EPAPER

BRS Merge in Congress : కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం ?

BRS Merge in Congress : కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం ?

BRS Merge in Congress(Political news in telangana): BRS ప్రతిపక్షస్థానాన్ని కోల్పోనుందా..? ఎమ్మెల్యేలందరూ చేజారిపోతున్నా నిలువరించలేని నిస్సహాయ స్థితిలో గులాబీనేత పడిపోయారా? కొన్నిరోజుల్లోనే BRSLPని కాంగ్రెస్ విలీనం చేసుకోనుందా..? ఎనిమిది మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ ప్రధాన ప్రతిపక్షంలోకి రానుందా..? ఈ ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. వరుస ఘటనలతో కేసీఆర్ ఉక్కిరిబిక్కిరి కావటంతో ఆ పార్టీ పనైపోయిందంటూ వార్తలు గుప్పుమంటున్నాయి.


తెలంగాణలో ఉద్దండ రాజకీయనేతగా పేరు తెచ్చుకున్న కేసీఆర్‌కు వరుసగా షాకులపై షాకులు తగులుతున్నాయి. ఇప్పటికే BRSలో గెలిచిన ఎమ్మెల్యేలు ఇతర పార్టీల్లోకి వెళ్లగా.. త్వరలోనే అసెంబ్లీలో ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా పోతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి. అదే జరిగితే బీజేపీ.. ప్రతిపక్షహోదాలోకి రాబోతుందనే చర్చ సాగుతోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే.. ఈ నెలాఖరు నాటికి BRS లెక్కలు తారుమారు అవుతాయని.. సింగిల్ డిజిట్‌కే ఆ పార్టీ మింగుతున్నాయనే ప్రచారం సాగుతోంది. తెలంగాణలో అతి పెద్ద ఉద్యమపార్టీగా ఆవిర్భవించిన BRS మూడో స్థానానికి పడిపోతుందనే వార్తలు గుప్పుమంటున్నాయి.

తెలంగాణ ఏర్పాటు తర్వాత.. పదేళ్ల పాటు పాలించిన కేసీఆర్‌.. బంగారు తెలంగాణ పేరుతో ప్రజాసంపదను లూటీ చేశారంటూ ప్రతిపక్షాలు గతంలో ఆరోపించాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చాక.. కేసీఆర్‌ విధానాలను ఎండగడుతూ రేవంత్‌ సర్కారు శ్వేతపత్రాలను విడుదల చేస్తోంది. ప్రతి అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లటంతో.. బీఆర్‌ఎస్‌ డౌన్‌ఫాల్ మొదలైంది. గెలిచిన 39 మంది ఎమ్మెల్యేలు ఒక్కొక్కరూ కారు దిగి.. కాంగ్రెస్ గూటికి చేరుతున్నారు. ఇప్పటికే ఎనిమిది ఎమ్మెల్యేలు, ఆరుగురు ఎమ్మెల్సీలు, ఒక రాజ్యసభ సభ్యుడు… కేసీఆర్‌కు వీడ్కోలు పలికి హస్తం పార్టీకి చేరారు. దీంతో 39 నుంచి బీఆర్ఎస్ బలం 31 కి పడిపోయింది. మరికొన్ని రోజుల్లో బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లోకి భారీగా వలసలు ఉంటాయనే టాక్ వినిపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదనే చర్చ రాష్ట్ర వ్యాప్తంగా సాగుతోంది.


Also Read : చంద్రబాబుని కలిసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.. కేసీఆర్ కు షాక్ తప్పదా ?

చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా కారు పార్టీ.. గత లోక్‌సభ ఎన్నికల్లో ఒక్క సీటు కూడా దక్కించుకోలేకపోయింది. ఇప్పుడు ఉన్న ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా చేజారుతున్నా.. కాపాడుకోలేకపోతోంది. అంతేకాదు.. కారు పార్టీ కింగ్ KCR ఫామ్ హౌస్‌ దాటలేక పోతున్నారంటూ ఆయనపై సొంతపార్టీ నేతలే తీవ్రఅసహనాన్ని వ్యక్తం చేస్తున్నారట. బీఆర్‌ఎస్ పతనం గురించి కొన్ని రోజులుగా ప్రచారం జరుగుతున్నా.. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావు అండ్‌ కో నోరు విప్పిన పాపాన పోలేదు. ఓటమి తర్వాత కుంగిపోయి.. కుమిలిపోతున్నారే తప్ప.. నేతలను కాపాడుకునే ప్రయత్నాలు చేయటం లేదనే టాక్ నడుస్తోంది. మరోవైపు.. కాంగ్రెస్ పార్టీ ఎదుగుదల, ప్రజాపాలనను చూసిన నేతలు.. తమకు తామే స్వయంగా వచ్చి పార్టీలో చేరతామంటూ PCC భవనం చుట్టూ తిరిగే పరిస్థితి వచ్చిందని హస్తం నేతలు చెప్పుకుంటున్నారు. కడియం శ్రీహరితో మొదలైన వలసలు.. తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్, పోచారం శ్రీనివాసరెడ్డి, కాలె యాదయ్య, తాజాగా గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి చేరిక దాకా చేరింది.

మరికొందరు నేతలు కూడా హస్తం గూటికి చేరతారనే ప్రచారం సాగుతోంది. నేడో రేపో అలంపూర్ ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ తీర్థం పుచ్చుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. కేసీఆర్ పదేళ్లకాలంలో తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల LPలను విలీనం చేసుకున్న విధానంగానే.. ఇప్పుడు BRS వంతు వచ్చిందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉన్న వారిని కాపాడుకోలేక.. చేసేది ఏమీ లేక.. తాను తీసుకున్న గోతిలో తానే పడినట్లు BRS పరిస్థితిమ మారిందని రాజకీయ పండితులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

ఈ నెల చివరి వారంలో ప్రారంభమయ్యే బడ్జెట్ సమావేశాల నాటికి బీఆర్ఎస్‌ఎల్పీ కాంగ్రెస్‌లో విలీనం దిశగా పరిణామాలు మారుతున్నాయి. ఇటీవల జరుగుతున్న ఘటనలే దీనికి నిదర్శంగా కనిపిస్తోంది. కాంగ్రెస్‌ కంటే కేవలం 1.8 శాతం ఓట్లు మాత్రమే తక్కువగా వచ్చాయని.. కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్‌రావు అనేక సార్లు కామెంట్ చేశారు. రాష్ట్రంలో బలమైన ప్రతిపక్షంగా వ్యవహరిస్తామని.. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడతామని చెప్పుకుంటూ వచ్చారు. ఫామ్‌హౌస్ లేదా BRS భవన్‌కే వారు పరిమితం కావటంతో.. నేతలకు మరింత స్వేచ్ఛ వచ్చిందనే వాదనలూ ఉన్నాయి. ఒకవేళ రహస్య మంతనాలతో పాటు, బుజ్జగింపులు చేస్తున్నా.. బీఆర్‌ఎస్‌లో కొనసాగేందుకు నేతలు ఆసక్తి చూపటం లేదనే వార్తలు గుప్పుమంటున్నాయి.

