EPAPER

Telangana : ఎవరి వార్తలు వారివే.. విలేకరులుగా మారిన నాయకులు!

Telangana : ఎవరి వార్తలు వారివే.. విలేకరులుగా మారిన నాయకులు!

– సోషల్ మీడియాను నడుపుతున్న మాజీ మంత్రి
– 15 యూట్యూబ్ ఛానల్స్ నడిపిస్తూ హడావుడి
– ఏ వార్తను ఎలా నడపాలో డిసైడ్ చేసిది ఆయనే
– బాధ్యత మరిచి ఎక్స్‌లో రెచ్చగొట్టే పోస్టులు
– ప్రధాన పత్రికలకు, ఛానల్స్‌‌కు నేరుగా సమాచారం ఇస్తున్న మంత్రులు?
– తమ కంటే ముందే మేనేజ్మెంట్‌కు వార్తలు అందుతుండటంతో తలలు పట్టుకుంటున్న జర్నలిస్టులు
– ఏది చేబితే అదే ఫైనల్ అనుకుంటూ వార్తలు వడ్డిస్తున్న మీడియా సంస్థలు
– ఇలా అయితే సోషల్ మీడియా దారిలోనే మెయిన్ స్ట్రీమ్ మీడియా?
– ఆధారాలు లేకుండానే ఆరోపణలతోనే ప్రయాణం


దేవేందర్ రెడ్డి చింతకుంట్ల, 9848070809

స్వేచ్ఛ-బిగ్ టీవీ ఇన్వెస్టిగేషన్ టీం


Leaders Turned Journalists : ఈ రోజుల్లో సోషల్ మీడియాలో వచ్చే వార్తల్లో ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకోవడం చాలా కాష్టంగా మారిపోయింది. ఎవరుపడితే వారు వారికి ఇష్టమొచ్చింది రాసేస్తున్నారు. కొందరు దాన్ని వైరల్ చేసేస్తున్నారు. అయితే, మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఇదే పంథాలో వెళ్తోందనే ప్రచారం జరుగుతోంది. కొందరు లీడర్ల తీరే ఇందుకు కారణంగా చెబుతున్నారు. ఈమధ్య మీడియా రంగంలో స్పీడ్‌గా మార్పులు వస్తున్నాయి. ఏఐ కంటే వేగంగా పొలిటికల్ వ్యవస్థ జర్నలిజం జాతకాన్నే మార్చేస్తోంది. ఒకప్పుడు సాక్ష్యాధారాలతో కూడిన వార్తలు రిపోర్టర్స్ ఇచ్చేవారు. మేనేజ్మెంట్ సూచనలతో రాసేవారు. కానీ, ఇప్పుడు మేనేజ్మెంట్ నుంచే రిపోర్టర్స్‌కి సమాచారం అందుతోంది. ఆధారాలు, పెద్ద పెద్ద ప్రాజెక్ట్స్‌లో జరిగిన ఫాలోఅప్స్ లేకుండానే, ఎవరి పాత్ర ఉందో, ఎలా రాయాలో నాయకులు అనుకున్నట్టు రాయిస్తున్నారు. దాని ఫలితంగా మీడియా రంగం ప్రమాదంలో పడుతోంది.

