EPAPER

Ratna Bhandar: దశాబ్దాల తర్వాత తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం, సంపద లెక్కింపు ఎప్పుడంటే..

Ratna Bhandar: దశాబ్దాల తర్వాత తెరుచుకోనున్న పూరీ రత్న భాండాగారం, సంపద లెక్కింపు ఎప్పుడంటే..

Puri Jagannath Temple’s Ratna Bhandar : ఒడిస్సాలోని పూరీ జగన్నాథుడి ఆలయంలో ఉన్న రత్న భాండాగారం రహస్య గది తెరుచుకోనుంది. రత్న భాండాగారం రహస్య గదిని జూలై 14వ తేదీన  తెరవాలని ఒడిశా ప్రభుత్వం జస్టిస్ బిశ్వనాథ్ రథ్ అధ్యక్షతన ఏర్పాటైన ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు చేయాలని నిర్ణయం తీసుకుంది. దీంతో రత్న భాండాగారాన్ని తెరిచి స్వామి సంపద లెక్కింపు సహా భాండాగారం మరమ్మతులు పూర్తి చేయనున్నారు. డూప్లికేట్ తాళం పని చేయకపోతే , తాళాన్ని పగుల గొట్టి రత్న భాండాగారం రహస్య గదిని తెరవాలని నిర్ణయించారు.


46 ఏళ్ల తర్వాత:

జగన్నాథుడి ఆలయంలో ఉన్న రత్న భాండాగారం రహస్య గది జూలై 14 వ తేదీన తెరుచుకోనుంది. 46 ఏళ్ల క్రితం 1978లో చివరి సారిగా రత్న భాండాగారాన్ని తెరిచారు. మూసి ఉన్న రహస్య గదిని మళ్లీ జూలై 14న తెరవాలని ఒడిశా ప్రభుత్వానికి సిఫారసు చేయాలని ఉన్నత స్థాయి కమిటీ నిర్ణయించింది. పూరీలో జరిగిన ఈ కమిటీ సమావేశంలో ఈ మేరకు ఏకగ్రీవంగా నిర్ణయం తీసుకున్నారు. రత్న భండాగారం రహస్య గది డూప్లికేట్ తాళాపు చెవి, కమిటీకి అప్పగించాలని శ్రీ జగన్నాథ్ ఆలయ యంత్రాంగం ప్రధాన అధికారిని కమిటీ ఆదేశించింది. డూప్లికేట్ తాళపు చేవి పనిచేయకపోతే తాళాన్ని పగలకొట్టి రత్న భాండాగారంలో ఉన్న రహస్య గది తెరవాలని సూచించింది.


పూరీ జగన్నాథుడి రత్న భాండాగారం తెరిపించి స్వామి సంపద లెక్కింపు, భాండాగారం మరమ్మతులు పర్యవేక్షించడానికి ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. రత్న భాండాగారం రహస్య తాళంచెవి ఇది వరకు కనిపించకపోయిన నేపథ్యంలో తాళం చెవి పూరీ కలెక్టరేట్‌లో ఖజానాలో ఉందని ఆక్షేత్ర పాలనాధికారి తెలిపారు.

దశాబ్దాలుగా రహస్యగదిలో నిక్షిప్తమై ఉన్న ఆభరణాలు వజ్రాలు, కిరీటాలు, కెంపులు, పచ్చలు, పుష్యరాగాల బరువు నాణ్యతను ప్రస్తుత నిపుణ సంఘం అంచనా వేయలేదని జస్టిస్ బిశ్వనాథ్ తెలిపారు. ఈ సంపద పరిశీలించడానికి మరో నిపుణుల సంఘం అవసరం ఉందని.. దానిని నియమించడానికి మార్గదర్శకాలు జారీ చేసి చెబుతామని అన్నారు. సంఘం ఏర్పాటు చేసే బాధ్యత క్షేత్ర పాలకవర్గంపైనే ఉంటుందని తెలిపారు.

పటిష్ట భద్రత మధ్య సంపద లెక్కింపు:
రథయాత్ర సమయంలోనే భాండాగారం తెరిపిస్తామన్నా.. జస్టిస్ సంపద లెక్కింపు మరమ్మత్తులు ఒకే చోట సాధ్యం కాదని అన్నారు. ఆభరణాలు మరో చోటకు తరలించి సీసీ కెమెరాలు, ప్రత్యేక పోలీస్ బలగాల సమక్షంలో లెక్కింపు నాణ్యత పరిశీలన జరుగుతుందన్నారు. దీనికోసం మరిన్ని మార్గదర్శకాలు ప్రకటిస్తామని తెలిపారు. గట్టి భద్రత మధ్య భాండాగారం వెలుపల లెక్కింపు, మరోవైపు భాండాగారం మరమ్మతులు జరుగుతాయి.. అందుకు ఎంత వ్యవధి పడుతుందన్నది కచ్చితంగా చెప్పలేం అని అన్నారు.

Also Read: అంబానీయా, మజాకా.. స్టే చేయడానికి హోటల్‌ రెంట్‌ ఎంతంటే..?

1978 సంవత్సరంలో జరిగిన లెక్కింపు 70 రోజుల వ్యవధి పట్టిందని, కస్టమ్స్ ఆధునిక పరిజ్ఞానం అందుబాటులో ఉన్నందు వల్ల ప్రస్తుతం సంపద లెక్కింపు త్వరగా జరుగుతున్నాయన ఆలోచన ఉందని తెలిపారు. దీనివల్ల జగన్నాథుని సేవలు, భక్తుల దర్శనాలకు అంతరాయం కలగకుండా చూస్తామని తెలిపారు

Tags

Related News

Star Health Data: స్టార్ హెల్త్ కస్టమర్లకు షాక్.. డేటా మొత్తం ఆ యాప్ లో అమ్మకానికి ?

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Big Stories

×