EPAPER

Djokovic Vs Alcaraz: వింబుల్డన్ ఫైనల్ విజేత ఎవరు..? జకోవిచ్ వర్సెస్ అల్కరాస్ ఢీ!

Djokovic Vs Alcaraz: వింబుల్డన్ ఫైనల్ విజేత ఎవరు..? జకోవిచ్ వర్సెస్ అల్కరాస్ ఢీ!

Djokovic Vs Alcaraz: వింబుల్డన్‌లో ఫైనల్ సమరానికి అంతా సిద్ధమైంది. పురుషుల సింగిల్స్ విభాగంలో టైటిల్ కోసం సెర్బియా ఆటగాడు నవోక్ జకోవిచ్- స్పెయిన్ ఆటగాడు కార్లోస్ అల్కరాస్ మధ్య టైటిల్ పోరు జరగనుంది.


ఆదివారం సాయంత్రం వింబుల్డన్‌లో ఆసక్తికర సమరం మొదలుకానుంది. రికార్డు టైటిల్‌పై కన్నేశారు సెర్బియా ఆటగాడు నవోక్ జకోవిచ్. 25వ గ్రాండ్ స్లామ్ టైటిల్ తో టెన్నిస్ చరిత్రలో అత్యుత్తమ ఆటగాడి గా నిలివాలని భావిస్తున్నాడు. మరి ఆ ఆటగాడి కల ఫలిస్తుందా? అంటే చెప్పడం కష్టమే. వయస్సు సమస్య ఒకటి కాగా, మరొకటి గాయాల కారణంగా గతనెలలో జరిగిన ఫ్రెంచ్ ఓపెన్ నుంచి అర్థాంతరంగా వైదొలిగాడు జకోవిచ్.

మైదానంలో ప్రస్తుతం జకోవిచ్ ఆడుతున్నా, మునుపటి ఫామ్ మాత్రం కనిపించలేదు. ఇక వింబుల్డన్‌లో టోర్నీ మొదలుపెట్టిన నుంచి ఇప్పటివరకు జకోవిచ్‌కు సరైన ప్రత్యర్థి కనెక్ట్ కాలేదు. కొంతమంది ఆటగాళ్లు ప్రతిఘటించినప్పటికీ ఫలితం లేకపోయంది. బలమైన ప్రత్యర్థి అల్కరాస్ ముందు జకోవిచ్ నిలబడతాడా..? అన్నదే అసలు ప్రశ్న. జకోవిచ్‌కు ఇది 10వ వింబుల్డన్ ఫైనల్ మ్యాచ్. ఏడు వింబుల్డన్ టైటిళ్లను గెలుచుకున్నాడు. మాజీ ఆటగాడు రోజర్ ఫెదరర్ 8సార్లు వింబుల్డన్‌ టైటిళ్లను గెలుచుకున్నాడు.


Also Read: వింబుల్డన్‌లో కొత్త యువరాణి.. ట్రోఫీతోపాటు రూ. 28.5 కోట్ల ప్రైజ్‌మనీ

క్లో కోర్టు కింగ్ ఛాంపియన్ రఫెల్‌నాదల్ వారసుడిగా స్పెయిన్ నుంచి టెన్నిస్‌లోకి అడుగుపెట్టారు కార్లోస్ అల్కరాస్. డిఫెండింగ్ ఛాంపియన్‌గా మైదానంలోకి ఎంట్రీ ఇచ్చాడాయన. గతేడాది ఫైనల్‌లో జకోవిచ్ చిత్తు చేసి టైటిల్ ఎగురేసుకుపోయాడు అల్కరాస్. 21 ఏళ్లకే మూడు గ్రాండ్‌స్లామ్ టైటిళ్లను అందుకున్న చరిత్ర ఈ యువ ప్లేయర్‌ది.

వింబుల్డన్ టోర్నీలో బలమైన ప్రత్యర్థులను ఓడించాడు అల్కరాస్. ఆయన ఆటతీరును చూసినవాళ్లు మాత్రం టెన్నిస్‌లో అల్కరాస్ శకం మొదలైందని అంటున్నారు. ముఖ్యంగా ఒక్క సెట్ పోయినా చాలా సీరియస్‌గా తీసుకుంటాడు. చివరివరకు ప్రత్యర్థిపై పోరాటం చేస్తూనే ఉంటాడు. ఆ పోరాటమే ఇప్పుడు ఫైనల్‌కి తీసుకొచ్చిందని అంటున్నారు. ఇద్దరి ఆటగాళ్లలో టైటిల్‌ను ఎవరు సొంతం చేసుకుంటారో చూడాలి.

Tags

Related News

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Pakistan: మీరింక మారరా…బ్యాట్‌తో బలంగా కొట్టుకున్న పాక్ ప్లేయర్..వీడియో వైరల్‌ !

IND vs BAN Test Match: టెస్టు మ్యాచ్ ఫ్రీ గా.. చూడాలని అనుకుంటున్నారా?

Nikhat Zareen: డీఎస్పీగా గ్రూప్ -1 ఉద్యోగంలో.. తెలంగాణ మహిళా బాక్సర్

SA vs AFG: వన్డే క్రికెట్‌లో పెను సంచలనం..మొదటిసారి దక్షిణాఫ్రికాపై విజయం..

India vs Bangladesh: ఇవాళ్టి నుంచే తొలి టెస్ట్..ఆ ఇద్దరు డేంజరస్ ప్లేయర్లు ఔట్ !

IND vs BAN: వాళ్లిద్దరినీ ఎందుకు తీసుకోవడం లేదంటే: గౌతం గంభీర్

Big Stories

×