EPAPER

Chidambaram Press Meet: 50 ఏళ్ల తర్వాత ఎమర్జెన్సీపై చర్చ అవసరమా..?: చిదంబరం

Chidambaram Press Meet: 50 ఏళ్ల తర్వాత ఎమర్జెన్సీపై చర్చ అవసరమా..?: చిదంబరం

Chidambaram on Emergency Discussion: ఎమర్జెన్సీ గురించి ఎన్డీఏ చేస్తున్న విమర్శలపై కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం స్పందించారు. 50 ఏళ్ల తర్వాత ఎమర్జెన్సీపై ఎన్డీఏ ఆరోపణలు చేయడం సరికాదన్నారు. ఎమర్జెన్సీకి 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా జూన్ 25 వ తేదీని సంవిధాన్ హత్యా దివాస్‌గా ప్రకటించడాన్ని ఆయన తప్పుబట్టారు. దేశంలో ప్రస్తుతం 75 శాతం మంది 1975 నాటి ఎమర్జెన్సీ తర్వాత పుట్టినవాళ్లే అని తెలిపారు. అప్పటి ఎమర్జెన్సీ విషయంపై ఇప్పుడు తప్పొప్పులు లెక్కించడం దేనికని ప్రశ్నించారు.


జూన్ 25వ తేదీని రాజ్యాంగ హత్యా దినంగా ప్రకటిస్తూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కాంగ్రెస్ సహా విపక్షాల నుంచి అభ్యంతరాలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలోనే చిదంబరం ఇచ్చిన ఓ ప్రత్యేక ఇంటర్వ్యూలో ఎన్డీఏపై పలు విమర్శలు చేశారు. ఎమర్జెన్సీ విధించడం పొరపాటని అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ కూడా అంగీకరించారని చెప్పారు. అదే సమయంలో ఎమర్జెన్సీ నుంచి పాఠాలు నేర్చుకోకుండా 50 ఏళ్ల తర్వాత ఎమర్జెన్సీ నాటి తప్పొప్పుల గురించి చర్చించాల్సిన అవసరం ఏముందని అన్నారు. గతాన్ని బీజేపీ మర్చిపోవాలని సూచించారు.ఎన్టీఏ నేతలు 18వ శతాబ్దానికి ముందు అంశాల గురించి ఎందుకు ప్రస్తావించడం లేదని అన్నారు. ఇంకా ఈ అంశంపై రాద్ధాంతం సరికాదన్నారు.

ఇదిలా ఉంటే ఎన్డీఏ ప్రభుత్వం రాజ్యాంగ హత్యాదినంగా జూన్ 25ను పాటించాలంటూ ప్రకటించడంపై కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సహా సీనియర్ నేతలు కూడా తప్పుబట్టారు. గత పదేళ్లుగా ఎన్డీఏ ప్రతి రోజు రాజ్యాంగ హత్యను సెలబ్రేట్ చేసుకుంటోందని, దేశంలోని పేదలు, అణగారిణ ప్రజల ఆత్మగౌరవాన్ని దోచుకుంటూనే ఉంటోందని ఖర్గే విమర్శించారు. తృణమూల్ కాంగ్రెస్ సైతం కేంద్ర నిర్ణయంపై విరుచుకుపడింది. బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాల నుంచి ప్రజల దృష్టిని ఆకర్షించేందుకు, ప్రజల దృష్టిని మళ్లించేందుకు ప్రయత్నిస్తోందని ఆ పార్టీ నేత కునాల్ ఘోష్ అన్నారు.


Also Read: అది చంద్రబాబు చేతిలో ఉన్నది.. : చిదంబరం హాట్ కామెంట్స్

ఇందిరా గాంధీ విమర్శలకు గురై ఒక్కసారి అధికారం కోల్పోయారని తిరిగి ప్రధాని అధికారంలోకి వచ్చారని తెలిపారు. ఒక పేజీ చరిత్రను బీజేపీ ఏళ్ల తరబడి వాడుకుంటూ తమ తాజా వ్యతిరేక విధానాలు, దేశ దుస్థితిని కప్పిపుచ్చుకునేందుకు ప్రయత్నాలు చేస్తోందని మండిపడ్డారు.

Tags

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుస రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×