EPAPER

TG Govt Green Signal to DSC: నిరుద్యోగుల ధర్నాలకు చెక్.. డీఎస్సీకి తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్..!

TG Govt Green Signal to DSC: నిరుద్యోగుల ధర్నాలకు చెక్.. డీఎస్సీకి  తెలంగాణ సర్కార్ గ్రీన్ సిగ్నల్..!

Telangana Government Green Signal to DSC: తెలంగాణలో నిరుద్యోగుల ఆందోళనలపై ప్రభుత్వం స్పందించింది. ఈ విషయంలో ప్రభుత్వం కీలక నిర్ణయం దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. సామరస్యంగా పరిష్కారం చూపేలా ప్రభుత్వం ప్రయత్నాలు మొదలు పెట్టింది. రెండేళ్లుగా పెండింగ్‌లో ఉన్న డీఎస్సీని వాయిదా వేస్తే మరింత నష్టమన్న ఆలోచనలు చేస్తోంది ప్రభుత్వం.


రాష్ట్రంలో ఇప్పటికే ఉపాధ్యాయుల బదిలీలను చేపట్టింది. ప్రభుత్వం బదిలీలతో చాలా చోట్ల ఖాళీలు గుర్తించారు. అన్ని స్కూళ్లలో సరిపడా టీచర్లు ఉండాలనే పోస్టులు పెంచి డీఎస్సీ నిర్వహించేలా చర్యలు తీసుకొంటున్నారని సమాచారం ఉంది. ప్రస్తుతం డీఎస్సీని నిర్వహించకుంటే అర్హులైన వారు చాలా నష్టపోతారని భావిస్తోంది ప్రభుత్వం.

ఎస్సీ, ఎస్టీ,బీసీ విద్యార్థులు విలువైన విద్యా ఏడాదిని కోల్పోతారని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నారు. ఇలాంటి నష్టాలు కూడా జరగకుండా డీఎస్సీని నిర్వహించేందుకు సిద్ధమవుతున్నారని టాక్‌ వినిపిస్తోంది. ఇప్పటికే టెట్‌ నిర్వహించారు. ఎట్టి పరిస్థితుల్లోనూ డీఎస్సీ నిర్వహించి ఉపాధ్యాయ పోస్టులను భర్తీ చేయాలనే ప్రభుత్వం అడుగులేస్తోంది. అటు డీఎస్సీ, గ్రూప్2 పరీక్షలు ఒక్క రోజు తేడాతో ఉండడం పైనా చర్చిస్తున్నారు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ బోర్డు. గ్రూప్ 2 వాయిదా వేస్తే న్యాయపరమైన సమస్యలు వస్తాయా అనే చర్చలు చేస్తున్నారు.


Also Read: ఇది రైల్వే స్టేషనా? లేక ఫైవ్ స్టార్ హోటలా?

సమస్యలు లేకపోతే నవంబర్ లో గ్రూప్ 3తో పాటే గ్రూప్ 2 నిర్వహించే అవకాశం ఉంది. గ్రూప్ 2, గ్రూప్ 3 సిలబస్ ఒకటే కాబట్టి అభ్యర్థులకు కలిసివస్తుందన్న చర్చ సాగుతోంది. త్వరలోనే ప్రభుత్వానికి రిపోర్ట్ ఇచ్చే అవకాశం ఉంది. అదే సమయంలో జాబ్ క్యాలెండర్ పైనా కసరత్తు ముమ్మరం చేశారు ప్రభుత్వ అధికారులు. ఇప్పటికే ప్రకటించిన పోస్టులు భర్తీ చేసి.. ఖాళీలకు జాబ్ క్యాలెండర్ ఇచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నారు. వరుసగా ఉద్యోగాల భర్తీ ఉంటుందని.. దీనిపై నిరుద్యోగులు ఆందోళన చెందవద్దని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

Tags

Related News

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Skill University: స్కిల్ వర్సిటీకి రూ.100 కోట్లు కేటాయిస్తాం.. ఈ ఏడాది నుంచే కోర్సులు ప్రారంభం: సీఎం రేవంత్ రెడ్డి

Mahesh Kumar: రాహుల్ గాంధీ వదిలిన బాణాన్ని నేను.. తగ్గే ప్రసక్తే లేదు: మహేశ్ కుమార్ గౌడ్

Big Stories

×