EPAPER

YSR Legacy : ఇక వైఎస్ లెగసీ షర్మిల సొంతం.. జగన్ వదిలేసినట్టేనా?

YSR Legacy : ఇక వైఎస్ లెగసీ షర్మిల సొంతం.. జగన్ వదిలేసినట్టేనా?

YS Jagan vs YS Sharmila news(AP political news): దివంగత నేతల పేర్లు చెప్పి.. రాజకీయాలు చేయడం భారతదేశ రాజకీయాల్లో ఓ వ్యూహం. నెహ్రూ, ఇందిరా, రాజీవ్ పేరు చెప్పి కాంగ్రెస్ రాజకీయం చేస్తోంది. ఇక ప్రాంతీయ పార్టీలు అయితే.. వ్యవస్థాపక అధ్యక్షుల పేర్లను పార్టీ కార్యక్రమాల్లో వాడుకుంటాయి. అది తప్పు అని కూడా చెప్పలేం. ఎందుకంటే.. గతంలో ఆ నేతలు చేసిన మంచి పనులను తామూ కొనసాగిస్తామని.. వారి ఆశయాల కోసం పని చేస్తామని చెప్పడం వారి ఉద్దేశ్యం. కొంతమంది ప్రత్యర్థి పార్టీలకు చెందిన దివంగత నేతల పేర్లు కూడా కూడా సందర్భానుసారంగా వాడుకుంటారు. వైసీపీ హయాంలో ఓ జిల్లాకు ఎన్టీఆర్ పేరు పెట్టారు. ఎందుకంటే.. ఎన్టీఆర్‌ను తెలుగు జాతి ఆరాధ్య దైవంగా చూస్తారు.


కాబట్టి.. ఆయన్ని గౌరవిస్తే కొత్త ఓట్ బ్యాంక్ సొంతం చేసుకోవచ్చనే వ్యూహం. ఇక.. చంద్రబాబు కూడా వైఎస్ రాజశేఖర్ రెడ్డిని పొగిడిన సందర్భాలు ఉన్నాయి. తాను మొదలు పెట్టిన అభివృద్ధిని రాజశేఖర్ రెడ్డి కొనసాగించారని సీఎం చంద్రబాబు పలు సార్లు చెప్పారు. ఇలా దివంగత నేతల గెలసీని అన్ని పార్టీలు వాడుకునే ప్రయత్నం చేస్తూ ఉంటాయి. ఏదేమైనప్పటికీ.. ఎన్టీఆర్ లెగసీ టీడీపీ, వైఎస్ రాజశేఖర్ రెడ్డి గెలసీ వైసీపీకి సొంతంగా మొన్నటి వరకూ వచ్చింది. కానీ, ఇప్పుడు పరిస్థితులు చూస్తూంటే వేగంగా మారుతున్నాయి.

వైఎస్ లెగసీపై వైసీపీ అధినేత జగన్ ఆశలు వదులుకున్నట్టు కనిపిస్తున్నాయి. వైఎస్ జయంతి ఉత్సవాల సందర్భంగా జగన్ తీరును చూస్తే వైఎస్ పేరుతో రాజకీయం చేయడం కష్టమేమో అనుకున్నట్టు తెలుస్తోంది. గతంలో రాజశేఖర్ రెడ్డి జయంతి, వర్థంతికి వైసీపీ పెద్ద హడావుడి చేసేది. ఊరూరా పెద్ద ఎత్తున సంబరాలు ఉండేవి. సొంత మీడియాలో విపరీతమైన యాడ్స్ కనిపించేవి. వైఎస్ యాడ్స్ కోసం సొంత పేపర్, ఛానెల్‌కు కోట్లు కుమ్మరించేవారు. పార్టీ తరుఫునే కాకుండా గవర్నమెంట్ యాడ్స్, చాలా నేతలు వ్యక్తిగతంగా కూడా ప్రకటనలు చేసేవారు. కానీ, ఈ సారి ఆ హడావుడి లేదు. ఇడుపులపాయలో వైఎస్ సమాధి దగ్గరకు వెళ్లి నమస్కారం చేసి జగన్ వచ్చేశారు. కొంతమంది వైసీపీ నేతలు రాజశేఖర్ రెడ్డి పేరుతో పూలు, పళ్లు, స్వీట్లు పంచితే వాటిని సొంత మీడియాలో వార్తలు రూపంలో రాసుకున్నారు. అంతకంటే పెద్ద హడావుడి లేదు.


