EPAPER

Mercury in Ashlesha : ఆశ్లేష నక్షత్రంలోకి బుధుడు.. నేటి నుంచి ఈ రాశులవారికి అన్నీ శుభాలే

Mercury in Ashlesha : ఆశ్లేష నక్షత్రంలోకి బుధుడు.. నేటి నుంచి ఈ రాశులవారికి అన్నీ శుభాలే

Mercury in Ashlesha : నేటి నుంచి బుధుడు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశిస్తున్నాడు. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం చూస్తే.. బుధుడు తెలివితేటలు, వివేకం, కమ్యూనికేషన్, మంచి చర్చలతో సంబంధాన్ని కలిగి ఉంటాడు. ఈ రోజు మధ్యాహ్నం 12.29 గంటలకు బుధుడు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించనున్నాడు. జూలై 19వ తేదీ వరకూ బుధుడు ఈ నక్షత్రంలోనే సంచరించనున్నాడు. ఆశ్లేష నక్షత్రాన్ని పాలించే బుధుడు.. ఆ నక్షత్రంలోకే ప్రవేశించడం శుభప్రదంగా ఉండనుంది. ముఖ్యంగా 4 రాశులవారి జీవితాల్లో అన్నీ శుభాలే జరగనున్నాయి. ప్రేమ, వ్యాపారాల్లో విజయాలు అందుకుంటారు. సమాజంలో కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. సుఖంగా, విలాసవంతంగా జీవిస్తారు.


మేషరాశి

బుధుడు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించడంతో.. ఈ రాశివారిని అదృష్టం వరిస్తుంది. ఉద్యోగం, వ్యాపారంలో అద్భుతమైన విజయాలను పొందుతారు. విద్యార్థులు సానుకూల ఫలితాలు పొందుతారు. ధనలాభం ఉంటుంది. పూర్వీకుల ఆస్తి ద్వారా ఆర్థిక లాభం పొందుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. సంపద, సంతోషం పెరుగుతాయి.


సింహరాశి

బుధుడు నక్షత్రం మారుతుండటం.. ఈ రాశివారికి అన్నింటా విజయాలను అందిస్తుంది. ప్రేమ, ఆప్యాయతలు పెరుగుతాయి. మీ జీవిత భాగస్వామితో బంధం బలపడుతుంది. జీవితంలో గొప్ప విజయాన్ని అందుకుంటారు. శారీరక సౌఖ్యం ఉంటుంది. వ్యక్తిత్వం బాగుంటుంది. ఉద్యోగులు ప్రమోషన్లు లేదా ఇంక్రిమెంట్లను పొందుతారు. వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. ఒంటరిగా ఉన్నవారి జీవితాల్లోకి ప్రత్యేక వ్యక్తులు వస్తారు.

Also Read : పుష్య నక్షత్రంలోకి శుక్రుడు.. ఈ 3 రాశులపై లక్ష్మీదేవి అనుగ్రహం

తులారాశి

ఈ రాశివారు ఆశించిన ఫలితాలను పొందుతారు. సమాజంలో ఆదరణ లభిస్తుంది. మతపరమైన పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఆధ్యాత్మికత ఉంటుంది. ఇంట్లోనే శుభకార్యాలను నిర్వహించుకోవచ్చు. పెద్దలకు నచ్చిన వారితో వివాహాలు నిశ్చయమవుతాయి. చేపట్టిన ప్రతి పనిలో విజయం పొందుతారు. ఒత్తిడిని కాస్త తగ్గించుకోవాలి. మీ మనసు ఆనందంగా ఉంటుంది. సంతోషకరమైన జీవితాన్ని గడపుతారు.

ధనస్సు రాశి

బుధుడు ఆశ్లేష నక్షత్రంలోకి ప్రవేశించిన వెంటనే ఈ రాశివారు భారీ విజయాలు అందుకుంటారు. పెండింగ్ లో ఉన్న పనులు విజయవంతమవుతాయి. ఆర్థికంగా లాభాలు అందుకుంటారు. కార్యాలయాల్లో ఉన్నతాధికారుల మద్దతు పొందుతారు. కొత్త ఆదాయ వనరు ఏర్పడుతుంది. పిల్లల వద్ద నుంచి శుభవార్తలు వింటారు. వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది. ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ఉంటాయి. ఆర్థిక ఎదుగుదల ఉటుంది.

 

Tags

Related News

Horoscope 20 September 2024: ఈ రాశి వారికి పట్టిందల్లా బంగారమే! శ్రీలక్ష్మి ధ్యానం శుభప్రదం!

Lucky Rashi from Durga Sasthi 2024: దుర్గా షష్ఠి నుండి ఈ రాశులకు వరుసగా 119 రోజులు లక్ష్మీ అనుగ్రహం

Mahalaya Surya Grahan 2024: మహాలయలో సూర్యగ్రహణం, ఈ 3 రాశుల వారి జీవితంలో అన్నీ అద్భుతాలే

Surya Grahan 2024: త్వరలో సూర్య గ్రహణం.. ఈ రోజు ఈ పొరపాట్లు అస్సలు చేయకండి

Vriddhi Yog Horoscope: ఈ రాశుల వారిపై ప్రత్యేక యోగం వల్ల కోటీశ్వరులు కాబోతున్నారు

Guru Vakri 2024 : మరో 20 రోజుల్లో బృహస్పతి తిరోగమనం కారణంగా లక్ష్మీదేవి అనుగ్రహం పొందబోతున్నారు

Budh Shani Yuti Horoscope: బుధ-శని సంయోగంతో ఈ 3 రాశుల వారు సంపదను పొందబోతున్నారు

Big Stories

×