EPAPER
Kirrak Couples Episode 1

Matti kusthi : మట్టి కుస్తీ కథ ఇదే..మూవీ ఎలా ఉందో తెలుసా..?

Matti kusthi : మట్టి కుస్తీ కథ ఇదే..మూవీ ఎలా ఉందో తెలుసా..?

Matti kusthi: మట్టి కుస్తీ’ రివ్యూ
నటీనటులు: విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, శ్రీజ రవి, మునీష్ కాంత్, కరుణాస్, శత్రు తదితరులు
నిర్మాణ సంస్థలు: ఆర్ టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్
నిర్మాతలు: రవితేజ, విష్ణు విశాల్
దర్శకత్వం: చెల్లా అయ్యావు
సంగీతం: జస్టిన్ ప్రభాకరన్
సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం నాథన్
ఎడిటర్: ప్రసన్న జికె
విడుదల తేది: డిసెంబర్‌ 2, 2022


తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయం ఉన్న తమిళ హీరోల్లో విష్ణు విశాల్ ఒక‌రు. ‘అరణ్య’ చిత్రంలో కీల‌క పాత్ర‌లో న‌టించిన విష్ణు విశాల్‌.. ‘ఎఫ్ఐఆర్’ సినిమా నుంచి ‌టాలీవుడ్‌పై ఫోక‌స్ చేశారు. హీరోగా నటిస్తూనే నిర్మాతగా కూడా మారారు. మాస్ మహారాజా ర‌వితేజ‌తో క‌లిసి త‌న సినిమాల‌ను తెలుగులోకి విడుద‌ల చేస్తున్నారు. ఆ క్ర‌మంలో ఎఫ్ఐఆర్ మూవీ త‌ర్వాత రవితేజ‌తో క‌లిసి విష్ణు విశాల్ త‌మిళంలో నిర్మించిన చిత్రం ‘గట్టా కుస్తీ’ని తెలుగులో ‘మట్టి కుస్తీ’ పేరుతో విడుదల చేశారు. టైటిల్ చూసి ఇది పక్కా స్పోర్ట్స్ డ్రామాగా అయ్యుంటుంద‌ని అంద‌రూ అనుకున్నారు. అయితే ఇది పక్కా ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్ అని విష్ణు విశాల్ చెప్పడం.. ప్రమోషన్స్ కూడా భారీ స్థాయిలో చేయడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఆ ఆసక్తిని చిత్ర యూనిట్ నిలబెట్టుకుందో లేదో తెలుసుకోవాలంటే క‌థ‌లోకి వెళ‌దాం..

కథ: కేరళలోని పాలక్కడ్‌కు చెందిన కీర్తి(ఐశ్యర్య లక్ష్మీ)కి రెజ్లింగ్‌ అంటే చాలా ఇష్టం. తల్లిదండ్రులకు ఇష్టం లేకపోయినా.. బాబాయ్‌ సపోర్ట్‌తో కుస్తీ పోటీల్లో పాల్గొని రాష్ట్రస్థాయిలో ఛాంపియన్‌గా నిలుస్తుంది. అయితే ఆడపిల్ల రెజ్లర్‌ అని తెలిస్తే ఎవరూ పెళ్లి చేసుకోడానికి ముందుకు రారని ఆమె తల్లిదండ్రులు భయపడతారు. ఆటను వదిలేసి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తారు. ఈ టెన్షన్‌తో ఆమె నాన్నకు గుండెపోటు వస్తుంది. దీంతో ఫ్యామిలీ కోసం కీర్తి పెళ్లికి ఓకే చెబుతుంది. అయితే రెజ్లర్ అనే విషయం తెలిసి వచ్చే సంబంధాలు కూడా గుమ్మం దాకా వచ్చి వెళ్లిపోతాయి.


