EPAPER

Maruti Suzuki S-Presso: మైలేజీలో తోపు.. ఈ SUV కేవలం రూ. 4.26 లక్షలే.. ఈజీగా డ్రైవింగ్ చేయొచ్చు కూడా..!

Maruti Suzuki S-Presso: మైలేజీలో తోపు.. ఈ SUV కేవలం రూ. 4.26 లక్షలే.. ఈజీగా డ్రైవింగ్ చేయొచ్చు కూడా..!

Maruti Suzuki S-Presso Mileage: తక్కువ ధరలో అధిక మైలేజీ అందించే కార్‌ను కొనుక్కోవాలని అందరికీ ఉంటుంది. అలాంటి కారు కోసం తెగ సెర్చ్ చేసేస్తుంటారు. మరి మీరు కూడా అలాంటి కార్‌ కోసం ఎదురుచూస్తున్నట్లయితే.. మీకో గుడ్ న్యూస్. అధిక మైలేజీ.. బడ్జెట్ ధరలో సామన్యులకు అందుబాటులో ఉన్న కార్‌ గురించి ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. అదే మారుతి సుజుకి S-ప్రెస్సో కంపాక్ట్ SUV. 2019లో మారుతి సుజుకి దీనిని లాంచ్ చేసింది. ఈ కారు లాంచ్ అయినప్పటి నుంచి మంచి రెస్పాన్స్ అందుకుంటుంది. తక్కువ ధరలో మంచి కార్‌ కొనుక్కోవాలని ప్లాన్ చేసే వారికి ఇది ది బెస్ట్ అని చెప్పుకోవాలి.


దీనిని నడపడం చాలా సులభం. ఈ కారు మంచి మైలేజీని కూడా ఇస్తుంది. ఇది మారుతి సుజుకి ఆల్టో K10 క్రాస్ఓవర్ వెర్షన్. అంతేకాకుండా ఈ కారు మారుతి సుజుకి ఇగ్నిస్ కంటే తక్కువ రేంజ్‌లో ఉంది. S-Presso దాని సరసమైన ధర, అధిక మైలేజీ, దాని డిజైన్‌కు ప్రసిద్ధి చెందింది. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో అధిక గ్రౌండ్ క్లియరెన్స్, బ్లాక్ క్లాడింగ్, పెద్ద గ్రిల్‌తో SUV-ప్రేరేపిత డిజైన్‌ను కలిగి ఉంది. ఈ కారులో హాలోజన్ హెడ్‌ల్యాంప్‌లు, LED టెయిల్‌ల్యాంప్‌లు, 14-అంగుళాల స్టీల్ వీల్స్ ఉన్నాయి.

అలాగే మారుతి సుజుకి S-ప్రెస్సో బ్లాక్ అండ్ సిల్వర్ థీమ్‌తో అద్భుతమైన ఇంటీరియర్‌ను కలిగి ఉంది. ఈ కారులో మాన్యువల్ ఎయిర్ కండిషనింగ్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్, మ్యూజిక్ సిస్టమ్ ఉన్నాయి. ఫ్రంట్ ప్రయాణీకులకు కారులో తగినంత ప్లేస్ కూడా ఉంది. ఇక దీని ఇంజిన్ విషయానికొస్తే.. మారుతి సుజుకి S-ప్రెస్సో రెండు ఇంజన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. అవి ఒకటి 1.0-లీటర్ K10F పెట్రోల్ ఇంజన్, మరొకటి 1.2-లీటర్ K12M పెట్రోల్ ఇంజన్.


Also Read: గుడ్ న్యూస్ చెప్పిన టయోటా.. నెలలోనే బుజ్జి ఎస్‌యూవీ డెలివరీ!

అందులో 1.0-లీటర్ ఇంజన్ 67 బిహెచ్‌పి పవర్, 91 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. అదే సమయంలో 1.2-లీటర్ ఇంజన్ 82 బిహెచ్‌పి పవర్, 113 ఎన్ఎమ్ టార్క్ ఉత్పత్తి చేస్తుంది. ఈ రెండు ఇంజన్లు 5-స్పీడ్ మ్యాన్యువల్ గేర్‌బాక్స్‌తో వస్తాయి. ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ఎంపిక 1.0-లీటర్ ఇంజన్‌తో మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇక మైలేజీ విషయానికొస్తే మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో అధిక మైలేజీకి ప్రసిద్ధి చెందింది. 1.0-లీటర్ పెట్రోల్ ఇంజన్ 24.12 కి.మీ మైలేజీని ఇస్తుంది. అలాగే 1.2-లీటర్ పెట్రోల్ ఇంజన్ 25.16 కి.మీ మైలేజీని ఇస్తుంది. ఆటోమేటిక్ వేరియంట్ 21.7 కి.మీ మైలేజీని అందిస్తుంది.

ఇక దీని సేఫ్టీ ఫీచర్ల విషయానికొస్తే.. మారుతి సుజుకి S-ప్రెస్సో డ్యూయల్ ఎయిర్‌బ్యాగ్‌లు, EBDతో కూడిన ABS, వెనుక పార్కింగ్ సెన్సార్‌లతో అందించబడుతుంది. ఈ కారు NCAP నుండి 2-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను పొందింది. దీని ధర విషయానికొస్తే.. మారుతి సుజుకి ఎస్-ప్రెస్సో రూ. 4.26 లక్షల నుండి రూ. 6.12 లక్షల ఎక్స్ షోరూమ్ ధర మధ్య ఉంటుంది. అందువల్ల స్టైలిష్ ఎస్యూవీని తక్కువ ధరలో కొనుక్కోవాలని చూస్తున్న వారికి ఇది ది బెస్ట్ అని చెప్పొచ్చు.

Tags

Related News

BMW XM: అరె బాబు.. ఇదేం కారు, దీని ధరతో హైదరాబాద్‌లో ఒక విల్లా కొనేయొచ్చు.. ఒక్కటే పీస్ అంట!

Sukanya Samriddhi Yojana: సుకన్య సమృద్ధి యోజనలో కీలక మార్పులు.. కేంద్ర ప్రభుత్వం ప్రకటన

NAMX HUV: ఒక్క హైడ్రోజన్ క్యాఫ్సుల్‌లో 800 కి.మీ ప్రయాణం.. ప్రపంచంలోనే ఈ కారు వెరీ వెరీ స్పెషల్ గురూ!

IRCTC Tourism Package: టూర్ ప్లాన్ చేస్తున్నారా? ఇదే సరైన సమయం, తక్కువ ధరలో అదిరిపోయే స్పెషల్ ప్యాకేజ్!

Jio AirFiber Free For 1 Year: ఏడాది పాటు జియా ఎయిర్ ఫైబర్ ఫ్రీ.. దీపావళి స్పెషల్ ఆఫర్!

Donkey Milk: గాడిద పాలతో లక్షల్లో లాభాలు.. ఇంతకీ ఆ పాలు తాగితే ఏం జరుగుతుందో తెలుసా?

Petrol vs Electric Cars: బాబోయ్.. పెట్రోల్ కారుతో పోల్చితే ఎలక్ట్రిక్ కారు ఇంత బెస్టా? ఏడాదికి అంత డబ్బు ఆదా చేసుకోవచ్చా?

Big Stories

×