EPAPER

T20 Match: కొహ్లీ బాటలో అభిషేక్‌, కొత్తగా కాదు చెత్తగా..

T20 Match: కొహ్లీ బాటలో అభిషేక్‌, కొత్తగా కాదు చెత్తగా..

Ind Vs Zim Abhishek Sharma Have Unwanted Record After virat Kohli: టీమిండియా యువ క్రికెటర్‌గా అండర్‌ 19 వరల్డ్‌కప్‌ టీమ్‌లో ఆగష్టు 2008 సంవత్సరంలో కొహ్లీ ఎంట్రీ ఇచ్చారు. అప్పటినుండి తన ఆటతో అపోజిషన్ టీమ్‌కి ముచ్చెమటలు పట్టిస్తుంటాడు.బ్యాట్ పట్టుకొని పిచ్‌లోకి దిగితే చాలు కొహ్లీ ఫ్యాన్స్‌కి ఆనందం కట్టలు తెంచుకుంటుంది. అంతేకాదు తన ఆటకోసం లక్షల మంది ఫ్యాన్స్ వెయిట్ చేస్తుంటారు. అంతలా ఆకట్టుకున్న కొహ్లీ గతకొద్ది రోజులుగా తన ఆటతీరులో చాలామార్పులు వచ్చాయి. టీమిండియా స్టార్‌గా పేరు తెచ్చుకున్న విరాట్ కొహ్లీ టీ20 మ్యాచ్‌ కొత్తగా కాదు చెత్తగా ఆడుతూ అభిమానుల నుండి చాలా విమర్శలు ఎదుర్కొన్నారు.


Also Read: టీ20 ర్యాంకింగ్ టాప్-10లో సూర్యకుమార్, రుతురాజ్, శ్రీలంక‌, కివీస్‌లకు షాక్

తాజాగా అదే బాటలో యువ బ్యాటర్ అభిషేక్‌ శర్మ వచ్చి చేరాడు. అరుదైన రికార్డుకు బదులు చెత్త రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. ఇంటర్నేషనల్ టీ20 మ్యాచ్‌లో సెంచరీ చేసిన తరువాత డిమోట్ అయిన రెండో భారత ఆటగాడిగా పేరు సంపాదించుకున్నాడు. ఐదు టీ20 సిరీస్‌లో భాగంగా జింబాబ్వేతో జరిగిన రెండో టీ20 ఓపెనర్‌గా బరిలోకి దిగి సెంచరీ చేసిన అభిషేక్‌.. మూడో టీ20లో డిమోట్‌ అయి మూడో స్థానంలో బ్యాటింగ్ చేశాడు. రెగ్యూలర్ ఓపెనర్ యశస్వి జైస్వాల్ తుది జట్టులోకి రావడంతో అభిషేక్ ఫస్ట్ డౌన్‌లో బ్యాటింగ్ చేయాల్సి వచ్చింది. ఈ మ్యాచ్‌లో అభిషేక్‌ తీవ్రంగా నిరాశపరిచాడు. 9 బాల్స్‌కి 10 రన్స్‌ మాత్రమే చేశాడు.


గతంలో ఇలాంటి ఘటనలు చాలామంది టీమిండియా బ్యాటర్స్‌ ఫేస్ చేశారు. కానీ 2022 సంవత్సరంలో ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఓపెనర్‌గా బరిలోకి దిగి సెంచరీ చేసిన కొహ్లీ. ఆ తరువాత జరిగిన మ్యాచ్‌లో ఏకంగా మూడో స్థానంలో బ్యాటింగ్‌కు దిగాడు. ఆ మ్యాచ్‌లో విరాట్ కేవలం 2 పరుగులు మాత్రమే చేశాడు.ఇప్పుడు అభిషేక్‌ శర్మ కూడా కొహ్లీనే ఫాలో అయ్యాడు. బ్యాటింగ్ ఆర్డర్‌లో అభిషేక్‌ని డిమోట్‌ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కెప్టెన్ శుభ్‌మన్‌ గిల్‌పై ఫ్యాన్స్ మండిపడుతున్నారు. రకరకాల కామెంట్స్ చేస్తూ ఈ కెప్టెన్ చాలా సెల్పిష్ గురూ అంటూ నెట్టింట ఎవరికి తోచిన కామెంట్స్ వారు చేస్తున్నారు.

Tags

Related News

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్: బంగ్లాదేశ్ 26/3

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

IND vs BAN: అదరగొట్టిన ఆల్ రౌండర్లు : అశ్విన్ సెంచరీ, జడేజా 86 నాటౌట్

Big Stories

×