EPAPER

Kangana Ranaut: కంగనా రనౌత్ కండీషన్స్‌పై కాంగ్రెస్ ఫైర్

Kangana Ranaut: కంగనా రనౌత్ కండీషన్స్‌పై కాంగ్రెస్ ఫైర్

Kangana Ranaut comments on Congress(Telugu news updates): బాలీవుడ్ నటి, మండీ బీజేపీ ఎంపీ కంగనా రనౌత్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎందుకంటే ఈ మధ్య నిత్యం ఏదో ఒక వివాదంలో చిక్కుకుంటూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. ఈ నేపథ్యంలో మరోసారి తన పేరు తెరమీదకు వచ్చింది. తనని కలిసేందుకు వచ్చే ప్రజలందరూ ఆధార్ కార్డు తమ వెంట తెచ్చుకోవాలని మీడియా సమావేశంలో కోరింది. అంతేకాదు నన్ను కలవాలంటే మండీ నియోజకవర్గ ప్రజలు తప్పనిసరిగా తమ ఆధార్ తెచ్చుకోవాలంటూ సూచించింది. అలాగే నన్ను ఎందుకు కలవాలనుకుంటున్నారో కూడా ఆ కారణాన్ని ఓ పేపర్‌పై రాయాలని సూచించారు. దాంతో నాకు ఎలాంటి ఇబ్బంది కలగదని సూచించింది.


హిమాచ్‌ల్‌ రాష్ట్రంలోని ఉత్తర దిశ ప్రాంత ప్రజలందరూ తనని కలిసేందుకు మనాలిలోని తన ఇంటికి వచ్చి తమ సమస్యలను చెప్పుకోవచ్చని తెలిపింది. మండీ ప్రజలు అయినట్లయితే నేరుగా తన కార్యాలయానికి రావొచ్చని తెలిపింది. ఈ ప్రాంతానికి టూరిస్ట్‌లు చాలా మంది వస్తుండటంతో కంపోర్ట్‌గా ఫీల్ అవడం లేదని అంతేకాకుండా సామాన్యులు సైతం అసౌకర్యంగా ఫీల్ అవుతున్నారని ఆమె తెలిపింది. అందుకే తనని కలిసేందుకు వచ్చే వారంతా తమ ఆధార్‌ని వెంట తెచ్చుకోవాలని సూచించింది.

Also Read:సుప్రీం కోర్టు బెయిల్ మంజూర్ చేసినా.. జైలులోనే కేజ్రీవాల్.. ఎందుకంటే?


కంగనా రనౌత్ చేసిన ఈ డిమాండ్‌ని కాంగ్రెస్ నేత విక్రమాధిత్య తీవ్ర విమర్శలు గుప్పించారు. ప్రజలు కంగనాను కలవాలంటే ఆధార్ కార్లు ఎందుకని మండిపడ్డారు. ఓటు వేసేటప్పుడు అడగని ఈ కండీషన్‌లు ఇప్పుడు ఎందుకంటూ విమర్శించారు. మేం ప్రజాప్రతినిధులం. కాబట్టి రాష్రంలోని ప్రజలంతా తనని కలవడానికి రావొచ్చని అన్నారు. ప్రజలు ఏమన్నా పనిలేక వస్తారా..? పని ఉంది కాబట్టి అందులోనూ వారి సమస్యలను తెలిపేందుకే కంగనా దగ్గరికి వస్తారని.. అంతమాత్రానా కండీషన్స్‌ పెట్టడం నాకు నచ్చలేదని తన పద్దతిని ఇప్పటికైనా మార్చుకోవాలని విక్రమాధిత్య కంగనాకు సూచించారు.

Tags

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×