మరోవైపు ఆంధ్రప్రదేశ్‌‌లోని రామచంద్రాపురం గ్రామానికి చెందిన వీర(విష్ణు విశాల్‌) తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో మామయ్య(కరుణాస్‌) పెంచి పెద్ద చేస్తాడు. వీర పనిపాట లేకుండా తిరుగుతుంటాడు. తను పెళ్లి చేసుకునే అమ్మాయి తను చదివిన ఏడో తరగతి కంటే తక్కువ చదువుకుని ఉండాలని, అలాగే పొడవైన జడ ఉండాలని, తన చెప్పుచేతల్లో ఉండాలని కండీషన్స్‌ పెట్టుకుంటాడు వీర. జుట్టు తక్కువున్న వాళ్లందరినీ రిజెక్ట్ చేస్తుంటాడు. మరోవైపు రెజ్లర్‌ అయిన కారణంగా కీర్తిని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. వీర మామయ్య, కీర్తి బాబాయ్ ఇద్దరూ చిన్నప్పటి మిత్రులు. ఈ నేపథ్యంలో కీర్తి బాబాయ్‌కి ఓ ఐడియా వస్తుంది. కీర్తి ఏడో తరగతి వరకే చదువుకుందని, పెద్ద జడ ఉందని అబద్దం చెప్పి వీరాతో పెళ్లి చేస్తాడు. కానీ వీరాకు ఓ రోజు కీర్తి రెజ్ల‌ర్ అనే నిజం తెలుస్తుంది. అలాగే ఆమెకు పెద్ద జడలేదని, అది విగ్‌ అనే నిజం కూడా తెలుస్తుంది. ఆ తర్వాత భార్యాభర్తల మధ్య ఎలాంటి పరిస్థితులు తలెత్తాయి. భార్యతోనే కుస్తీపోటీకి రెడీ అయిన వీరకు ఎలాంటి అనుభవాలు ఎదురయ్యాయి? చివరికి వాళ్లిద్దరూ కలుస్తారా అనేది సినిమాలో చూడాల్సిందే.

విశ్లేషణ:
కుస్తీ పోటీ అనే టైటిల్ చూస్తే ఇదేదో కుస్తీ పోటీలకు సంబంధించిన సినిమా అనుకుంటారు. అందుకే హీరో విష్ణు విశాల్ ఇది కుస్తీ సినిమా కాదని.. పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ అని చెప్పి ఆడియన్స్‌ను అందుకు తగ్గట్లు ప్రిపేర్ చేశారు. హీరో అలా చేయడం నిజంగా చాలా కలిసొచ్చిందని చెప్పాలి. ఇది గ్రౌండ్‌లో జరిగే కుస్తీ కాదని, భార్యాభర్తల మధ్య జరిగే కుస్తీ అని విష్ణు విశాల్ క్లారిటీ ఇవ్వడంతో స్పోర్ట్స్ సినిమాలు చూసే ప్రేక్షకులే కాకుండా కుటుంబకథా చిత్రాలు ఇష్టపడే ప్రేక్షకులు ఈ సినిమాకు రావడానికి అవకాశం ఉంది. విష్ణు విశాల్ అండ్ టీమ్ చెప్పినట్లే సినిమా భార్యా భర్తల మధ్య కుస్తీ ఉంటుంది. ఆడ-మగ ఇద్దరూ సమానమే అనే మెసేజ్‌తో డైరెక్టర్ ఈ సినిమాను రూపొందించారు. అందుకు కామెడీని యాడ్ చేసి చెప్పిన విధానం బాగుంది. లింగ బేధం లేదని ఎంత చెప్పినా కూడా ఇప్పటికీ చాలా చోట్ల మహిళలకు సరైన గౌరవం ఉండడం లేదు. ముఖ్యంగా భార్యల విషయంలో చాలా మంది భర్తలు చులకనగా వ్యవహరిస్తారు. తన ఇష్టాలను ఆమె గౌరవించాలి కానీ.. భార్య ఇష్టాయిష్టాలతో తనకు సంబంధం లేదనే భర్తలు ఇప్పటికీ ఉన్నారు. అది తప్పని, భార్య ఇష్టాయిష్టాలను కూడా భర్తలు గౌరవించాలని చాటి చెప్పే చిత్రమే ‘మట్టి కుస్తీ’. ఓ మంచి సందేశాన్ని కామెడీ వేలో ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడు చెల్ల అయ్యావు సఫలం అయ్యారని చెప్పొచ్చు. కొత్తగా వివాహం అయిన ఆలుమగల మధ్య వచ్చే మనస్పర్థలు, గొడవల నేపథ్యంలో కథనం సాగుతుంది. ఈ నేపథ్యంతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి కానీ ఫ్యామిలీ డ్రామాకి, స్పోర్ట్స్ యాంగిల్‌ని మేళవించడం ‘మట్టి కుస్తీ’ స్పెషల్‌ అని చెప్పొచ్చు. సినిమా అంతా కామెడీ కామెడీగా సాగుతుంది.భార్య భర్తల ఇగో క్లాషెస్‌ని కామెడీగా చూపిస్తూనే ఎమోషనల్‌ యాంగిల్‌ని టచ్‌ చేశాడు దర్శకుడు. భార్యలు ఎప్పుడూ తమ చెప్పుచేతుల్లోనే ఉండాలనే భర్తల ఆలోచన తప్పనే విషయాన్ని వినోదాత్మకంగా చూపించాడు.