సోషల్ మీడియానే నమ్ముకున్న ప్రతిపక్షం

ప్రతిపక్షాలు ప్రధాన మీడియాతో కాకుండా సోషల్ మీడియాతో వారు అనుకున్నది వైరల్ చేయిస్తున్నాయి. వార్తలను, సెటైర్లను వివిధ ఫ్లాట్ పామ్స్‌పై నడిపించేలా ప్లాన్ చేసుకుంటున్నాయి. మంత్రులు, ప్రభుత్వం వద్ద ఏదైనా జరిగిన వెంటనే సమాచారం రావడం, ఆ వెంటనే వాటిని తమకు అనుకూలంగా మర్చేస్తున్నాయి. ఏ చిన్న సంఘటన జరిగినా క్షణాల్లో యూట్యూబ్ ఛానల్స్‌కి చేరేలా ప్లాన్ చేశాయి. నిజా నిజాలు ఎంటి? సోర్స్ ఎక్కడి నుంచి వస్తుంది? అనేది లేకుండానే తప్పుదారి పట్టించే కుట్రలు జరుగుతున్నాయి. వాళ్లు చెప్పారంటే నిజమే అని వార్తలను వడ్డించేస్తున్నారు. మాజీ మంత్రి కనుసన్నల్లో 15 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయని మీడియా అంతా కోడై కూస్తోంది. దీన్ని అడ్డుకునేందుకు ప్రధాన పత్రికలను కొంతమంది మంత్రులు వాడుకుంటున్నారని సమాచారం. మీడియా అధిపతులకు నేరుగా ప్రభుత్వంలోని లొసుగులను, లుకలుకలను వెంటనే చేరవేస్తున్నట్లు అనుమానాలున్నాయి. దేవుడిపై ప్రమాణం చేసిన వారంతా ప్రభుత్వ రహస్యాలను, విషయాలను పంచుకోవడంపై విమర్శలూ వస్తున్నాయి. ప్రభుత్వంలో భాగస్వాములైన మంత్రులు నేరుగా వార్తలు రాయిస్తున్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. గతంలో లీకులు ఇచ్చి దర్యాప్తు చేసి వార్తలు రాసుకోమనేవారు. ఇప్పుడు నేరుగా అధికారుల నుంచి తీసుకున్న ఎవిడెన్స్ పత్రికల యాజమాన్యాలకు షేర్ అవుతున్నట్టు తెలుస్తోంది. ఎలా రాయాలో వారే చెబుతుండటంతో మీడియా సర్కిల్స్‌లో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.

వ్యవస్థకు-నాయకులకు వారధిగా ఆ మీడియా అధిపతులు

ఇద్దరు మంత్రులకు ఓ పత్రిక అధినేత, ఓ ఛానల్ ఓనర్ చాలా క్లోజ్. ఎన్నో ఏండ్లుగా మీడియా రంగంలో ఉండటం, వ్యవస్థను ఎలా నడిపించాలో తెలిసేలా చేస్తామని చెప్పుకోవడంతో మంత్రులు ఆ ఊబిలో పడిపోతున్నట్లు తెలుస్తోంది. ఇటీవల ఓ పేపర్ ఎండీతో సింగరేణి ఎండీ భేటీ, ప్రధాన అంశాలపై చర్చ అని ఫోటోతో సహా వార్త రాయడంతో ఆరోపణలకు నిజం చేకూరినట్టయింది. ఏ పని కావాలన్నా, మా మంత్రి గారు ఉన్నారని చెప్పుకోవడం పరిపాటిగా మారిందని టాక్. ప్రభుత్వంలో ఏమైనా తేడా వస్తే, తమ్మిని, బిమ్మిని చేస్తామంటూ లీకులను ఒడిసిపట్టుకుంటున్నారు ఈ మీడియా అధిపతులు. అన్ని పార్టీల నాయకులకు వీరే వారధిలా ఉంటున్నారని తెలుస్తోంది. ఇలా, నాయకులే విలేకరులుగా మారడంతో పెద్ద ఎత్తున సమాచారం బయటకు పొక్కుతోంది. తప్పుడు సమాచారం కూడా వైరల్ అవుతోంది. దీంతో ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య ఉండే సమన్వయం, కాల పరిమితికి ఇబ్బంది కలిగే అవకాశాలు ఉన్నాయి. గతంలో మీడియా యాజమాన్యాలు మంచి పాలన కోసం సలహాలు, సూచనలు మాత్రమే ఇచ్చేవి. ఇప్పుడు న్యూస్‌ రాసేందుకు నాయకులే రిపోర్టర్ల అవతారం ఎత్తి నేరుగా సమాచారాన్ని చేరవేస్తున్నారు. ఇలాంటి వ్యవస్థ ప్రజాస్వామ్యంలో సరికాదని ఎవరి డ్యూటీ వారు చేస్తేనే బాగుంటుందని సీనియర్ నేతలు, జర్నలిస్టులు అంటున్నారు.

Tags

Related News

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Jani Master : కేసులో మరో ట్విస్ట్.. కూపీ లాగనున్న మహిళా కొరియోగ్రాఫర్..!

Bigg Boss 8 Day 18 Promo: హౌస్ లో పెద్ద డ్రామా నడుస్తోందే.. సోనియా కి ఝలక్ ఇచ్చిన నబీల్..!

Heroine Poorna: తల్లిని నిందించారు.. హేళన మాటలపై పూర్ణ ఎమోషనల్..!

NaniOdela2: ఫ్యాన్స్ గెట్ రెడీ.. మాస్ జాతరకు సిద్ధం కండమ్మా..!

Big Stories

×