EPAPER

Kantara Prequel Update: పెద్ద రిస్కే చేస్తున్న కాంతారా దర్శకుడు రిశబ్ శెట్టి..!

Kantara Prequel Update: పెద్ద రిస్కే చేస్తున్న కాంతారా దర్శకుడు రిశబ్ శెట్టి..!

Rishan Shetty Doing High Risk on making Kantara Prequel: రెండేళ్ల క్రితం ఎలాంటి భారీ అంచనాలు లేకుండా సైలెంట్ గా వచ్చి వైలెంట్ కలెక్షన్లు కొల్లగొట్టింది కాంతారా. కేవలం రూ20 కోట్ల బడ్జెట్ తో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంా రూ.400 కోట్లు కొల్లగొట్టింది. అప్పటిదాకా ఎవరికీ తెలియని రిషబ్ శెట్టి పేరు దేశవ్యాప్తంగా మార్మోగిపోయింది. కన్నడ కీర్తి ప్రతిష్టలు పెరిగేలా చేసింది. అయితే ఈ సినిమా కి ప్రీక్వెల్ వస్తోందని చిత్ర యూనిట్ చెప్పింది. నిర్మాణ కార్యక్రమాలు పూర్తిచేసుకుని ఇదే ఏడాది విడుదల చేసేందుకు సిద్ధమవుతున్నవారు నిర్మాతలు. అప్పట్లో రూ.20 కోట్ల పెట్టుబడితో వచ్చిన ఈ మూవీ ఇప్పడు పాన్ ఇండియా ట్రెండ్ లో తీయాల్సి వస్తోంది. ఇప్పటిదాకా సీక్వెల్ కథాంశంతో సినిమాలు వచ్చాయి. అయితే అసలు కాంతారా కథకు ప్రీక్వెల్ ఏమిటనే ఆసక్తి అందరిలో మొదలయింది. అందుకే ఈ సారి కంటెంట్ తో పాటు భారీగా ఖర్చుపెడుతున్నట్లు తెలుస్తోంది.


రూ.1000 కోట్ల టార్గెట్..

కల్కి మూవీ వచ్చాక టాలీవుడ్ మార్కెట్ కాస్తా వెయ్యి కోట్ల రేంజ్ కు చేరుకుంది. రాబోయే పుష్ఫ, గేమ్ ఛేంజర్, సూర్య నటించిన కంగువా తదితర చిత్రాల టార్గెట్ వెయ్యి కోట్లు అయ్యాయి. ఇప్పుడు ఈ లిస్ట్ లోకి కాంతారా కూడా వచ్చి చేరింది. రిషబ్ శెట్టి కాంతారా ప్రీక్వెల్ కు తగ్గట్లు భారీ లొకేషన్లు, గ్రాఫిక్ డిజైన్లు, వీఎఫ్ఎక్స్ ఎఫెక్టులు ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక కాంతారా తొలి భాగం చివరి అరగంట సినిమాకి ఊపిరి పోశాడు రిషబ్ శెట్టి. భారీ ఖర్చు, సెట్టింగులు లేకుండానే కేవలం తన నటనతోనే ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఇప్పుడు ప్రీక్వెల్ లోకూడా తన నట విశ్వరూపం చూపనున్నాడు. అయితే ఖర్చు విషయంలో ఏ మాత్రం తగ్గేది లేదన్నట్లుగా రిస్క్ చేస్తున్నాడు. కాంతారా ప్రీక్వెల్ పై కేవలం కన్నడ ప్రేక్షకులే కాదు యావత్ భారత దేశం ఎదురుచూస్తోంది.మూవీలో కంటెంట్ ఉంటే చాలు వెయ్యి కోట్లు సాధించడం పెద్ద కష్టం కాదంటున్నారు సినీ మేధావులు.


మరిన్ని భాగాలు..

కాంతారా మూవీని ప్రీక్వెల్ తో వదిలేయలేదట చిత్ర యూనిట్. ఇదే సిరీస్ మీద మరికొన్ని భాగాలు గా మూవీ వస్తుందని చెబుతన్నారు రిషబ్ శెట్టి. కాంతారా మూవీ విడుదలైన తర్వాత తనకి ఎక్కడికి వెళ్లినా జనం భక్తిభావంతో రిసీవ్ చేసుకున్నారని..తన కాళ్లకి పాదాభివందనాలు సైతం చేసేవారన్నారు రిషబ్ శెట్టి. రెండేళ్లవుతున్నా కూడా అదే ఆదరణ లభిస్తోందని అంటున్నారు రిషబ్. అయితే తానేమీ దైవాంశ సంభూతుడు కాదని..కేవలం ఆ పాత్రలో నటించానని ప్రేక్షకులకు ఈ విషయంలో ఎప్పటికీ రుణపడి ఉంటానంటున్నాడు.

Also Read: Sarfira Movie: సినిమా చూస్తే చాయ్ సమోసా ఫ్రీ.. ప్రేక్షకుల కోసం థియేటర్ వింత ఆఫర్!

రెండు లక్ష్యాలు..

ప్రస్తుతానికి రిషబ్ శెట్టి ముందు రెండు లక్ష్యాలు ఉన్నాయి. ఒకటి వెయ్యి కోట్లు సాధించడం ..రెండోది ఆస్కార్ నామినేషన్ కు కాంతారా ప్రీక్వెల్ ను పంపడం. ఈ రెండూ రిస్కుల టాస్క్ ను అధిగమించాలని చూస్తున్నాడు రిషబ్ శెట్టి. ప్రస్తుతానికి డివైన్ పాన్ ఇండియాల టైమ్ నడుస్తోంది. రీసెంట్ గా వెయ్యి కోట్లు సాధించిన కల్కి మూవీ కూడా డివైన్ కాన్సెప్ట్ తో రూపొందించినదే . ప్రస్తుత ట్రెండ్ ను అనుసరించి కాంతారా ప్రీక్వెల్ రూపొందుతోంది. ఇలాంటి కథలకు ఇప్పుడు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. అన్నీ అనుకొన్నవి జరిగితే ఈ సారి రిషబ్ శెట్టి పేరు కూడా పాన్ ఇండియా దర్శకుల లిస్ట్ లోకి చేరిపోతుంది.

Tags

Related News

Pushpa 2 : అక్టోబరే డెడ్ లైన్… ఇక చరణ్ తో తాడో పేడో..

Game Changer: అల్లు అర్జున్ తో పోటీ.. గేమ్ ఛేంజర్ రిలీజ్ డేట్ వచ్చేసింది

Tollywood: జానీ మాస్టర్ కన్నా ముందు టాలీవుడ్‌లో లైంగిక ఆరోపణలు ఎదుర్కొన్న సెలబ్రిటీలు ఎవరో తెలుసా.. ?

Niharika Konidela: తమిళ తంబీల మనసు దోచేస్తున్న నిహారిక.. డ్యాన్స్, రొమాన్స్ అదరగొట్టేసిందిగా!

Naga Chaithanya – Sobhitha Dulipala : సీక్రెట్ గా మ్యారేజ్ ప్లాన్ చేస్తున్న చై – శోభిత.. ఇదేం ట్విస్ట్ బాబు..

Comedian Ali: పవన్ కళ్యాణ్ గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన ఆలీ..

Shah Rukh Khan: షారుఖ్ ఖాన్ వీక్‌నెస్ అదే, అక్షయ్ కుమార్‌కు అలా చెప్తేనే వింటాడు.. దర్శకుడి ఆసక్తికర వ్యాఖ్యలు

Big Stories

×