EPAPER

Darshan suffering from health: జైలులో నటుడు దర్శన్‌కు కష్టాలు, పవిత్రగౌడ కంటతడి..

Darshan suffering from health: జైలులో నటుడు దర్శన్‌కు కష్టాలు, పవిత్రగౌడ కంటతడి..

Darshan thoogudeepa latest news(Cinema news in telugu): బెంగుళూరు సెంట్రల్ జైలులో ఉన్న కన్నడ నటుడు దర్శన్ పరిస్థితి ఏంటి? బెయిల్‌పై బయటకు వచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడా? ఇవే ప్రశ్నలు ఆయన అభిమాను లను వెంటాడుతున్నాయి. జైలు ఫుడ్ కారణంగా ఆయన తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. ఇంటి నుంచి ఫుడ్ తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశాడు.


కర్ణాటకలోని చిత్రదుర్గానికి చెందిన రేణుకాస్వామి హత్య కేసులో కీలక నిందితుడు కన్నడ నటుడు దర్శన్. ప్రస్తుతం ఆయన బెంగుళూరులోని పరప్పన అగ్రహారం సెంట్రల్ జైలులో జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్నాడు. జైలులో ఆహారం తీసుకోవడంతో వాంతులు, విరోచనాలతో ఇబ్బందిపడుతున్నాడు. అంతేకాదు బరువు కూడా తగ్గిపోయాడు. ఈ క్రమంలో దర్శన్ లాయర్లు హైకోర్టును ఆశ్రయించారు.

జైలులో తీసుకుంటున్న ఆహారం తనకు ఇబ్బందిగా మారిందని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఇంటి నుంచి భోజనాన్ని తెచ్చుకునేందుకు అనుమతి ఇవ్వాలన్నది అందులోని ముఖ్యమైన పాయింట్. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన న్యాయస్థానం.. జూలై 18కి వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో జైలు రూల్ బుక్‌లో భోజనానికి అనుమతి ఇచ్చేందుకు ఎలాంటి నియమాలు ఉన్నాయో చెప్పాలని ప్రశ్నిస్తూ అధికారులకు నోటీసులు జారీ చేసింది.


ALSO READ:  ‘ఆర్మీ జవాన్ తో సమానంగా అగ్నివీర్ ఎక్స్ గ్రేషియా’.. మాజీ ఐఎఎఫ్ చీఫ్ వివరణ

మరోవైపు ఇదే కేసులో ఏ-1గా ఉన్న పవిత్ర‌ గౌడను ఆమె తల్లి జైలులో కలిశారు. ఇక్కడ ఫుడ్ బాగాలేదని, ఇంటి నుంచి తెచ్చుకునేందుకు అనుమతి ఇచ్చేలా న్యాయస్థానంలో పిటిషన్ వేయాలని సూచించింది. రేపో మాపో పవిత్రగౌడ లాయర్లు దీనిపై పిటిషన్ వేయనున్నారు. రేణుకాస్వామి హత్యకు తానే కారణమని దర్శన్ భావిస్తున్నాడని తల్లి వద్ద మొరపెట్టుకుందని సమాచారం. ఈ పరిణామాలు చూస్తుంటే భవిష్యత్తులో దర్శన్ తనకు దూరమయ్యే అవకాశముందని కన్నీళ్లు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

Tags

Related News

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Big Stories

×