EPAPER

CM Revanth: త్వరలో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సమావేశం

CM Revanth: త్వరలో కలెక్టర్లు, ఎస్పీలతో సీఎం సమావేశం

CM Revanth reddy Meeting With All District Collecors,SPs, Secratariat On July: నిర్ణీత ఆదాయ టార్గెట్‌పై ఇకనుంచి ప్రతినెల ఫస్ట్‌వీక్‌లో సీఎం స్వయంగా సమీక్ష నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రతి శుక్రవారం ఆర్ధికమంత్రి భట్టి విక్రమార్క సంబంధిత శాఖల పురోగతిపై మీటింగ్ నిర్వహించనున్నారు. తెలంగాణలో ఇన్‌కమ్ వచ్చే ఎక్సైజ్, వాణిజ్య పన్నులు, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, మైనింగ్, రవాణా వంటి విభాగాలపై ఆయా రంగానికి సంబంధించిన అధికారులతో సీఎం భేటీ కానున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రులు జూపల్లి కృష్ణారావుతో పాటుగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి సమీక్ష నిర్వహించారు.


ఈ కార్యక్రమంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి,ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు,సంబంధిత శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌రెడ్డి మా ట్లాడుతూ..రాష్టానికి ఆదాయం తెచ్చిపెట్టే విభాగాలన్నీ నిర్ణీత వార్షిక లక్ష్యాన్ని సాధించేందుకు ప్రయత్నించాలని అధికారులను ఆదేశించారు.ఇసుక, ఖనిజ వనరుల ద్వారా వచ్చే ఇన్‌కమ్‌ సోర్స్ పెరగాలంటే అక్రమ రవాణా, లీకేజీలను అరికట్టాలని సీఎం సూచించారు.గత ఆర్థిక సంవత్సరం కంటే ఈ ఏడాది మరింత ఇన్‌కమ్‌ వచ్చేందుకు సంబంధిత అధికారులు ప్రత్యేక శ్రద్ధ చూపించి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు.ఇక పన్నుల ఎగవేత లేకుండా అన్ని విభాగాలు కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.

Also Read: బిడ్డా ఏం చేద్దాం.. కారు గుర్తు పోయేటట్టు ఉంది, మనమే కలిపేద్దామా?


ఆదాయ వనరులు, పన్నుల వసూళ్ల విషయంలో అధికారులు నికచ్చిగా వ్యవహరించాలని ఆదేశించారు. ప్రధాన ఆదాయ మార్గమైన జీఎస్టీ ఆదాయం పెంచుకోవడానికి కావల్సిన అన్ని చర్యలను వెంటనే చేపట్టాలని సూచించారు. రాష్ట్ర జీఎస్టీ పెంపునకు సంబంధిత వాణిజ్య పన్నుల శాఖల అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి, పకడ్బందీగా సేవలు నిర్వహించాలని సీఎం ఆదేశించారు. పెట్రోలు, డీజిల్‌పై వ్యాట్‌ ద్వారా వచ్చే ఇన్‌కమ్‌ కంప్లీట్‌గా తగ్గిందని, దానికి ప్రత్యామ్నయంగా ఏవియేషన్‌ ఆయిల్‌పై ఉన్న పన్నును సవరించే ఛాన్స్‌లను పకడ్బందీగా పరిశీలించాలని అధికారులను సీఎం సూచించారు. ఈ నేపథ్యంలో ఈనెల 16న అధికారులతో ముఖ్యమైన సమావేశం నిర్వహించనున్నారు. అందులో భాగంగానే సీఎం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

Related News

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Big Stories

×