EPAPER

Survey on Husbands: పతియే ప్రత్యక్ష నరకమంటున్న భార్యలు.. సర్వేలో సంచలన విషయాలు!

Survey on Husbands: పతియే ప్రత్యక్ష నరకమంటున్న భార్యలు.. సర్వేలో సంచలన విషయాలు!

Popular Survey on Irresponsible Husbands: మహిళలు మహరాణులు అన్నారు కవులు. పేరులోనే మహరాణులు పనులలో మాత్రం పనిమనుషుల కన్నా ఘోరం. పొద్దున్న సూర్యుడు పొడవక ముందే నిద్రలేచి భర్త, పిల్లలకు సపర్యలు చేసి మళ్లీ వాళ్లు సాయంత్రంవచ్చేసరికి వాళ్లకు స్నాక్స్,మళ్లీ రాత్రి డిన్నర్ ఇలా సూర్యుడి కన్నాఎక్కువగా శ్రమిస్తుంటారు. వారానికి ఒక్కసారైనా సెలవు కావాలని కోరుకున్నా మధ్య తరగతి మెంటాలిటీ వాటిని అణిచివేస్తుంది. కనీసం ఆ ఆలోచన కూడా దగ్గరకు రానివ్వకుండా తమ పని యంత్రాలుగా చేసుకునిపోవడం అనాదిగా ఆడవారికి అలవాటైపోయింది. ఇక ఏ మాత్రం కుటుంబ బాధ్యలేని భర్తలు కేవలం తాము ఆఫీసు పనిచేయడమే చాలా గొప్ప అని ఫీలవుతుంటారు. కొందరు ఆడవాళ్లు ఆఫీసు పనులు చేస్తూనే ఇంటి పనులకు ఏ మాత్రం ఆటంకం లేకుండా రెండింటికీ న్యాయం చేస్తుంటారు.


బాధ్యతలు లేని భర్తలపై సర్వే..

అయితే ఇటీవల ఓ ఆసక్తికరమైన సర్వే వెలుగులోకి వచ్చింది. ముఖ్యంగా కుటుంబ వ్యవస్థ పట్ల బాధ్యతలేని భర్తలపై సర్వే చేశారు. వీళ్ల ప్రవర్తన, పనితీరు వలన భార్యలు ఎంతలా మానసికంగా, శారీరకంగా కుంగిపోతున్నారో తెలియజేశారు. ఆ సర్వే సంస్థ ఆడవారు చెప్పిన సమాధానం విని అవాక్కయ్యారు. తాము ఎక్కువగా ఒత్తిడికి గురవ్వడానికి ప్రధాన కారణం తమ పిల్లలు కాదని అంటున్నారు. కేవలం తమ భర్తలు ఇంటి పనుల విషయంలో సహకరించకపోవడమే అంటున్నారు. ఇంటి పనుల విషయంలో ఏ మాత్రం బాధ్యత వహించకపోవడమే తమ అనారోగ్యాలకు కారణం అని తేల్చిచెప్పారు.


మానసిక ఒత్తిడి..

తమ భర్తల తీరుతో తీవ్రమైన ఒత్తిడికి లోనవుతున్నామని చెబుతున్నారు. కనీసం ఇంటికొచ్చి తమకు కావలసిన చిన్న పనులకు సైతం ఆడవారిపైనే ఆధారపడుతున్నారని చెబుతున్నారు. ఫ్రిజ్ లోనుంచి వాటర్ బాటిల్తేవాలన్నా, తిరిగి ఆ వాటర్ బాటిల్ నింపాలన్నా, ఉదయం లేవగానే బ్రష్ మీద పేస్టు కూడా వేయాలని కొందరు భర్తలు సతాయిస్తుంటారు. వేడినీళ్లు కలపడానికి కూడా భార్యలే రావాలని ఒత్తిడి పెంచేస్తుండటంతో ఆడవారు తీవ్రమైన అనారోగ్యానికి గురవుతున్నారట. కనీసం భార్యల ఆరోగ్య పరిస్థితిని కూడా పట్టించుకోనంత బిజీ లైఫ్ గడిపేస్తున్నారు తమ భర్తలు అని బాధపడుతున్నారట.

Also Read: Chicken Side Effects: తరుచుగా చికెన్ తింటున్నారా.. ఇక మీ పని అంతే !

ఇగోలు పక్కనబెట్టడమే బెటర్..

ఓ విశ్వవిద్యాలయం జరిపిన విశ్లేషణలో ఇలాంటి భర్తలు భార్య లేని రోజు చాలా నరకయాతన అనుభవిస్తారని చెబుతోంది. భర్త చనిపోయినా భార్య ఎక్కువ కాలం జీవించగలుగుతుందట. అదే భార్య చనిపోతే ఆమె పై ఆధారపడిన భర్త ఒకటి రెండేళ్లలోనే తీవ్రమైన మానసిక వ్యథకు గురవుతూ చనిపోతున్నారని విశ్వవిద్యాలయం సర్వే చెబుతోంది. అందుకే భార్యాభర్తలు పనుల విషయంలో ఇద్దరూ సమానమే అని గుర్తెరగాలి. ఇగోలు పక్కన పెట్టి భార్య కూడా తన ఇంటి మనిషే అనే భావన కలిగి వుండాలి. ఇద్దరూ పరస్పర అవగాహనతో సంసారం చేస్తే ఇద్దరికీ మానసికంగా, ఆరోగ్యపరంగా బాగుంటుందని సర్వే సంస్థలు చెబుతున్నాయి. తరతరాలుగా భారతీయ వ్యవస్థలో ఉన్న పురుషాధిక్యత కారణంగానే ఇలా జరుగుతోంది. ఆడవారికి సంబంధించిన పనులు మగవారు చేస్తే ఈ సమాజం చిన్న చూపు చూస్తుందని భావించడమే ఇన్ని అనర్థాలకు కారణమవుతోంది. కొంత మంది తమ భార్యలకు జ్వరం వచ్చినప్పుడు, కదలలేని పరిస్థితిలో ఉన్పప్పుడే సపర్యలు చేస్తారు. వాళ్లు కోలుకోగానే తిరిగి యథా స్థితికి వచ్చేస్తారు. భార్యాభర్తల సంబంధం గురించి సర్వే సంస్థ చెప్పిన విషయాలను సర్వత్రా హర్షిస్తున్నారు.

Tags

Related News

Bitter Gourd Juice For Diabetes: కాకరకాయ జ్యూస్‌తో షుగర్ కంట్రోల్.. మరెన్నో లాభాలు

Potato For Skin Glow: బంగాళదుంపతో ఇలా చేసారంటే.. అందరూ అసూయపడే అందం మీ సొంతం

Multani Mitti Face Pack:ముల్తానీ మిట్టితో స్మూత్, గ్లోయింగ్ స్కిన్..

Rosy Cheeks: ఇలా చేస్తే మేకప్ వేసుకోకుండానే ముఖం లేత గులాభీ రంగులో మెరిసిపోతుంది

Ginger Juice Benefits : అల్లం రసం తీసుకుంటే శరీరంలో ఎన్ని మార్పులు జరుగుతాయో తెలుసా !

2050 నాటికి 4 కోట్లకు పైగా మరణాలు.. వాటివల్లే ఆ ముప్పు, తాజా స్టడీలో షాకింగ్ విషయాలు వెల్లడి

Burping: తేన్పులు అతిగా వస్తున్నాయా? మీరు డేంజర్‌లో ఉన్నట్టే!

Big Stories

×