నటీనటుల విశ్లేషణ:
వైవిధ్యమైన కథలు ఎంచుకుంటూ హీరోగా తనకంటూ ఒక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకుంటున్నాడు విష్ణు విశాల్‌. ‘రాక్షసన్‌’ మూవీతో కోలీవుడ్‌లో భారీ విజయాన్ని అందుకున్నారు. అరణ్య చిత్రంతో తెలుగు ప్రేక్షకులను పలకరించారు. ఇప్పుడు తన కెరీర్‌లో బిగ్గెస్ట్ మూవీగా ‘మట్టి కుస్తీ’ని చేశారు. ఇందులో వీర పాత్రకి పూర్తి న్యాయం చేశారు. అల్లరి నరేష్ చేయాల్సిన పాత్రను విష్ణు విశాల్ చేశాడని కొంతమంది అంటున్నారు. అయితే ఈ పాత్ర విష్ణు విశాల్‌కు బాగా సెట్ అయిందని చెప్పొచ్చు. కొంత వీరత్వం, మరికొంత అమాయకత్వం కలగలిపిన వీర పాత్రలో విష్ణు విశాల్ బాగా సెట్ అయ్యారు. తనదైన కామెడీతో నవ్వించారు. ఇక కీర్తి పాత్ర కోసం ఐశ్యర్యలక్ష్మీ బాగా కష్టపడి నటించింది. కుస్తీ ఆడే అమ్మాయిగా కనిపిస్తూనే.. చీరకట్టులో అందంగా కూడా కనిపించి ఆకట్టుకుంది. వీర మామయ్యగా కరుణాస్‌, కీర్తి బాబాయ్‌గా మునీష్‌ కాంత్‌తో పాటు మిగిలిన నటీనటులు తమ పాత్రల మేరకు నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం బాగుంది. పాటలు తమిళ నెటివిటీకి తగ్గట్లుగా ఉంటాయి. రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్ర‌ఫీ బాగుంది. ఎడిటింగ్‌ పర్వాలేదు. ఆర్‌టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. రవితేజ తన సినిమా కంటే ఈ సినిమాకు బాగా ప్రమోషన్స్ చేసి మంచి హైప్ తెచ్చారు.

నవ దంపతుల మధ్య కుస్తీని కామెడీతో చూపించిన ‘మట్టి కుస్తీ’

రేటింగ్: 2.75/5

-బిల్లా గంగాధర్

Tags

Related News

President Draupadi Murmu : రేపు హైదరాబాద్‌కు రాష్ట్రపతి ముర్ము… ఆ మార్గాల్లో వెళ్తే అంతే సంగతులు ?

Pawan Kalyan: పవన్ కళ్యాణ్ జోలికొచ్చి బుక్కైన నానీలు..

Russia Vs Ukraine War: దూసుకొస్తున్న రష్యా మిస్సైల్? వణికిపోతున్న ఉక్రెయిన్

YS Jagan vs Botsa Satyanarayana: వైసీపీ నేతల పార్టీ మార్పు వెనుక బొత్స వ్యూహం ఉందా?

Irregularities: జూబ్లీహిల్స్‌లో బయటపడ్డ మరో భారీ బాగోతం.. 36 ఏండ్ల నుంచి..

Alla Nani: వైసీపీ రాజీనామా నేతలకు జనసేన డోర్లు తెరుచుకుంటాయా ? ఆళ్ల నాని పరిస్థితి ఏంటి ?

Hydra Demolitions: కూల్చివేతలపై భిన్న స్వరాలు.. కేసీఆర్ అలా.. కేటీఆర్ ఇలా..

Big Stories

×