Also Read : విద్యుత్ రంగాన్ని నాశనం చేశారు: సీఎం చంద్రబాబు

అయితే.. ప్రస్తుతం అధికారంలో లేరు కాబట్టి.. ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నాయనుకున్నా.. 2 నెలల క్రితం వరకూ అధికారంలోనే ఉన్నారు. కాబట్టి.. ఇప్పటికిప్పుడు ఆర్థికంగా వచ్చిన ఇబ్బందులు లేవు. పైగా.. గతంలో ప్రతిపక్షంలో ఉన్నపుడు కూడా వైఎస్ జయంతి, వర్థంతిని ఘనంగా జరిపేవారు. అంటే.. డబ్బులు, ఆర్థిక వనరులు కారణం కాదు. కేవలం జగన్ ఆలోచనలో వచ్చిన మార్పే అని చాలా మంది అంటున్నారు.

వైఎస్ లెగసీ కోసం కోట్లు కుమ్మరించినా ఉపయోగం లేదనే అభిప్రాయంలో జగన్ ఉన్నట్టు తెలుస్తోంది. వైఎస్ గెలసీని సొంతం చేసుకోవడానికి షర్మిల బలంగా ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్ కూడా షర్మిలకు సపోర్టు చేస్తోంది. వైసీపీ నేతలు ఇచ్చిన యాడ్స్ కంటే.. కాంగ్రెస్, షర్మిల ఇచ్చిన యాడ్స్ ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు.. కాంగ్రెస్ అధిష్టాన పెద్దలు రాహుల్ గాంధీ, సోనియా గాంధీ కూడా వైఎస్ జయంతి రోజు ప్రత్యేకంగా సందేశాలను దేశ ప్రజలకు పంపించారు. వైఎస్ పాదయాత్ర స్పూర్తితోనే భారత్ జోడో యాత్ర చేశానని రాహుల్ గాంధీ అన్నారు.

అంటే.. వీలైంత ఎక్కువగా కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి ఇమేజ్ ను వాడుకోవాలని చూస్తోంది. పరిస్థితులు కూడా కాంగ్రెస్ కే అనుకూలంగా ఉన్నాయి. తెలంగాణ కాంగ్రెస్ కూడా వైఎస్ జయంతిని ఘనంగా నిర్వహించింది. వైఎస్ అభిమానులు కాంగ్రెస్ లో చేరాలని కాంగ్రెస్ పార్టీ ఏపీ నేతలకు పిలుపునిచ్చింది. కాబట్టి ఎన్ని ప్రయత్నాలు చేసినా.. ఎన్ని కోట్లు కుమ్మరించినా రాజశేఖర్ రెడ్డి గెలసీ 100 శాతం తమకు సొంతం కాదనే భావనలో జగన్ ఉన్నారని తెలుస్తోంది. అందుకే.. ఇకపై కొత్త రాజకీయ వ్యూహాన్ని అనుసరించాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది. మరి ఏ వ్యూహంతో ముందుకు వస్తారో చూడాలి.

Related News

Shani effect to Jagan: జగన్‌ను వెంటాడుతున్న శని, పుష్కర‌కాలంపాటు..

CM Chandrababu warning: తిరుపతి లడ్డూ వివాదం, నిన్ను వదలా అంటున్న సీఎం.. అయోధ్య వరకూ

Tirumala Laddu: ఛీ, ఇంత నీచమా? ఏపీ ప్రజల సెంటిమెంట్‌పై గట్టి దెబ్బ.. వైసీపీని ఈ పాపం వెంటాడుతుందా?

Adani Foundation: ఏపీ వరద బాధితులకు అదానీ ఫౌండేషన్ భారీ విరాళం.. ఎంతనో తెలిస్తే ఆశ్చర్యపోతారు!

Tirupati Laddu: తిరుమల లడ్డూ ప్రసాదంలో గొడ్డు మాంసం? ఇదిగో ప్రూఫ్.. ల్యాబ్ టెస్ట్‌లో బయటపడింది ఇదే

Balineni Comments: జగన్ ఏరోజూ సభల్లో నా గురించి మాట్లాడలేదు.. అందుకే పార్టీని వీడా: బాలినేని

Ambati Rambabu: నాణ్యమైన మద్యం అంటే ఏంటి..? ఎంత తాగినా ఆరోగ్యం దెబ్బతినదా..? : అంబటి ఎద్దేవా

Big Stories

×