EPAPER

KCR Tension on Kavitha Bail : తీహార్ జైలు నుంచి కవిత బయటికొస్తుందా ? ఢిల్లీలో వాళ్లిద్దరూ ఏం చేస్తున్నారు ?

KCR Tension on Kavitha Bail : తీహార్ జైలు నుంచి కవిత బయటికొస్తుందా ? ఢిల్లీలో వాళ్లిద్దరూ ఏం చేస్తున్నారు ?

KCR Tension on Kavitha Bail : 115 రోజులైంది. లిక్కర్‌ స్కామ్‌ కేసులో ఎమ్మెల్సీ, మాజీ సీఎం కేసీఆర్ కూతురు కవిత అరెస్టై. బెయిల్ పిటిషన్లు, కస్టడీ పిటిషన్లు.. విక్టరీ సింబల్స్‌, మీడియాకు లేఖలు.. ఇలా జరిగిపోతూనే ఉన్నాయి. కవిత తీహార్‌, రౌజ్‌ అవెన్యూ కోర్టు మధ్య చక్కర్లు కొడుతూనే ఉన్నారు. ఓ వైపు కూతురి టెన్షన్.. మరోవైపు తండ్రి మనోవేదన. అధికారం కోల్పోయినా.. కొత్త ప్రభుత్వాలు ఫామ్ అయినా కూతురు మాత్రం జైలు నుంచి రాలేదు. అసలు కవిత బయటకొస్తుందా..? లేదా..? నాలుగు రోజులుగా కేటీఆర్, హరీష్‌రావు ఢిల్లీలో ఏం చేస్తున్నారు..?


కల్వకుంట్ల కవిత లిక్కర్ స్కాం కేసులో అరెస్టై 115 రోజులైంది. ఇప్పటి వరకు భర్త అనిల్ కుమార్, అన్న కేటీఆర్, హరీష్ రావు సహా అనేకమంది కుటుంబ సభ్యులు.. కవితను కలిసేందుకు ఢిల్లీకి వెళ్లారు. కానీ కేసీఆర్ మాత్రం ఒక్కసారి కూడా వెళ్లలేదు.. కానీ కూతురు కోసం విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే ఆమె జైల్లో ఉండి వంద రోజులు దాటి 15 రోజులైంది. దీంతో జైల్లో మగ్గిపోవాల్సి రావడంతో కవిత ఉక్కిరిబిక్కిరవుతున్నట్టు తెలుస్తోంది. కుటుంబ సభ్యుల తీరుపైనా ఆమె ఆగ్రహంతో ఉన్నారట. ఎవరూ తనను పట్టించుకోవడం లేదని కోపంతో ఉన్నారట. అంతేగా మరి.. మొన్నటి వరకు.. ఎన్నికలు, ఆ తర్వాత పరిణామాలతో ఇక్కడి బీఆర్ఎస్ హడావుడిగా ఉంది. కేటీఆర్ కవిత వంక చూసింది లేదు. తీరా అన్ని పనులు ఇక్కడ చక్కబెట్టుకోని ఢిల్లీ పయనమయ్యారు. ఓ రెండు, మూడు సార్లు కవితను చూశారు కేటీఆర్, హరీష్ రావు. ఇప్పుడిక కవిత బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

Also Read : ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో.. అప్రూవర్ గా కవిత?


నిజానికి 115 రోజులుగా పైగా కవిత జైల్లో ఉన్నారు. ఇన్ని రోజులు జైలు జీవితం గడపడంతో కవిత ఫ్రస్ట్రేషన్‌లో ఉన్నట్టు సమాచారం. అందుకే ఆమెను ఎంత తొందరగా వీలైతే.. అంత త్వరగా బయటికి తీసుకురావాలని చూస్తున్నారు. అందుకే లాయర్లతో మాట్లాడేందుకు ఢిల్లీ పయనమైనట్టు పైకి చెబుతున్నారు. కానీ లోలోపల కమలం నేతలతో బేరసరాలకు వస్తున్నట్లు సైతం టాక్ వినిపిస్తోంది. కానీ ఇన్నిసార్లు కోర్టు చుట్టూ తిరిగిన కవిత బయటకు రాలేదు. పైగా ఓ వైపు ఈడీ కవితకు బెయిల్ రాకుండా గట్టిగానే ప్రయత్నిస్తోంది. ఇటువైపు హరీష్ రావు, కేటీఆర్ ప్రయత్నాలు లాయర్ల కోసమే అంటే.. కేజ్రీవాల్ కే రాని బెయిల్ కవితకు కష్టమే అన్న వాదన వినిపిస్తోంది.

