EPAPER

KTR Padayatra : క్యాడర్‌ కోరుతున్నది ఒకటి.. కేటీఆర్ చేస్తున్నది మరొకటి

KTR Padayatra : క్యాడర్‌ కోరుతున్నది ఒకటి.. కేటీఆర్ చేస్తున్నది మరొకటి

KTR Padayatra in Telangana(TS news updates): దేశ రాజకీయాల్లో పాదయాత్రలు ఓ ట్రెండ్‌లా నడుస్తూ ఉంటాయి. పార్టీ కష్టాల్లో ఉన్నపుడు అగ్రనేతలు పాదయాత్రలు చేసి క్యాడర్‌లో ఉత్సాహాన్ని నింపుతాయి. ప్రతిపక్షం ఉన్నవారికి పాదయాత్రలు బాగా కలిసి వస్తాయి. యాత్రల పేరుతో ప్రజల దగ్గరకు వెళ్తే అధికార పార్టీపై తెలియకుండానే ఒత్తిడి పెరుగుతుంది. అలా పాదయాత్ర చేసిన నాయకుడు, ఆ పార్టీ మైలేజ్ పెరుగుతుంది. భారత్ జోడో యాత్ర తర్వాత రాహుల్ గాంధీ ఇమేజ్ అమాంతం పెరిగింది. కాంగ్రెస్ అధికారంలోకి రాకపోయినా.. రాహుల్‌ని బలమైన నేతలగా అధికార పార్టీ భావించే స్థాయికి జోడో యాత్ర తీసుకెళ్లింది.


ఇక ఏపీలో అయితే పాదయాత్రల ఫలితం 100 శాతం కనిపించింది. మొదట రాజశేఖర్ రెడ్డి తన పాదయాత్ర ద్వారానే ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ను అధికారంలోకి తీసుకొని వచ్చారు. తర్వాత 2014లో టీడీపీకి గెలుపునకు కూడా చంద్రబాబు పాదయాత్రే కారణం. ఆ తర్వాత వైసీపీ అధినేత జగన్ చేసిన పాదయాత్ర ఆ పార్టీని 2019లో భారీ మెజార్టీతో గెలిపించింది. యువగళం పేరుతో లోకేష్ చేసిన యాత్ర ఆయనలో కొత్త లీడర్ ను చూపించింది. కూటమి గెలుపునకు కొంతమేర కారణమైంది.

ఏపీలో పాదయాత్రల సక్సెస్ రేట్ బాగున్నా.. తెలంగాణలో మాత్రం అంతగా లేదు. రేవంత్ రెడ్డి, భట్టి విక్రమార్క మినహా మిగిలిన ఎవరి పాదయాత్రలు కూడా సక్సెస్ కాలేదు. షర్మిల, బండి సంజయ్ పాదయాత్రలు చేశారు. కానీ.. ఫలితం లేదు. గెలుపు ఓటముల సంగతి అటుంచితే.. పాదయాత్రలు కొంతమేర క్యాడర్ లో ఉత్సాహాన్ని నింపొచ్చు. అందుకే.. కేటీఆర్ పాదయాత్ర చేయాలని బీఆర్ఎస్ నేతలు కోరుతున్నారు. పాదయాత్ర చేస్తారని సోషల్ మీడియాలో ప్రచారం కూడా చేస్తున్నారు.


Also Read : ఫిరాయింపుల చట్టం కాంగ్రెస్ పుణ్యమే : కెటీఆర్

కానీ.. అఫీషియల్ గా అలాంటి అనౌన్స్‌మెంట్ లేదు. పార్టీ క్యాడర్ కోరికగానే కనిపిస్తుంది తప్పా.. కేటీఆర్‌లో ఆ ఉత్సాహం లేదు. ఇప్పుడు పాదయాత్ర చేసినా ఉపయోగం లేదని కేటీఆర్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. దగ్గరలో ఎన్నికలు లేవు కాబట్టి.. యాత్రలతో సమయం వృథా చేయడమే అవుతుందని ఆయన ఆలోచనగా ఉంది. అయితే.. పార్టీ క్యాడర్ కూడా అదే మాట చెబుతున్నారు. ఇప్పట్లో ఎన్నికలు లేవు.. గులాబీ శ్రేణులు నిరుత్సాహంగా ఉన్నారని చెబుతున్నారు. ఎన్నికల వచ్చేనాటికి క్షేత్ర స్థాయి నేతలు కండువాలు మార్చకుండా ఉండాలంటే అధినేత ప్రజల్లో ఉండాలని కోరుతున్నారు. లేదంటే ఎన్నికలు వచ్చే నాటికి కారు ఖాళీ అయిపోతుందని అంటున్నారు.

ఫలితాలు గురించి కాకుండా.. పార్టీ బలోపేతం కోసం పాదయాత్ర చేయాలని కోరుకుంటున్నారు. అలా చేస్తే శ్రేణులకు పార్టీ అండగా ఉందనే అభిప్రాయం కలుగుతుందని చెబుతున్నారు. కానీ, కేటీఆర్‌లో మాత్రం ఆ ఆలోచన లేనట్టే ఉంది. ప్రస్తుతం రాష్ట్రంలో బీఆర్ఎస్ ఉందా లేదా అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఫలితాలు సంగతి అంటుంచితే పార్టీలో ఉత్సాహం నింపడానికి పాదయాత్ర ఉపయోగపడుతుంది.

ఒకనేత బలమేంటో ప్రజలకు విపక్ష పార్టీలకు తెలుస్తోంది. 3 వేలకు పైగా షర్మిల తెలంగాణలో పాదయాత్ర చేశారు కాబట్టే.. కాంగ్రెస్ పార్టీ ఆమెలోని మొండితనాన్ని గుర్తించారు. పోరాట పటిమను గుర్తించారు. బండి సంజయ్ కూడా యాత్ర చేసి ఫెయిల్ అయినా.. పార్టీలో ఆయనకు ఓ గుర్తింపు లభించింది. కేంద్రమంత్రి పదవి అతన్ని వరించింది. ఏదో ఒక రూపంలో పాదయాత్ర ఫలితం కనిపిస్తుందని చాలా మంది భావిస్తున్నారు. కానీ, పాదయాత్రపై కేటీఆర్ ఆసక్తిగా లేకపోవడంతో పార్టీ శ్రేణులు నిరుత్సాహానికి గురవుతున్నారు.

Related News

Bigg Boss 8 Day 19 Promo: కఠిన నిర్ణయం తీసుకున్న బిగ్ బాస్..సైలెంట్ అయిన కంటెస్టెంట్స్ ..!

Squid Game Season 2 Teaser: టీజర్ రిలీజ్ చేసిన నెట్ ఫ్లిక్స్.. ఈ భయంకరమైన ఆట చూడడానికి సిద్ధమా..?

Johnny Master: ఢీ 11 లో ఎలిమినేట్.. జానీ మాస్టర్ ఇంత కథ నడిపారా.?

Prabhas – Hanu : గప్ చుప్ గా షూటింగ్… ఇంత సీక్రెట్ గా ఎందుకో..?

Hansika Motwani: అసభ్యకరంగా తాకాడు.. నొప్పి భరించలేకపోయా అంటూ హన్సిక ఎమోషనల్..!

Mokshagna: తొలి మూవీ బడ్జెట్ ఎంతో తెలుసా.. ఆల్ టైం రికార్డ్ సృష్టించబోతున్న బాలయ్య..!

Nagabubu: నాగబాబు సెటైరికల్ పోస్ట్.. జానీ మాస్టర్ కేనా..?

Big Stories

×