EPAPER

Ambani wedding: అంబానీయా, మజాకా.. స్టే చేయడానికి హోటల్‌ రెంట్‌ ఎంతంటే..?

Ambani wedding: అంబానీయా, మజాకా.. స్టే చేయడానికి హోటల్‌ రెంట్‌ ఎంతంటే..?

Hotel Rents In Mumbai Have Gone Up Hugely On The Occasion Of Anant Ambani Wedding: ప్రపంచ కుబేరుల్లో ఒకరైన భారత్‌కి చెందిన అత్యంత సంపన్న కుటుంబం ముఖేశ్ అంబానీ ఫ్యామిలీ. మరి అంత సంపదను ఉంచుకొని తన కొడుకు పెళ్లి అంటే ఎలా ఉండాలి. ఆకాశమంతా పందిరి, ఛామ్ ఛామ్‌ అంటూ పెళ్లి సాగాలి కదా. అచ్చం అలాగే ప్రపంచ దేశాల అతిరథ మహారథులు ఈ పెళ్లి వేడుకలో పాల్గొని సందడి చేయనున్నారు. అంబానీ కొడుకు పెళ్లికి అంత రెడీ అయిపోయింది. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ ఈనెల 12న అందరి పెద్దల సమక్షంలో పచ్చని పందిట్లో ఒకటి కాబోతున్నారు. ఈ ఏడాది దేశంలోనే జరిగే అతిపెద్ధ పెళ్లికి ముంబై వేదికగా ముస్తాబవుతోంది.


ఈ వివాహానికి ప్రపంచంలోని ప్రముఖులు, బాలీవుడ్, హాలీవుడ్‌ తారలు, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు. ముంబయికి పెళ్లిళ్లకు పెద్దలు రావడంతో హోటళ్లకు బాగా డిమాండ్ పెరిగింది. ముంబై నగరంలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ బీకేసీలోని 5 స్టార్ హోటళ్లన్నీ బుకింగ్‌ క్లోజ్‌డ్‌ బోర్డ్‌లతో దర్శనమిస్తున్నాయి. అంతేకాదు వాటి ధర సైతం ఒక్క రాత్రి స్టే చేయడానికి ఏకంగా రూ.లక్షకు పెంచేశారు హోటల్ నిర్వాహకులు. అనంత్ అంబానీ, రాధిక మర్చంట్ వివాహం జులై 12న ముంబైలోని బీకేసీలోని తమ సొంత ప్రాడక్ట్‌ జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌లో అంగరంగ వైభవంగా ఘనంగా జరగనుంది. దీంతో నైట్‌ స్టే చేయడానికి అద్దె రూ.13 వేలు ఉన్న హోటళ్ల ధరలు అమాంతం పెంచేశారు. ఇప్పుడు వీటి విలువ ఏకంగా రూ.91వేల 350 కు పెంచేశాయి వీటిని నిర్వహించే హోటల్ నిర్వాహకులు. ప్రస్తుతం అంబానీ పెళ్లికి వచ్చే వారు ఎక్కడ బస చేస్తారనే దానిపై ఎలాంటి అఫీషియల్ ఇన్‌ఫర్మేషన్‌ అయితే ఇప్పటి వరకు బయటకు రాలేదు.

Also Read:14 ఉత్పత్తుల అమ్మకాలు నిలిపివేశాం: పతాంజలి సంస్థ


అయితే బీకేసీ సమీపంలోని ప్రాంతాల్లోని హోటల్ రెంట్లు ఆకాశానికి పెరుగుతున్నాయి. అంబానీ ఫ్యామిలీకి సంబంధించిన ఈ వెడ్డింగ్‌ ప్రోగ్రాం సెలబ్రేషన్స్ ఈనెల 12 నుంచి 14 వరకు అంగరంగ వైభవంగా ఆకాశమంతా పందిరితో దేశంలోని ప్రముఖుల మధ్య అందరూ లైఫ్‌లాంగ్ గుర్తుపెట్టుకునేలా ఈ వేడుకలు జరగనున్నాయి. ఈ వెడ్డింగ్ కారణంగా ముంబై నగరంలోని పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీ కూడా జారీ చేశారు. ఈనెల 12 నుంచి 15 వరకు జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్‌కు వెళ్లే రహదారులను మధ్యాహ్నం 1 నుండి అర్ధరాత్రి వరకు మూసివేయనున్నారు పోలీసులు. జులై 10 నుంచి 14 వరకు ఎలాంటి అద్దె రూంలు ఈ రోజుల్లో అందుబాటులో ఉండవని హోటళ్ల వెబ్‌సైట్లలో కీలక సమాచారం అందించారు.

వీటిలో ట్రైడెంట్ బీకేసీ, సాషీటెల్‌ బీకేసీ లాంటివి ఉన్నాయి. అయితే ఇందులో మరో హైలైట్‌ ఏంటంటే తాజ్ బాంద్రా, సెయింట్ రెజిస్, గ్రాండ్ హయత్, తాజ్ శాంటా క్రజ్ వంటి 5 స్టార్ హోటళ్లలో గదులు ఇప్పటికీ అందుబాటులో ఉన్నాయి. అటువంటి పరిస్థితిలో కంపెనీలు తమ ఉద్యోగులను ఇంటి నుంచి పనిచేయమని బికెసిలో పనిచేస్తున్న ఉద్యోగులు చెప్పారు. ఇక ఇది చూసిన నెటిజన్లు వావ్ జియో రేట్లతో పాటుగా అందుబాటులో ఉన్న హోటల్‌ రేట్లను కూడా ఆకాశానికి పెంచేస్తున్నారంటూ నెటిజన్లు రకరకాల కామెంట్లతో తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ఇందులోని వారంతా స్టే చేయడానికి అంబానీ ఇల్లు సరిపోదా అంటూ కూడా ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.

Tags

Related News

Jammu Kashmir Elections: జమ్ము ఎన్నికల వేళ.. పాక్ మంత్రి కీలక వ్యాఖ్యలు

Cash for Vote Scam: ఓటుకు నోటు కేసులో సీఎం రేవంత్ రెడ్డికి భారీ ఊరట

MLA Bojju Patel: రవ్‌నీత్ సింగ్ తలను తీసుకొస్తే.. నా ఆస్తి రాసిస్తా : కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలనం

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Big Stories

×