EPAPER

Coolpad Cool 50: మరో బ్రాండ్ రీ ఎంట్రీ.. కళ్లుచెదిరే ఫీచర్లతో దేశీయ మార్కెట్‌లో లాంచ్‌కు సిద్ధం.. ఈసారి తగ్గేదే లే..!

Coolpad Cool 50: మరో బ్రాండ్ రీ ఎంట్రీ.. కళ్లుచెదిరే ఫీచర్లతో దేశీయ మార్కెట్‌లో లాంచ్‌కు సిద్ధం.. ఈసారి తగ్గేదే లే..!

Coolpad Cool 50 Smartphone Launch Soon In India: ఒకప్పుడు దేశీయ మార్కెట్‌లో అందుబాటులోకి వచ్చిన ఎన్నో కంపెనీల స్మార్ట్‌ఫోన్లు కాలక్రమేనా కరుమరుగైపోయాయి. దేశీయ మార్కెట్‌లో తమ హవా కొనసాగించలేక తమ బిజినెస్‌ను ఆపేసుకున్నాయి. అయితే అందులో కొన్ని కంపెనీలు మళ్లీ తమ ప్రొడక్టులను దేశీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో రిలీజ్ చేస్తూ అందరినీ అట్రాక్ట్ చేస్తున్నాయి. ఇప్పుడు మరొక స్మార్ట్‌ఫోన్ కంపెనీ తన ఫోన్‌ను భారత మార్కెట్‌లో లాంచ్ చేసేందుకు సన్నాహాలు చేస్తుంది. ప్రముఖ చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ కూల్‌ప్యాడ్ ఒకప్పుడు భారతదేశంలో తన ఫోన్లను విక్రయించింది.


అయితే కంపెనీ చాలా కాలం క్రితం దేశంలో తన బిజినెస్‌ను ఆపేసింది. అయినప్పటికీ కూల్‌ప్యాడ్ తన హోమ్ మార్కెట్‌లో కొత్త మోడళ్లను పరిచయం చేస్తూనే ఉంది. ఇక ఇప్పుడు కంపెనీ Coolpad Cool 50ని దేశీయ మార్కెట్‌లో లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. తాజాగా ఈ ఫోన్‌కి సంబంధించిన కొన్ని వివరాలను వెల్లడించింది. ఈ ఫోన్ త్వరలో దేశంలో లాంచ్ అవుతుందని తెలిపింది. ఈ రాబోయే స్మార్ట్‌ఫోన్ అనేక కీలక స్పెసిఫికేషన్‌లు కూడా వెల్లడయ్యాయి. రాబోయే Coolpad స్మార్ట్‌ఫోన్ 4,700mAh బ్యాటరీతో రానుంది.

దీనిని ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌ల ద్వారా కొనుగోలు చేసుకోవచ్చు. చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబోలో కూల్‌ప్యాడ్ తాజా పోస్ట్ ప్రకారం.. ఈ కూల్‌ప్యాడ్ స్మార్ట్‌ఫోన్ త్వరలో ఆఫ్‌లైన్ అండ్ ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లలో సేల్ జరుగుతుందని తెలిపింది. అయితే ఖచ్చితమైన లాంచ్ అండ్ సేల్ తేదీని వెల్లడించలేదు. కాగా ఈ ఫోన్ RAM సామర్థ్యం వెల్లడించలేదు.. కానీ ఇది 256GB స్టోరేజ్‌ను కలిగి ఉంటుంది తెలిపింది. రాబోయే కూల్‌ప్యాడ్ కూల్ 50 స్మార్ట్‌ఫోన్ అనేక కీలక స్పెసిఫికేషన్‌లు కూడా అదే పోస్ట్‌లో వెల్లడయ్యాయి.


Also Read: ఉఫ్ ఉఫ్.. ఫ్లిప్‌ ఫోన్‌పై రూ.50,000 భారీ డిస్కౌంట్.. ఫీచర్లు కుమ్మేసాయ్..!

దీని ప్రకారం.. ఈ స్మార్ట్‌ఫోన్ 4700mAh బ్యాటరీని కలిగి ఉంటుందని తెలుస్తోంది. అలాగే ఇది 6.56-అంగుళాల డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇది వాటర్‌డ్రాప్-స్టైల్ నాచ్‌ను కలిగి ఉంటుంది. ప్రీమియం అనుభవం కోసం వెనుక ప్యానెల్‌లో AG గ్లాస్ ఉపయోగించబడింది. రాబోయే స్మార్ట్‌ఫోన్ డ్యూయల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో LED ఫ్లాష్ ఉంటుంది. ఇది సిల్వర్, బ్లాక్, పింక్ వంటి కలర్ ఆప్షన్‌లలో లాంచ్ చేయబడుతుందని కంపెనీ తెలిపింది.

కాగా ఈ ఫోన్ ఇటీవల చైనా కంపల్సరీ సర్టిఫికేషన్ (CCC)లో గుర్తించబడింది. ఈ కూల్‌ప్యాడ్ కూల్ 50 స్మార్ట్‌ఫోన్.. 720×1600 పిక్సెల్‌ల స్క్రీన్ రిజల్యూషన్‌ను కలిగి ఉంటుందని తెలిపింది. అలాగే ఈ ఫోన్ దాదాపు 199 గ్రాముల బరువు ఉంటుందని పేర్కొంది. ఇది 1.8GHz క్లాక్ స్పీడ్‌తో ఆక్టా-కోర్ CPUని కలిగి ఉంటుందని భావిస్తున్నారు. దీనికి సంబంధిచించిన మరిన్ని వివరాలు త్వరలో వెల్లడికానున్నాయి.

Tags

Related News

Xiaomi 15 Series: షియోమి నుంచి కొత్త ఫోన్లు.. 90W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో లాంచ్‌కు రెడీ, స్పెసిఫికేషన్లు అదిరిపోయాయ్!

Iphone 16 Series: ఐఫోన్ 16, ప్లస్, ప్రో, ప్రో మాక్స్ సేల్ షురూ.. ధరలు, ఆఫర్లు, ఫీచర్లు ఫుల్ డీటెయిల్స్!

Vivo T3 Ultra: అల్ట్రా ఫస్ట్ సేల్‌‌కి వచ్చేసింది.. భారీ డిస్కౌంట్ పొందొచ్చు, కెమెరాలో తోపు అంటే ఇదేనేమో!

iPhone16 series: ఐఫోన్ 16 సిరీస్.. ఫస్ట్ సేల్ ప్రారంభం, బారులు తీరిన జనం..

Moto G85 5G: మరో రెండు కొత్త కలర్‌ వేరియంట్‌లలో మోటో ఫోన్.. ఫీచర్లు అదుర్స్, ధర ఎంతంటే?

iQoo Z9 Turbo+: అ అ అదుర్స్.. 6400 mAh బ్యాటరీతో ఐక్యూ కొత్త ఫోన్, ఫీచర్లు పిచ్చెక్కించాయ్ బాబోయ్!

Honor 200 Lite 5G: హమ్మయ్య వచ్చేసింది.. AI ఫీచర్లు, 108MP కెమెరాతో కొత్త ఫోన్ లాంచ్, ధర చాలా తక్కువ!

Big Stories

×