EPAPER

CM Offer to Janasena: జనసేనానికి మరో బంపరాఫర్ ఇచ్చిన చంద్రబాబు

CM Offer to Janasena: జనసేనానికి మరో బంపరాఫర్ ఇచ్చిన చంద్రబాబు
  • ఏపీ రాజకీయాలలో జనసేనానికి తొలి ప్రాధాన్యతనిస్తున్న చంద్రబాబు
  • శాసన మండలిలో ఖాళీ అయిన రెండు స్థానాలలో ఒకటి కేటాయింపుశాసన మండలిలో
  • ఎమ్మెల్సీ పదవి ఆశిస్తున్న తెలుగు తమ్ముళ్లు
  • క్యాబినెట్ మంత్రుల విషయంలోనూ తాము త్యాగం చేశామంటున్న కార్యకర్తలు
  • అయినా జనసేనకే పదవిని ఇచ్చేందుకు సిద్ధం
  • భవిష్యత్ లోనూ జనసేనతో కలిసి పనిచేయాలని నిర్ణయం
  • హర్షం వ్యక్తం చేస్తున్న జనసేక కార్యకర్తలు
  • అడిషనల్ అడ్వకేట్ జనరల్ పదవి కూడా జనసేనకే కేటాయింపు

CM Chandrababu gave MLC to Janasena party(AP latest news): పవర్ స్టార్ తన పేరు సార్థకం చేసుకుంటున్నారు. మూవీల విషయంలోనే కాదు రాజకీయంగానూ పవర్ ఫుల్ నేతగా ఎదుగుతున్నారు. తాను నిరంతరం జనం మనిషిని అని తెలియజేసేందుకు ప్రజలకు మేలు చేసే శాఖలను ఏరికోరి మరీ తీసుకున్నారు. మంత్రిగా ఎంతో నిజాయితీగా, బాధ్యతాయుతంగా పనిచేస్తూ తన స్వభావినికి భిన్నంగా వ్యవహరిస్తున్నారు. ఆవేశాన్ని పక్కకు పెట్టి ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటున్నారు.


అటు కేంద్రంలోనూ మోదీ మెప్పగోలు పొందారు. ప్రస్తుతం ఆంధ్రా రాజకీయాలలో చెప్పుకోకపోయినా నెంబర్ 2 గా వ్యవహరిస్తున్నారు. ఇలాంటి పరిస్థితిలో పవన్ పనితనం మెచ్చిన ఏపీ సీఎం చంద్రబాబు మరో కీలక పదవి ఆ పార్టీకి వచ్చేలా చేస్తున్నారు. కూటమిలోనూ జనసేనకు అధిక ప్రాధాన్యతనిస్తున్నారు. జనసేననుంచి వచ్చిన మరో ఇద్దరు నేతలకు మంత్రి పదవులను ఇచ్చి గౌరవించారు. ఇప్పుడు మరో కీలక పదవిని జనసేన పార్టీకి ఇవ్వనున్నారు.

శాసన మండలిలో కసరత్తు


ఏపీ శాసన మండలిలో రెండు స్థాశానాలు భర్తీ చేసేందుకు కసరత్తు మొదలయింది. అయితే మొన్నటి అసెంబ్లీ ఎన్నికల తర్వాత తెలుగు తమ్ముళ్లు చాలా మంది మంత్రి పదవులపై భారీగానే ఆశలు పెట్టుకున్నారు. అయితే కూటమికి న్యాయం చేయడం కోసం మంత్రి పదవులు త్యాగం చేయాల్సి వచ్చింది. అప్పట్లో చంద్రబాబు వారికి వేరే పదవులు ఇస్తామని బుజ్జగించడంతో ఎలాగోలా సర్ధుకుపోయారు. ఇప్పుడు శాసన మండలి లో రెండు ఖాళీలు ఏర్పడ్డాయి. వాటి కోసం చంద్రబాబుపై పార్టీ నేతలు ఒత్తిడి పెంచేశారు. ఎన్నికల సమయంతో కూటమి మిత్ర పక్షాల కోసం తాము సీట్లు ఖాళీ చేశామని..కనీసం ఇప్పుడైనా తమకు న్యాయం చేయాలని చంద్రబాబుపై ఒత్తిడి పెంచేస్తున్నారు. అయితే చంద్రబాబు వారి విషయంలో కఠిన వైఖరే అవలంబిస్తున్నారు. కూటమి మనుగడకు పాటుపడిన జనసేనకి శాసన మండలిలో ఓ స్థానం కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు.

