EPAPER

Odisha: పూరీలో అపశృతి, రథం నుంచి పక్కకి ఒరిగిన విగ్రహం

Odisha: పూరీలో అపశృతి, రథం నుంచి పక్కకి ఒరిగిన విగ్రహం

Puri Jagannath temple news today(Live tv news telugu): ఏటా ఆషాఢ మాసంలో శుక్లపక్షం విధియ తిథి నుంచి ఒడిశా రాష్ట్రంలోని విశ్వ ప్రసిద్ధిగాంచిన జగన్నాథ రథయాత్ర ప్రారంభమవుతుంది.విదియ నుంచి పది రోజుల పాటు అంగరంగ వైభవంగా ఈ ఉత్సవాలు జరుగుతాయి.9 రోజుల పాటు ఆలయం వెలుపలే విగ్రహాలు పూజలందుకుంటాయి.పెంపుడు తల్లి గుండిచా ఆలయం వద్దకు జగన్నాథ,బలభధ్ర,సుభద్రా మాతలు చేరుకుని..తిరిగి బహుదా యాత్రతో ఆలయానికి వస్తారు.ఈ రథయాత్రలో పాల్గొనడానికి దేశ,విదేశాల నుండి లక్షలాది మంది భక్తులు తండోపతండాలుగా ఇక్కడికి తరలివస్తారు.


ఇక పూరీ జగన్నాథుడి రథయాత్రలో గుండిచా మందిరం సమీపంలో మంగళవారం రాత్రి చతుర్థామూర్తుల పొహండి జరిగింది.ఈ కార్యక్రమంలో మరోసారి అపశృతి చోటుచేసుకుంది.రథం నుంచి ఒక్కసారిగా బలభద్రుని కిందకు దించుతున్న టైమ్‌లో విగ్రహం పక్కకు ఒరిగిపోయింది.సేవాయత్‌లపై ఈ విగ్రహం పడటంతో 9 మందికి పైగా గాయపడ్డారు.గాయపడ్డవారిని వెంటనే చికిత్స కోసం పూరీ ఆసుపత్రికి తరలించారు.ఇక ఇలాంటి ఘటన గతంలో ఎన్నడూ జరగలేదని సేవాయత్‌లు,భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఇది ఆకస్మికంగా జరిగిందని సేవాయత్‌ల సంఘం ప్రతినిధి వెల్లడించారు.

Also Read: ఏడు రాష్ట్రాలు..13 అసెంబ్లీ సీట్లకు పోలింగ్


ఇక ఆదివారం రథయాత్రలో అపశృతి జరిగింది.ఈ ఘటనలో ఒకరు ప్రాణాలు కోల్పోగా..మరో 400 మంది గాయపడ్డారు. 50 ఏళ్ల తరువాత పూరీలో రథయాత్ర రెండు రోజుల పాటు జరిగింది. జూలై 7న నవయవ్వన రూపం నేత్రోత్సవం, రథయాత్ర ఒకేరోజు నిర్వహించాల్సి వచ్చింది. రథయాత్ర స్టార్ట్ అయ్యే సమయానికి సాయంత్రం కావడంతో కొద్ది దూరం వెళ్లిన తర్వాత రథాలను నిలిపివేశారు. మర్నాడు సోమవారం ఉదయం 11 గంటలకు మళ్లీ రథాల ప్రయాణం ప్రారంభం కాగా.. మధ్యాహ్నం సమయానికి పెంచిన తల్లి గుండిచా ఆలయానికి చేరుకొన్నాయి.జగన్నాథుడు, బలభద్రుడు సోదరి సుభద్రా దేవిలు పెంపుడు తల్లి వద్దకు చేరుకున్న మర్నాడు పొహండి స్టార్ట్‌ అయింది. ఈ టైమ్‌లో విగ్రహాలను రథంపై నుంచి గుండిచా ఆలయంలోకి తరలిస్తుండగా బలభద్రుని విగ్రహం ఒరిగి సేనాయత్‌లపై పడింది.

ఈ ఘటనలో 8 మందికి పైగా గాయపడగా ఐదుగురిని చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించినట్లు పూరీ జిల్లా కలెక్టర్ తెలిపారు. స్వల్ప విరామం తరువాత చతురారర్థ మూర్తులను గుండిచా ఆలయంలో చేర్చినట్లు తెలిపారు.బహుదా యాత్ర వరకు విగ్రహాలు అక్కడే పూజలందుకోనున్నాయి. జూలై 14న బహుదా యాత్ర జరగనుంది. మరోవైపు ఈ ఘటనపై ఒడిశా సీఎం మోహన్‌ చరణ్ మాఝీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. తక్షణమే అక్కడకు వెళ్లి అవసరమైన చర్యలు తీసుకోవాలని న్యాయశాఖ మంత్రి అధికారులను ఆదేశించారు.

Tags

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×