EPAPER

Viral news: ముంచెత్తిన వరద, వరదలో చిక్కుకున్న టూరిస్ట్‌లు

Viral news: ముంచెత్తిన వరద, వరదలో చిక్కుకున్న టూరిస్ట్‌లు

Tourists Stuck At Raigad Fort Due To Sudden Gush Of Water Heavy Rain: మహారాష్ట్రలో భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. ఆదివారం స్టార్ట్‌ అయినా ఈ వర్షం రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావంతో పక్కనున్న దేశ ఆర్థిక రాజధాని ముంబైలో సైతం భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఏకంగా రికార్డు స్థాయిలో 300 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో అనేక ప్రాంతాలు నీట మునిగాయి. ప్రధాన రహదారులన్నీ నదులను తలపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కార్లు, బైక్‌లు నీట మునిగాయి. దీంతో స్థానిక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు.


రాష్ట్రంలోని ప్రముఖ టూరిస్ట్‌ ప్రాంతం రాయ్‌ఘడ్ ఫోర్ట్‌ను సైతం ఈ వరదనీరు చుట్టిముట్టింది. ఆదివారం సెలవు దినం కావడంతో ఫోర్ట్‌కు భారీ సంఖ్యలో పర్యాటకులు చేరుకున్నారు. వాతావరణం చల్లబడటంతో ఫోర్ట్‌కు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో టూరిస్ట్‌లు ఫోర్ట్‌ సందర్శనకు వచ్చారు. మధ్యాహ్నం 3:30 గంటల నుంచి 4 గంటల మధ్యలో అక్కడ భారీ వర్షం కురిసింది. ఫోర్ట్‌ ప్రాంతాల్లో కుండపోతం వర్షం కారణంగా ఒక్కసారిగా వరద ఆ ప్రాంతాన్నంత వరదలతో ముంచెత్తింది. దీంతో సుమారు 30 మందికి పైగా పర్యాటకులు అక్కడ చిక్కుకుపోయారు. వారంతా ఎటుపోలేని పరిస్థితి నెలకొంది. అంతేకాకుండా సాయం కోసం టూరిస్ట్‌లు ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని బిక్కుబిక్కుమంటూ భయభ్రాంతులకు గురవుతున్నారు. సాయం కోసం ఎదురుచూస్తున్నారు.

Also Read: రిలేషన్‌షిప్‌లో ఉన్నానంటూ షాక్‌ ఇచ్చిన మందాన


అంతేకాకుండా వరదలో చిక్కుకున్న వారంతా ఎక్కడికి పోలేని పరిస్థితి నెలకొంది. టూరిస్ట్‌లు అందరూ భయంతో పరుగులు తీస్తున్నారు. ఎక్కడికి వెళ్లాలన్న వెళ్లలేని పరిస్థితి. ప్రస్తుతం వీరి దృశ్యాలకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది. కొండపై నుంచి ఉధృతంగా కిందకు ప్రవహిస్తున్న జలపాతాల వరద ఉధృతి మధ్య టూరిస్ట్‌లు అక్కడున్న రెయిలింగ్‌లు, మెట్లను పట్టుకుని వేలాడుతూ కనిపించిన దృశ్యాలు మనం వీడియోలో స్పష్టంగా మనకు కనిపిస్తోంది.

Related News

Uttarakhand Train: రైలు ప్రమాదానికి భారీ కుట్ర.. పట్టాలపై 6 మీటర్ల ఇనుప రాడ్

Mahalakshmi Scheme: కాంగ్రెస్ హామీని కాపీ కొట్టిన బీజేపీ

Rahul Gandhi: ఖర్గే, నడ్డాల లేఖల యుద్ధం

Toxic Workplace: వర్క్ ప్రెజర్‌ తట్టుకోలేక ప్రైవేట్ ఉద్యోగిని మృతి.. రంగంలోకి దిగిన సర్కారు

Delhi CM: ఢిల్లీ సీఎంగా అతిశీ ప్రమాణానికి డేట్ ఫిక్స్

Rahul Gandhi Vs Ravneet Bittu: జాతీయ పార్టీల అధినేతల మధ్య లేఖల యుద్ధం..

Monkeypox Case in India: భారత్‌ను వణికిస్తున్న మంకీపాక్స్.. రెండో కేసు నమోదు.

Big Stories

×