Also Read : విశాఖలో సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రులతో భేటీ!, రుషికొండ ప్యాలెస్‌కు వెళ్తారా?

జనసేనకు ప్రాధాన్యం

రీసెంట్ గా రాష్ట్రంలోనే అత్యంత కీలక పదవి అయిన అడిషనల్ అడ్వకేట్ జనరల్ (ఏఏజీ) పదవిని జనసేనకు సంబంధించిన నేతకే ఇచ్చారు. జనసేన లీగల్ వ్యవహారాలను పర్యవేక్షించే ఇనవ సాంబశివ ప్రతాప్ కు ఈ పదవి కేటాయిస్తూ ఏపీ సర్కార్ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. ఇలా జనసేన నేతలు అడగకుండానే చంద్రబాబు వరాలు ఇవ్వడం చూస్తుంటే భవిష్యత్తులోనూ జనసేనతో కలిసి పనిచేయాలని బాబు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. జగన్ సర్కార్ ను ఓడించడంలో, బీజేపీతో జతకట్టడంలో పవన్ పోషించిన పాత్రను ఎవరూ మర్చిపోలేరు.

ఎన్నికల ముందు తక్కువ స్థానాలు జనసేనకు కేటాయించడంతో కార్యకర్తలు నిరాశ, నిస్పృహలతో ఉన్నారు. అయితే అనూహ్యంగా ఎన్నికల తర్వాత మాత్రం కీలక పదవులు రావడంతో ఇప్పుడు హ్యాపీగా ఫీలవుతున్నారు. ఈ రకంగా జనసేన కార్యకర్తలను ఉత్సాహపరచడం ద్వారా వారి పార్టీకి కూడా సముచిత స్థానాన్ని ఇస్తున్నామనే సంకేతాలు పంపుతున్నట్లు తెలుస్తోంది. భవిష్యత్తులోనూ ఈ ఇద్దరు నేతలు కలిసి పనిచేయాలని ..మరిన్ని విజయాలు సొంతంచేసుకోవాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.తెలంగాణ రాజకీయాలలోనూ ఇదే కూటమితో కలిసి రాబోయే స్థానిక ఎన్నికలలో కలిసి పోటీచేయాలని ఇరు నేతలూ ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం.

Tags

Related News

Tirupati Laddu: తిరుమలలో నిత్యం 3 లక్షల లడ్డూలు విక్రయం.. 500 వార్షిక ఆదాయం.. కల్తీ నెయ్యి వివాదం తరువాత..

YS Jagan: తిరుమల లడ్డూ వివాదంపై స్పందించిన జగన్.. చంద్రబాబు పెద్ద దుర్మార్గుడు

Tirupati Laddu Row: ఆ సంస్థ నెయ్యిలోనే అవన్నీ కలిశాయి.. 39 రకాల టెస్టుల్లో తేలింది ఇదే: టీటీడీ ఈవో

Vidadala Rajini: మాజీ మంత్రి విడుదల రజనీకి కష్టాలు.. రేపో మారో అరెస్ట్ తప్పదా?

Dussehra Holidays: విద్యార్థులకు గుడ్ న్యూస్.. దసరా సెలవుల తేదీలు ఇవే!

YCP vs Janasena: జనసేనలో చేరికలు.. కూటమిలో లుకలుకలు

YSRCP Petition: తిరుమల లడ్డూ వివాదం.. హైకోర్టులో వైసీపీ పిటిషన్, న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు

Big Stories

×