సరే వీరిద్దరి ప్రయత్నాలు కాస్త పక్కకు పెడితే.. కూతురి కోసం తండ్రి వర్రీ అవుతున్నారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ ఇప్పటికిప్పుడు తెరపైకి వచ్చింది కాదు. ఎన్నో ఏళ్లుగా నడుస్తున్న పంచాయితీ. కానీ అప్పుడు, ఇప్పుడు .. అంటే సీఎంగా ఉన్నప్పుడూ.. మాజీగా మారాక కూడా దీనిపై కేసీఆర్ స్పందించలేదు. కానీ లోలోపల కూతురు కోసం టెన్షన్ పడుతూనే ఉన్నారు. ఎన్నికల సమయంలో దాదాపు బహిరంగసభలు నిర్వహించారు కేసీఆర్. కానీ పల్లెత్తు మాట కూడా ఈ టాపిక్‌పై మాట్లాడలేదు. కనీసం బీజేపీ కక్ష పూరితంగా తన కూతురును కేసులో ఇరికించింది. అనే డైలాగ్‌ కూడా ఆయన నోటి నుంచి రాలేదు. నిజానికి ఈ అంశాన్ని తన పొలిటికల్ మైలేజ్‌కు వాడుకోవచ్చు.. కానీ అలా జరగలేదు. ఇప్పుడేమో ఏకంగా అరెస్ట్ చేసి జైల్లో వేసింది ఈడీ.. ఇప్పుడు కనీసం ఢిల్లీకి వెళ్లి పరామర్శించలేదు.

Also Read : తీహార్ జైలుకే కవిత పరిమితం.. 25 వరకూ జ్యుడీషియల్ కస్టడీ పొడిగింపు

అయితే దీనికి గల కారణాలు అనేకం కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్‌ సర్కిల్స్‌లో అయితే ఓ ప్రచారం జోరుగా జరుగుతోంది. కవిత ఇలాంటి స్కామ్‌కు తెరలేపారన్న విషయం చాలా ఆలస్యంగా కేసీఆర్‌కు తెలిసిందన్న టాక్ వినిపిస్తోంది. సంతోష్‌రావు, కవిత డైరెక్షన్‌లోనే ఈ దందా కొనసాగినట్టు కథలు వినిపిస్తున్నాయి. అందుకే కేసీఆర్ కవితపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్టు ఎన్నికల ముందు ప్రచారం జరిగింది. మన తెలుగువారు మాములుగానే మహిళలు వ్యాపారాలు చేయడాన్ని డైజెస్ట్ చేసుకోలేరు. అలాంటిది కవిత ఇలాంటి లిక్కర్ దందాలో దిగడాన్ని కేసీఆర్ అస్సలు ఊహించలేదని టాక్. మేము ఈ విషయాలను కన్ఫర్మ్ చేయడం లేదు. జస్ట్‌ జరుగుతున్న ప్రచారాన్ని మీ ముందు పెడుతున్నాం అంతే. ఈ కారణంగానే కేసీఆర్ ఈ అంశంపై మౌనాన్ని పాటిస్తున్న కూతురుపై టెన్షన్ పడుతున్నారు అనేది క్లియర్.

ఈడీ కావొచ్చు.. సీబీఐ కావొచ్చు.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కింగ్‌పిన్ కవితే అంటున్నాయి. ఆధారాలు చూపిస్తున్నాయి. ఈ విషయాలను కోర్టు బలంగా నమ్ముతుంది కాబట్టే ఆమెకు బెయిల్‌ కూడా రావడం లేదు. ఈ టైంలో లాయర్లతో ఇది అయ్యే పనేనా అనే టాక్ నడుస్తోంది. మరీ బెయిల్ వస్తుందని కేటీఆర్ అంత ధీమాగా ఎలా ఉన్నారు..? అంటే వీరిద్దరు ఇప్పుడు కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కాళ్ల బేరానికి వచ్చినట్టు తెలుస్తోంది. కవితను ఎలాగైనా బయటికి తీసుకొచ్చేందుకు బీజేపీతో మంతనాలు జరుపుతున్నట్టు తెలుస్తోంది. బీజేపీ అగ్రనాయకత్వంతో లేదా వారి అనుచరులతో భేటీ అయ్యేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే ఢిల్లీలో మకాం వేసినట్టు హస్తినలో ప్రస్తుతం టాక్ వినిపిస్తోంది. బట్ మ్యాటర్ ఏదైనా లోపల కవిత టెన్షన్.. ఢిల్లీలో బ్రదర్ బెయిల్ టెన్షన్.. ఫైనల్ గా పిల్లల కోసం కేసీఆర్ మనోవేదన కత్తి మీద సాములా నడుస్తోంది వ్యవహారం.

Tags

Related News

Ys jagan vs Balineni: బాంబ్ పేల్చిన బాలినేని.. జగన్ పతనం ఖాయం

Israel Hezbollah War: యుద్ధంలో నయా వెపన్.. ఇక ఊచకోతే

YCP Leaders to Join in Janasena : గేట్లు తెరిచిన పవన్.. వైసీపీ ఖాళీ?

Rushikonda Palace: రుషికొండ ప్యాలెస్.. అధికారులు దాస్తున్న నిజాలు

Lebanon Pager Explosions: వామ్మో ఇలా కూడా చంపొచ్చా..పేజర్ బాంబ్స్!

YS Jagan vs Anil Kumar: అనిల్‌కు జగన్ మాస్టర్ స్ట్రోక్.. ఈ జిల్లాలో సీటు గల్లంతైనట్లేనా?

Bigg Boss 8 Telugu : మొన్నటిదాకా గుడ్డు.. నేడు హగ్ లు.. ఈ టచింగ్ గొడవ ఏంటి మహా ప్రభో..

Big Stories

×