EPAPER

International:నెపోలియన్ గన్స్ వేలం..అత్యధిక ధరకు విక్రయం

International:నెపోలియన్ గన్స్ వేలం..అత్యధిక ధరకు విక్రయం

Napoleon’s ornate flintlock pistols sell for $1.83 million


ప్రపంచ చరిత్రలోనే ఫ్రెంచ్ దేశంపై తనదైన ముద్ర వేసి గుర్తింపు తెచ్చుకున్న నేత నెపోలియన్. ఆయన అసలు పేరు నెపోలియన్ బోనాపార్టే. ఫ్రెంచ్ ఏకీకరణకు నెపోలియన్ చేసిన కృషి అనిర్వచనీయం అంటారు. 19వ శతాబ్ది ఫ్రెంచ్ చక్రవర్తి మిలటరీ నాయకుడు కూడా. ముఖ్యంగా అత్యున్నత సైనిక కమాండర్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పటికీ నెపోలియన్ అనుసరించిన యుద్ధ వ్యూహాలను ప్రపంచ స్థాయిలో పాఠశాలలలో పాఠ్యాంశాలుగా ఉన్నాయంటే ఆయన గొప్పతనం ఏమిటో తెలుస్తుంది.

నెపోలియన్ గన్స్ వేలం


అంతటి ప్రపంచ ఖ్యాతి కలిగిన ఫ్రెంచి యోధుడు సైతం ఒకానొకప్పుడు జీవితం పైన విరక్తితో ఆత్మహత్య చేసుకోవాలని భావించాడు. అయితే ఆయన ఆత్మహత్య చేసుకోవాలని అనుకున్న రెండు గన్స్ పై ఇటీవల ఒసేనాట్ ఆక్షన్ అనే ఓ సంస్థ నిర్వహించింది. నెపోలియన్ ఆత్మహత్య చేసుకోవడం కోసం ఉపయోగించిన రెండు గన్లూ వేలం వేయగా 1.69 మిలియన్ యూరోలకు అమ్ముడు పోయాయని ఒసేనాట్ ఆక్షన్ తెలిపింది. అయితే ఈ కన్నులు కొనుగోలు చేసిన వ్యక్తుల పేర్లు మాత్రం బయటపెట్టలేదు. ప్యారిస్ లోని ఫాంటైస్ బ్లూస్ లో ఈ విలం నిర్వహణ జరిపించడం విశేషం. ఫ్రాన్స్ దేశం మాత్రం వేలం నిర్వహణకు రెండు రోజుల ముందు నెపోలియన్ గన్స్ ను దేశ సంపదగా ప్రకటించడం గమనార్హం. ఇందుకు సంబంధించి ఆ దేశ కల్చరల్ మినిస్ట్రీ శాఖ ఆధ్వర్యంలో నేషనల్ కమిషన్ తమ నిర్ణయం ప్రకటించింది. ఈ గన్నులు జాతీయ సంపద అయినందున ఏ ఒక్కరూ వీటిని కొనకూడదని ప్రకటన జారీ చేసింది. అయితే ఇప్పడు వీటిని కొనుగోలు చేసిన వ్యక్తులు మళ్లీ తమ నుంచి ప్రభుత్వం ఎక్కడ స్వాధీనం చేసుకుంటుందో అని ఆందోళన చెందుతున్నారు.

వెరైటీ నిబంధనలు

ఫ్రాన్స్ దేశంలో నిబంధనలు చూస్తే ఆశ్చర్యం కలగక మానదు. ఎందుకంటే కొనుగోలు చేసిన వ్యక్తుల నుంచి 30 నెలల వ్యవధి లోగా తిరిగి ఫ్రాన్స్ ప్రభుత్వం కొనుగోలు చేయవచ్చు. అయితే తాము కొనుగోలు ఆఫర్ ప్రకటించాల్సి ఉంటుంది. కొనుగోలు చేసిన వ్యక్తులకు ఆఫర్ ను తిరస్కరించే హక్కు కూడా ఉంటుంది. దేశ సంపదగా భావించే ఏ వస్తువునైనా అక్కడి ఫ్రాన్స్ ప్రభుత్వం తాత్కాలికంగా మాత్రమే తమ వద్ద ఉంచుకోవచ్చు. తర్వాత వాటికి తప్పనిసరిగా రిటర్న్ ఇచ్చేయాల్సి ఉంటుందని ఒసేనాట్ ఆక్షన్ సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు.

Tags

Related News

Zimbabwe Elephants: 200 ఏనుగులను వధించేందుకు ప్రభుత్వం అనుమతి.. ప్రజల ఆకలి తీర్చేందుకేనా?!

Lebanon Pager Blasts: లెబనాన్‌లో పేజర్ పేలుళ్లు.. 12 మంది మృతి.. 2800 మందికి గాయాలు

Eswatini king Wife Zuma: 56 ఏళ్ల రాజుకు 16వ భార్యగా 21ఏళ్ల సుందరి.. ‘రాజకీయం కాదు ప్రేమే కారణం’!

Trump: రెచ్చగొట్టే వ్యాఖ్యల ఫలితమే ఇది.. కమలా హ్యారిస్ పై ట్రంప్ కామెంట్స్

Haiti fuel tanker: హైతీలో ఘోర ప్రమాదం..పెట్రోల్ ట్యాంకర్ పేలుడులో 25 మంది మృతి

Donald Trump: ట్రంప్ పై మరోసారి కాల్పులు.. పెద్ద ప్రమాదం తప్పింది

Myanmar Floods: భారీ వరదలు.. 74 మంది మృతి, 89 మంది గల్లంతు

Big Stories

×