EPAPER

Honey For Skin Glow: తేనెతో గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం !

Honey For Skin Glow: తేనెతో గ్లోయింగ్ స్కిన్ మీ సొంతం !

Honey For Skin Glow: ముఖం అందంగా కనిపించడం కోసం చాలా మంది రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. అందుకోసం మార్కెట్లో దొరికే ఫేస్ క్రీమ్స్ వాడుతుంటారు. ఫలితంగా లాభం లేకపోగా.. దీర్ఘకాలిక చర్మ సమస్యలకు ఇవి కారణమవుతాయి. గ్లోయింగ్ స్కిన్ కోసం ఈ మధ్య చాలామంది హోం రెమెడీస్ ఫేస్ ప్యాక్‌లను వాడుతున్నారు. ఇంట్లోనే ఉండే పదార్థాలు చర్మంపై ఫలితాలు ఆలస్యంగా చూపించినప్పటికీ వీటివల్ల దుష్ప్రభావాలు ఉండవు.


మీ వంటగదిలో ఎప్పుడూ ఉండే తేనే చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ముఖంపై మొటిమలు, మచ్చలు, మూసుకుపోయిన రంధ్రాలు, వృద్ధాప్య సంకేతాలకు వీడ్కోలు చెప్పడానికి ఎంతగానో సహాయపడుతుంది. కానీ దీన్ని ఎలా ఉపయోగించాలి ? చర్మంపై తేనె రాసుకునే ముందు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనే విషయాల గురించి చాలా మందికి అవగాహన ఉండదు.

తేనెలో యాంటీ మైక్రోబయాల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. తేనే తరుచుగా ఫేస్ కు ఉపయోగించడం వల్ల మీ సౌందర్యాన్ని రెట్టింపు చేసుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. చర్మంపై సహజ సూక్ష్మ జీవులు నాశనం చేయకుండా స్కిన్‌‌ను కాపాడడంలో ఇది మంచి ఔషధంగా పనిచేస్తుంది. చర్మానికి పోషణ అందించడానికి, గాయాలు నయం చేయడానికి ఎంతో ఉపయోగపడుతుంది. చర్మంపై తేనెను రాసుకోవడం వల్ల మొటిమలు, మచ్చలు, బ్లాక్ హెడ్స్, వైట్ హెడ్స్ నయం కావడంతో పాటు వృద్ధాప్య ఛాయలు కూడా తగ్గుముఖం పడతాయి.


ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిందల్లా చర్మంపై తేనెను ఎలా ఉపయోగించాలని మాత్రమే. సరైన పద్ధతుల్లో ఉపయోగించకపోతే ఏ పదార్థాలైన మంచి కంటే ఎక్కువ హాని చేసే అవకాశాలు ఉంటాయి. ముఖ్యంగా హనీ నేరుగా స్క్రీన్‌పై ఉపయోగించినప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. ముఖానికి తేనె ఎలా ఉపయోగించాలి దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి ఇప్పుడు చూద్దాం.
హనీ ఫేస్ క్లీనర్:
తేనెను మొటిమల సమస్య ఉన్నవారు ఫేస్ వాష్ రూపంలో ఉపయోగించడం మంచిది. మీ రెగ్యులర్ ఫేస్ వాష్‌లో ఒక టీస్పూన్ తేనెను కలిపి వాడటం వల్ల చర్మంపై ఉన్న మురికి, దుమ్ము లాంటి మలినాలు తొలగిపోతాయి. అంతేకాకుండా చర్మం ఆరోగ్యంగా మారుతుంది. కాంతివంతంగా తయారవుతుంది.
హనీ లోషన్:
పొడి చర్మంతో ఇబ్బంది పడుతున్నవారు తేనే కలిగి ఉన్న బాడీ లోషన్ వాడటం మంచిది. ఇది చర్మాన్ని మృదువుగా మారుస్తుంది. ఆర్గానిక్ తేనెతో తరచుగా ముఖంపై మసాజ్ చేయడం వల్ల చర్మానికి అవసరమైన తేమ అందడంతో పాటు ఇది మంచి మాయిశ్ఛరైజర్ లాగా పనిచేస్తుంది. హనీ నేచురల్ యాంటీ ఆక్సిడెంట్లు, ఇతర పోషకాలతో నిండి ఉంటుంది. చర్మం రంగును పెంచడంలో ఇది సహాయపడుతుంది. ప్లేస్ ఆయిల్‌కు కొన్ని చుక్కల తేనెను కలపి వాడటం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది. మచ్చలు, ముడతలు కూడా తొలగిపోతాయి. ముఖంపై ఉన్న జిడ్డు తొలగిపోవడమే కాకుండా ముఖం మెరిసిపోతుంది.

Also Read: నెల రోజులు ఉల్లిపాయలు తినడం మానేస్తే ఏం జరుగుతుందో తెలుసా ?

హనీ ఫేస్ ఫ్యాక్స్…

  • అరటిపండు, రోజ్‌వాటర్, తేనె
  • దాల్చినచెక్క, బొప్పాయి,తేనే
  • తేనె, దోసకాయ, కలబంద
  • శనగపిండి, వేపాకు, తేనే
  • ఇలా తేనెతో రకరకాల ఫేస్‌ప్యాక్‌లు తయారు చేసుకుని వాడటం వల్ల చర్మం మృదువుగా, కాంతివంతంగా మారి ఎప్పుడూ అందంగా కనిపిస్తారు.

Related News

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Tomato Face Pack: పార్లర్‌కు వెళ్లకుండానే టమాటో ఫేస్ ప్యాక్‌తో రెట్టింపు అందం మీ సొంతం !

Prawns Masala: ఆంధ్ర స్టైల్‌లో రొయ్యల మసాలా కూర ఇలా వండరంటే నోరూరిపోతుంది, రెసిపీ ఇదిగోండి

Big Stories

×