EPAPER

Hyderabad Metro rail phase-2: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఎల్బీనగర్ టూ హయత్‌నగర్ ఫేజ్ 2 పనులకు శ్రీకారం

Hyderabad Metro rail phase-2: మెట్రో ప్రయాణికులకు గుడ్ న్యూస్.. ఎల్బీనగర్ టూ హయత్‌నగర్ ఫేజ్ 2 పనులకు శ్రీకారం

Hyderabad Metro rail phase-2 project(Hyderabad news today): హైదరాబాద్ నగర ప్రజలకు మెట్రో అధికారులు శుభవార్త చెప్పారు. హైదరాబాద్ మెట్రో రైల్ ఫేజ్ 2 పనులను ప్రారంభించేందుకు మెట్రో కార్పొరేషన్ శ్రీకారం చుట్టింది. ఈ మేరకు ఎల్బీనగర్ టూ హయత్ నగర్ వరకు మెట్రోను విస్తరించనున్నారు. ఇందులో భాగంగా డీపీఆర్ సిద్ధం చేశారు. దాదాపు ఏడు కిలోమీటర్ల దూరానికి ఆరు స్టేషన్లతో మెట్రోకు అధికారులు తుది మార్గాన్ని సిద్ధం చేశారు.


ఎల్బీనగర్ నుంచి హయత్ నగర్ వరకు మెట్రో లైన్ పొడిగించాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు మియాపూర్ టూ ఎల్బీనగర్ వరకు మాత్రమే మెట్రో అందుబాటులో ఉంది. అయితే ప్రయాణికుల దృష్ట్యా మెట్రోను మరింత విస్తరించాలని నిర్ణయించింది. ఒక్కో కిలోమీటర్‌కు ఒక్కో స్టేషన్ ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ మీదుగా జాతీయ రహదారి పనులు వేగంగా జరుగుతున్నాయి. దీంతో పాటు ప్లై ఓవర్ల నిర్మాణాన్ని కూడా చేపట్టనున్నట్లు సమాచారం.

మెట్రో పిల్లర్ల నిర్మాణాలను జాగ్రత్తగా నిర్మించాలని అధికారులు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. ఈ మేరకు మెట్రో అధికారులు, జాతీయ రహదారుల సంస్ ప్రతినిధులు సమావేశమై పలు కీలక అంశాలపై చర్చించారు. అయితే మెట్రో రెండో దశలో 70 కిలోమీటర్ల మేర నిర్మాణం చేపట్టనుంది. ఇందులో భాగంగానే తొలుత ఎల్బీనగర్ టూ హయత్ నగర్‌ను ఎంపిక చేశారు.


ఎల్బీనగర్ టూ హయత్ నగర్‌ మార్గంలో పనులకు శ్రీకారం చుట్టింది. ఎల్బీనగర్ నుంచి చింతల్ కుంట, వనస్థలిపురం, ఆటోనగర్, మహవీర్ నేషనల్ పార్క్, హయత్ నగర్‌లలో స్టేషన్ల నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. ఇంకా స్టేషన్ల పేర్లతోపాటు ఎక్కడెక్కడ స్టాపింగ్ ఉంటాయన్న వివరాలు తెలియరాలేదు. ఒకవేళ ఈ మెట్రో అందుబాటులోకి వస్తే..మియాపూర్ నుంచి హయత్ నగర్ కేవలం గంటలోనే ప్రయాణించవచ్చు. దీంతో నగరవాసులకు ట్రాఫిక్ ఇబ్బందులతోపాటు ప్రయాణం సాఫీగా సాగనుంది.

Also Read: స్కూల్ పిల్లల భోజనంలో బల్లి!.. 30 విద్యార్థులకు అనారోగ్యం.. కేంద్రం సీరియస్

Tags

Related News

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Big Stories

×