EPAPER

Sai Dharam Tej Meets CM Revanth: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సాయి ధరమ్ తేజ్..

Sai Dharam Tej Meets CM Revanth: సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన సాయి ధరమ్ తేజ్..

Actor Sai Dharam Tej Meets CM Revanth Reddy: సోషల్ మీడియా వినియోగం పెరగడంతో రోజు రోజుకూ ఆగంతకుల ఆగడాలు ఎక్కువైపోతున్నాయి. మంచి చెడు అనే తేడా లేకుండా అసభ్యకర వీడియోలు, పదజాలంతో పెచ్చిరేగిపోతున్నారు. ఇటీవల అలాంటిదే ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌ అయి తీవ్ర దూమారం రేపింది. వివరాల్లోకి వెళితే.. ఇటీవల పి హనుమంతు అనే ఒక యూట్యూబర్ అండ్ తన గ్యాంగ్‌తో కలిసి తండ్రీ కూతుళ్ల బంధంపై అసభ్యకర పదజాలంతో నోటికొచ్చినట్లు మాట్లాడారు.


అంతేకాకుండా డార్క్ కామెడీ పేరుతో ఎవరూ వినలేని రీతిలో చాలా నీచంగా.. అసభ్యకరంగా మాట్లాడుతూ ప్రవర్తించారు. డబుల్ మీనింగ్ డైలాగ్స్‌తో ఛీ.. ఛీ అనేంతగా వెకిలి నవ్వు నవ్వుతూ అత్యంత క్రూరంగా వ్యవహరించారు. అందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయింది. ఈ వీడియో చూసిన చాలా మంది యూట్యూబర్ హనుమంతు అండ్ గ్రూప్‌పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఒక తండ్రీ కూతుళ్ల బంధంపై ఇలాంటి పదజాలం వాడటం ఏ మాత్రం మంచి పద్దతి కాదని ఫైర్ అవుతున్నారు.

పలువురు సోషల్ మీడియా నెటిజన్లు వారిపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. అయితే అదే సమయంలో టాలీవుడ్ హీరో సాయిధరమ్ కూడా స్పందించారు. ఈ సందర్భంగా తల్లిదండ్రులు తమ పిల్లల ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో పోస్టు చేసే ముందు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించాడు. సోషల్ మీడియాలో ఉండే క్రూరమైన మృగాల నుంచి పిల్లలను కాపాడుకోవాలని విజ్ఞప్తి చేశాడు.


Also Read: బ్రేకింగ్.. యూట్యూబర్ ప్రణీత్ హనుమంతు అరెస్ట్

ఇందులో భాగంగా ఈ ఘటపై తీవ్రమైన చర్యలు తీసుకోవాలని అటు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సీఎంలను కోరారు. ఇది అత్యంత భయంకరమైనదని పేర్కొన్నారు. ఇలాంటి రాక్షసులపై తప్పకుండా చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రస్తుత కాలంలో పిల్లల భద్రత చాలా అవసరమని తెలిపారు. ఈ మేరకు రెండు తెలుగు రాష్ట్రాల సీఎంలు, డిప్యూటీ సీఎంలను సోషల్ మీడియాలో ట్యాగ్ చేశారు. సాయిధరమ్ తేజ్ పోస్టుపై సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క స్పందించారు.

ఈ సమస్యను తమ దృష్టికి తీసుకొచ్చిన సాయిధరమ్ తేజ్‌కు ధన్యవాదాలు తెలిపారు. దీనిని పరిశీలించి తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. చెప్పిన విధంగానే రాష్ట్రప్రభుత్వం హనుమంతుతో పాటు అతని గ్యాంగ్‌ను అరెస్టు చేసి జైలుకు పంపింది. ఇందులో హనుమంతుపై 67బీ ఐటీ, ఫోక్సో 79, 294 బీఎన్‌ఎస్ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇందులో హనుమంతును ఏ1 గా, నాగేశ్వర్ రావును ఏ2గా, యువరాజ్ ఏ3గా, సాయి ఆదినారాయణను ఏ4గా నిర్ధారించారు.

Also Read: Kiran Abbavaram: స్థాయి అంటూ కిరణ్ ను అవమానించిన రిపోర్టర్.. ఇచ్చిపడేసిన యంగ్ హీరో

ఈ సమస్యను లేవనెత్తిన నటుడు సాయిధరమ్ తేజ్‌ను తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. తాజాగా సాయి ధరమ్ తేజ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసారు. ఇవాళ ఉదయం జూబ్లీహిల్స్ లోని ముఖ్యమంత్రి నివాసానికి వెళ్లిన సాయి తేజ్ రేవంత్ రెడ్డితో భేటీ అయ్యారు. ఈ మేరకు పిల్లల దుర్వినియోగాన్ని అరికట్టడానికి, ఆఫ్‌లైన్, ఆన్‌లైన్‌ ద్వారా పిల్లలను సరైన రీతిలో నడిపించే మార్గాలపై చర్చించారు. ఇందులో భవనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, మంత్రి కొండా సురేఖ పాల్గొన్నారు.

Related News

10 Years For Aagadu: అంచనాల మీద వచ్చాడు, ఆగకుండా పోయాడు

Mahesh Babu – Trisha : త్రిషకు మహేష్ బాబు ముందే తెలుసా? ఇంటర్వ్యూ లో షాకింగ్ విషయాలు..

Prabhas Spirit: ఈ కాంబో కుదిరితే పూనకాలే.. ‘స్పిరిట్’లో విలన్స్‌గా ఆ బాలీవుడ్ స్టార్ కపుల్?

Jani Master Case : చట్టాలతో అమ్మాయిలు ఓవర్ స్మార్ట్ అవుతున్నారు… జానీ కేసుపై లేడీ కొరియోగ్రాఫర్..

Actress : హీరోయిన్ కు 600 కోట్ల ఆస్తిని రాసిస్తానన్న దర్శకుడు… కానీ ఆమె చేసిన పని తెలిస్తే బుర్ర కరాబ్

Jani Master: పోలీసుల అదుపులో జానీ మాస్టర్… డీసీపీ ప్రెస్ నోట్‌లో కీలక విషయాలు

Vishwambhara : మెగా ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్… అనుకున్న టైమ్ కే విశ్వంభర ఆగమనం

Big Stories

×