EPAPER

No abnormal difference in NEET Result: నీట్ ఫలితాల్లో పెద్ద తేడా ఏం లేదు: ఎన్టీఏ

No abnormal difference in NEET Result: నీట్ ఫలితాల్లో పెద్ద తేడా ఏం లేదు: ఎన్టీఏ

No abnormal difference in NEET-UG Result this year: నీట్ పరీక్ష అక్రమాల వ్యవహారంపై దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేగిన విషయం తెలిసిందే. దీనిపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతుంది. నీట్ పేప్ లీకైన మాట వాస్తవమేనంటూ ధర్మాసనం కూడా పేర్కొన్నది. అయితే, నీట్ ఫలితాల విషయమై ఎన్టీఏ (నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ) తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ ఏడాది విడుదలైన నీట్ యూజీ ఫలితాల్లో పెద్ద తేడా ఏమీ లేదని వెల్లడించింది. ఈ మేరకు సుప్రీంకోర్టుకు తెలిపినట్లు తెలుస్తోంది.


2020 నుంచి 2024 వరకు నీట్ పరీక్ష రాసిన విద్యార్థుల మార్కులను పరిశీలించామని, అయితే.. సగటు స్కోర్ కు అనుగుణంగానే కటాఫ్ మార్కులు ఉన్నాయని ఎన్టీఏ తెలిపింది. వాటితో పోలిస్తే ఈ ఏడాది విడుదలైన ఫలితాల్లో భిన్నమైన తేడా ఏమీ లేదని పేర్కొన్నది. పరీక్ష పోటీతత్వం, అభ్యర్థుల ప్రదర్శన ఆధారంగా ప్రతి ఏడాది కటాఫ్ మార్కులు ఉంటాయని స్పష్టం చేసింది.

2020లోనూ కరోనా సమయంలో 13.6 లక్షలమంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారని, 720 మార్కులకు గానూ సగటు స్కోర్ 297.18గా ఉందని వెల్లడించింది. ఆ సమయంలో జనరల్ కేటగిరీ కటాఫ్ 147.. ప్రస్తుత ఏడాదిలో సగటు స్కోర్ 323.55 కాగా, క్వాలిఫైయింగ్ మార్కులు 164 అని కోర్టుకు కోర్టుకు తెలిపింది. ఈసారి 23.33 లక్షల మంది పరీక్షకు హాజరయ్యారని, ఈ స్థాయిలో హాజరుకావడం ఇదే తొలిసారి అని పేర్కొన్నది. అదేవిధంగా పేపర్ లీక్ ఆరోపణలు వచ్చిన కేంద్రాల్లో కూడా విద్యార్థుల మార్కుల్లో పెద్ద వ్యత్యాసం లేదని వెల్లడించినట్లు తెలుస్తోంది.


Also Read: నో కాంప్రమైజ్, చిక్కుల్లో ట్రైన్డ్ ఐఏఎస్.. వీఐపీ సదుపాయాల కోసం..

కాగా, నీట్ యూజీ ఎగ్జామ్ పేపర్ లీకైందని, అవకతవకలు, అక్రమాలు జరిగాయని.. అందువల్ల పరీక్షను రద్దు చేయాలని సుప్రీంకోర్టులో మొత్తం 38 పిటిషన్లు దాఖలయ్యాయి. వీటిని భారత సీజేఐ (భారత ప్రధాన న్యాయమూర్తి) జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారిస్తోంది. పేపర్ లీకైనమాట వాస్తవమేనని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే.. గ్రేస్ మార్కులు కలిపిన 1563 మందికి మళ్లీ నీట్ పరీక్ష నిర్వహించిన సవరించిన నీట్ ర్యాంకుల జాబితాను ఎన్టీఏ విడుదల చేసింది. ఈ విచారణ నేపథ్యంలో కౌన్సిలింగ్ ను కూడా వాయిదా వేసింది.

Tags

Related News

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Train accident in Uttar Pradesh: పట్టాలు తప్పిన మరో రైలు.. రైళ్ల రాకపోకలకు అంతరాయం

Big Stories

×