Also Read : క్యాడర్‌ కోరుతున్నది ఒకటి.. కేటీఆర్ చేస్తున్నది మరొకటి

ఎమ్మెల్యేలంతా ఒక్కొక్కరుగా చేజారిపోవటంతో కారు పార్టీ అంతర్మథనంలో పడిందట. వేగంగా జరుగుతున్న రాజకీయ పరిణామాలు.. అనేక ఊహాగానాల నేపథ్యంలో ఈ నెలాఖరు కల్లా…BJP కనీసంగా 12సీట్లతో ప్రధానప్రతిపక్షంగా గుర్తింపు పొందనున్నదనే మాటలు బలంగా వినిపిస్తున్నాయి. పదేళ్లు అధికారంలో ఉండి.. ప్రతిపక్షాల గొంతు నొక్కిన బీఆర్ఎస్.. అదే అసెంబ్లీలో సింగిల్ డిజిట్ సీట్లకు ప్రాతినిధ్యం వహించే పార్టీగా మారే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ప్రస్తుతం బీజేపీకి ఎనిమిది మంది శాసనసభ్యులున్నారు. బీజేపీతో టచ్‌లో ఉన్న వారు చేరితే ప్రధాన పక్ష హోదాను ఆ పార్టీ సునాయాసంగా చేజిక్కించుకునే అవకాశం ఉంది. కానీ.. ఇప్పటివరకూ ఒక్క ఎమ్మెల్యే కూడా బీజేపీ కార్యాలయం ఎక్కిన సందర్భాలు లేవు. నలుగురు ఐదుగురు BRS ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారని ఏలేటి మహేశ్వర్‌రెడ్డి చెబుతున్నారు. ఒక అడుగు ముందుకు వేసిన కేంద్రమంత్రి బండి సంజయ్.. ఏకంగా 26 మంది తమతో టచ్‌లో ఉన్నారని చెప్పుకొస్తున్నారు. ఇలా.. ఎవరికి వారే నేతలంతా మాతో టచ్‌లో ఉన్నారని లెక్కలు మాత్రం చెబుతున్నారు. కానీ.. చేరే వాళ్లు ఎవరు అనేది ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు.. పార్టీలో చేర్చుకోడానికి వ్యతిరేకం కాదంటున్నారు కమలం పార్టీ నేతలు.. ఎవరైనా బీజేపీలోకి రావాలంటే తమ పదవికి రాజీనామా చేయాలని కండీషన్‌ పెట్టేశారు. అయినా ఐదారుగురు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు ఇప్పటికే ఢిల్లీ నేతలతో సంప్రదింపులు జరుపుతున్నట్టుగా ప్రచారం సాగుతోంది. ఎవరైతే విచారణ సంస్థల్లో చిక్కుకున్న BRS ఎమ్మెల్యేలు బీజేపీ వైపు చూస్తున్నారని సమాచారం.

ఇలాంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్‌లో చేరేందుకే ఎక్కువ అవకాశం ఉందని రాజకీయవర్గాలు అంచనా వేస్తున్నాయి. తమ నియోజకవర్గాల్లో ఈక్వేషన్స్‌ కుదరక కొందరు.. ED, CBI, IT విచారణలు ఎదురుకుంటున్న వారంతా బీజేపీ వైపు మొగ్గు చూపుతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. కనీసం నలుగురైనా బీజేపీలో చేరుతారని ఆ పార్టీ నేతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు. అప్పుడే ప్రధాన ప్రతిపక్ష హోదా దక్కడానికి వీలు ఉంటుందని కమలం పార్టీ భావిస్తోంది. BRSను రాజకీయంగా సమాధి చేయాలన్న కాంగ్రెస్ లక్ష్యంతో.. బీజేపీ బలపడుతోందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

Tags

Related News

Cabinet Meeting: నేడు తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

BRS Mlc Kavitha: రంగంలోకి కవిత.. రీఎంట్రీకి ముహూర్తం ఫిక్స్!

New Ration Card: ప్రజలకు శుభవార్త.. అక్టోబర్ 2 నుంచి రేషన్ కార్డులకు అర్జీలు.. అర్హతలు ఇవే!

Shankar Nayak: శంకర్ నాయక్.. వంకర బుద్ధి! దళితుల భూములతో ఆటలు

Chandrababu Naidu: సీఎం రేవంత్ రెడ్డి మీటింగ్‌లో నారా బ్రాహ్మణి.. స్కిల్ వర్సిటీ బాధ్యతలు?

Bandi Sanjay: ఆ దేవుడు క్షమించడు: తిరుపతి లడ్డూ వివాదంపై స్పందించిన బండి సంజయ్

Big Stories

×