EPAPER

Joe Biden confuses: మళ్లీ తడబడిన జోబైడెన్.. ఈసారి ఏమన్నారంటే..?

Joe Biden confuses: మళ్లీ తడబడిన జోబైడెన్.. ఈసారి ఏమన్నారంటే..?

Joe Biden confuses: మరోసారి అధ్యక్ష ఎన్నికల రేసులో ఉన్న జోబైడెన్ పై ఇప్పటికే తీవ్ర స్థాయిలో వ్యతిరేకత ఎదురవుతున్న విషయం తెలిసిందే. అధ్యక్ష బాధ్యతలను నిర్వర్తించే సామర్థ్యం ఆయనకు లేదంటూ పలు ఆరోపణలు కూడా వచ్చాయి. ఈ క్రమంలో ఆయన మరోసారి తడబడ్డారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు పెద్ద ఎత్తున చర్చనీయంగా మారాయి. ‘అగ్రరాజ్య ఉపాధ్యక్షుడు ట్రంప్’, ‘ఉక్రెయిన్ అధ్యక్షుడు పుతిన్’ అంటూ బైడెన్ వ్యాఖ్యానించారు.


నాటో కూటమి దేశాల వార్షిక సదస్సు ముగిసిన తరువాత జోబైడెన్ గురువారం మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మీరు అధ్యక్ష రేసు నుంచి వైదొలిగితే ట్రంప్ ను కమలా హ్యారిస్ ఓడించగలరని భావిస్తున్నారా.. ? అని విలేకర్లు ప్రశ్నించారు. దీనికి బైడెన్ సమాధానమిస్తూ.. అధ్యక్షుడిగా పనిచేసే అర్హతలు ఉపాధ్యక్షుడు ట్రంప్ నకు లేకుంటే నేను అసలు ఆయనను ఆ పదవికి ఎంపిక చేసేవాడిని కాదు.. అని బదులిచ్చారు. ఇక్కడ పొరపాటున ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ అనాల్సిందిపోయి ట్రంప్ అనేశారు. దీంతో ఆయన మానసిక స్థితి సరిగా లేదంటూ మరోసారి సోషల్ మీడియా వేదికగా పలువురు విమర్శలు చేస్తున్నారు.

Also Read: జపాన్‌, నవ్వడం కోసం కొత్త చట్టం..


మీడియా సమావేశానికి ముందు నాటో కూటమి సభ్యదేశాల ప్రతినిధులకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీని జోబైడెన్ పరిచయం చేశారు. గొప్ప సంకల్పం, ధైర్య సాహసాలు ఉన్న వ్యక్తిగా ఆయనను కొనియాడారు. ప్రసంగిచమంటూ కోరారు. ఆ సమయంలో జెలెన్‌స్కీని ఆహ్వానిస్తూ.. ‘అధ్యక్షుడు పుతిన్’ అంటూ సంబోధించారు. దీంతో సమావేశంలో ఉన్నవారంతా ఒక్కసారిగా నిట్టూర్చారు. అయితే, జెలెన్‌స్కీ మాత్రం నవ్వుతూ దాన్ని తేలిగ్గా తీసుకున్నారు. సమావేశమనంతరం వివిధ దేశాధినేతలు జోబైడెన్ కు మద్దతుగా నిలిచారు. జర్మనీ ఛాన్స్ లర్ ఒలాఫ్ షోల్జ్ మాట్లాడుతూ.. ‘ఎవరికైనా అప్పుడప్పుడు ఇలాంటి చిన్న చిన్న పొరపాట్లు జరగడం సహజమే’ అని అన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మాన్యయేల్ మెక్రాన్, బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ సైతం జోబైడెన్ చురుకుగా ఉన్నారని వివరించారు.

అయితే, బైడెన్ వైదొగాలంటూ స్వపక్షం నుంచే డిమాండ్లు పెరిగిన తరువాత ఆయన మీడియా ముందుకు రావడం ఇదే తొలిసారి. దీన్ని ఆయన పాలవర్గం ‘బిగ్ బాయ్ ప్రెస్ కాన్ఫరెన్స్’గా వ్యవహరిస్తూ వచ్చారు. దీంతో ఆయన ఏం మాట్లాడుతారోనని అంతా ఆసక్తిగా ఎదురుచూశారు. అధ్యక్షుడి సన్నిహితుడు, హవాయి గవర్నర్ జోష్ ఇటీవల ఎన్నికల బరిలో కొనసాగడంపై త్వరలో జోబైడెన్ తన నిర్ణయాన్ని ప్రకటిస్తారన్నారు. అయితే ఇది కూడా పాత్రికేయుల సమావేశంపై అందరి దృష్టి కేంద్రీకరించడానికి కారణమయ్యింది.

జోబైడెన్ మాత్రం ఎప్పటిలాగే తానే పోటీకి అర్హుడినంటూ రేసులో కొనసాగుతానని చెప్పారు. కేవలం పదవి కోసం తాను పోటీలో లేనని, అనుకున్న పని పూర్తి చేసేందుకే బరిలోకి దిగానని అన్నారు. ఎన్నికల్లో కచ్చితంగా గెలిచి తీరుతానంటూ ధీమా వ్యక్తం చేశారు. తాను ఇప్పటివరకు అనుకున్న పనులన్నీ సక్రమంగా పూర్తి చేశానని చెప్పారు. ఎక్కడైనా నెమ్మదించిన దాఖలాలు ఉంటే పోటీ విషయంలో పునరాలోచన చేసేవాడినని పేర్కొన్నారు. అయితే, ఇప్పటివరకు అలా జరగలేదన్నారు. ఫలితంగా తాను పోటీకి అర్హుడినేనంటూ ప్రకిటించుకున్నారు.

Also Read: 2060 నాటికి 170 కోట్ల భారత జనాభా: ఐరాస

ప్రెస్ మీటిలో విలేకర్లు అడిగిన ప్రశ్నలకు బైడెన్ సుదీర్ఘ సమాధానాలిచ్చారు. అనేక ఉదంతాలను ఆయన పేర్కొంటూ తన అభ్యర్థిత్వాన్ని సమర్థించుకునే ప్రయత్నం చేశారు బైడెన్. విదేశాంగ విధానంపై చాలాసేపు మాట్లాడారు. సమావేశం ఆరంభంలో నాటో కూటమి గురించి కూడా మాట్లాడారు.

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×