా కూడా మిగతా దేశాలతోపాటు పాకిస్తాన్ లోనే మ్యాచ్‌లు ఆడాలని పిసీబీ చెబుతోంది. అలా చేయకపోతే.. 2026లో భారత్, శ్రీలంకలో జరగబోయే T20 ప్రపంచకప్‌కు పాకిస్తాన్ క్రికెట్ జట్టు బాయ్ కాట్ చేస్తుందని ప్రకటించింది.


పాకిస్తాన్‌-ఇండియా దేశాల మధ్య శత్రుత్వం, ఆ దేశంలో హింసాత్మక ఘటనలు తరుచూ జరుగుతుండడంతో భారత్ క్రికెటర్స్‌కు ప్రమాదముందని భావించి గత కొన్ని సంవత్సరాలుగా భారత ప్రభుత్వం టీమిండియాను పాకిస్తాన్‌లో ఆడేందుకు అనుమతించడం లేదు. గతంలో శ్రీలంక క్రికెట్ జట్టు.. పాకిస్తాన్ లో సిరీస్ ఆడేందుకు వెళ్లినప్పుడు వారిపై దాడులు కూడా జరిగాయి. 2008లో చివరిసారిగా టీమిండియా పాకిస్తాన్ వెళ్లి మ్యాచ్‌లో ఆడింది. ఆ తరువాత 2008లోనే ముంబైలో ఉగ్రదాడులు జరిగిన తరువాత నుంచి భారత ప్రభుత్వం టీమిండియా పాకిస్తాన్ వెళ్లేందుకు అనుమతించడం లేదు.

Also Read: యువరాజ్ ఆల్ టైం ఫేవరేట్ టీం ఇదేనంటా.. ధోనీకి చోటులేదా?


దీంతో టీమిండియా పాకిస్తాన్ లో జరిగే క్రికెట్ సిరీస్‌కు వెళ్లడం లేదు. ఒకవేళ ఆ దేశంలో సిరీస్ నిర్వహించినా.. ఇండియా ఆడబోయే మ్యాచ్‌లు హైబ్రిడ్ మోడల్‌లో దుబాయ్, శ్రీలంక లాంటి దేశాల్లో బిసిసిఐ కోరిక మేరకు ఐసిసి నిర్వహించింది. 2023 ఆసియా కప్ సమయంలో ఇలాగే జరిగింది. రాబోయే సంవత్సరంలో చాంపియన్స్ ట్రోఫీ పాకిస్తాన్ లో జరుగనుండగా.. ఈసారి కూడా ఇండియా ఆడబోయే మ్యాచ్‌లు దుబాయ్ లేదా శ్రీలంక దేశాల్లోనే జరుగుతాయని.. ఇటీవల జాతీయ మీడియాలో కథనాలు వచ్చాయి.

ఈ కథనాలపై పాకిస్తాన్ క్రికెట్ బోర్డు స్పందించి.. ఇండియా మా దేశంలో ఆడకపోతే.. పాక్ జట్టు కూడా 2026 టి20 ప్రపంచకప్‌ బహిష్కరిస్తుందని ఘాటు ప్రకటన చేసింది. ఇది ఒక రకంగా బ్లాక్ మెయిల్ చేయడమే. పాకిస్తాన్ వార్తా సంస్థ జియో న్యూస్ రిపోర్ట్ ప్రకారం.. జూలై 19 నుంచి జూలై 22 వరకు కొలంబోలో ఐసిసి వార్షిక సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో చాంపియన్స్ ట్రోఫీ నిర్వహణ గురించి చర్చ జరుగుతుంది. ఆ సమయంలో బిసిసిఐ టీమిండియా ఆడబోయే మ్యాచ్‌లు హైబ్రిడ్ మోడల్ ప్రకారం.. దుబాయ్ లేదా శ్రీలంకలో నిర్వహించాలని ప్రతిపాదన చేయనుంది. ఒక వేళ అదే జరిగితే పిసీబీ ఆ ప్రతిపాదనను తిరస్కరించేందుకు నిర్ణయం తీసుకుంది.

Also Read: టెస్టు క్రికెట్‌లో అరుదైన బౌలర్ జేమ్స్ ఆండర్సన్.. అతని పేరున్న రికార్డ్స్ ఇవే..

ఎట్టి పరిస్థితుల్లోనూ చాంపియన్స్ ట్రోఫీ 2025.. మ్యాచ్‌లన్నీ పాకిస్తాన్‌లో నిర్వహిస్తామని ప్రకటించింది. దీనిపై సోషల్ మీడియాలో హర్భజన్ సింగ్ లాంటి పలువురు మాజీ క్రికెటర్లు పిసీబీ తీరును విమర్శిస్తున్నారు. పాకిస్తాన్ జట్టు 2026 టి20 ప్రపంచ కప్ ఆడకపోతే ఇండియాకు వచ్చిన నష్టమేమీ లేదని.. కానీ పాకిస్తాన్‌లో టీమిండియా క్రికెట్ ఆడాలో లేదో అది బిసిసిఐ నిర్ణయమని.. ఇలా బ్లాక్ మెయిల్ చేస్తే.. పాకిస్తాన్‌కే నష్టమని హర్భజన్ సింగ్ పిసీబీ తీరుపై మండిపడ్డాడు.

 

Tags

Related News

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Big Stories

×