EPAPER

Jay Shah focus on ICC Chairman: ఐసీసీ ఛైర్మన్‌ రేసులో జై షా.. బీసీసీఐలో మార్పులు ఖాయమా?

Jay Shah focus on ICC Chairman: ఐసీసీ ఛైర్మన్‌ రేసులో జై షా.. బీసీసీఐలో మార్పులు ఖాయమా?

Jay Shah focus ICC Chairman: భారత క్రికెట్ కంట్రోల్ బోర్డులో త్వరలో కీలక మార్పులు జరగ నున్నాయా? బీసీసీఐ కార్యదర్శి జై షా ఆ పదవి నుంచి తప్పుకుంటున్నారా? ఆయన ప్లేస్‌లోకి వచ్చేదెవరు? జై షా ఐసీసీ ఛైర్మన్ రేసులో ఉన్నారా? అదే జరిగితే బీసీసీఐలో ప్రక్షాళన తప్పదా? ఇవే ప్రశ్నలు చాలామందిని వెంటాడుతున్నాయి.


బీసీసీఐ కార్యదర్శిగా చాలా కాలం నుంచి కొనసాగుతున్నారు జై షా. బోర్డులో కార్యదర్శి పదవి చాలా కీలకం. అందుకే ఆ పదవిని దక్కించుకోవాలని చాలామంది పోటీపడుతుంటారు. అయితే ఆయన ఐసీసీ ఛైర్మన్‌గా పోటీ చేయాలని ఆలోచన చేస్తున్నారట. ఈ మేరకు క్రిక్‌బజ్ ఓ కథనాన్ని ప్రచురించింది. నవంబరులో జరిగే ఛైర్మన్ ఎన్నికల్లో ఆయన పోటీకి దిగితే ఎన్నిక కావడం సునాయాశమేనని అంటున్నారు. ఏకగ్రీవంగా ఎన్నికయ్యే ఛాన్స్ ఉందని అంటున్నారు.

ఐసీసీ ఛైర్మన్ పదవిని జై షా గనుక చేపడితే అత్యంత పిన్న వయస్కుడిగా ఆయన నిలుస్తారు. పోటీ విషయమై ఇప్పటివరకు ఆయన నోరు మెదపలేదు. రేపో, మాపో క్లారిటీ ఇవ్వడం ఖాయంగా కనిపిస్తోంది. మరోవైపు ఐసీసీ వార్షిక సమావేశం ఈనెల మూడో వారం కొలంబోలో జరగనుంది. అందులో ఛైర్మన్ ఎన్నికపై క్లారిటీ వచ్చే అవకాశముందని అంటున్నారు.


గత నాలుగు సంవత్సరాలుగా ఈ పదవిని న్యూజిలాండ్ ఆటగాడు గ్రెగ్ బార్క్లే నిర్వహిస్తున్నారు. బీసీసీఐ కార్యదర్శి జే షా మద్దతుతో ఆయన ఆ పదవిని చేపట్టారు. బార్క్లే మరో పర్యాయం అధ్యక్షుడిగా కొనసాగడానికి అనర్హులు. అధ్యక్షుడు రెండు పర్యాయాలు చేయడానికి మాత్రమే ఆ పదవిని చేపట్టాలనే రూల్ ఉంది. ఒకవేళ షా ఎన్నికైతే మూడేళ్లపాటు అందులో కొనసాగే ఛాన్స్ ఉంది. ఆ తర్వాత బీసీసీఐ అధ్యక్షుడిగా అర్హత సాధించే ఛాన్స్ ఉందని నేషనల్ మీడియా చెబుతున్నమాట.

ALSO READ: భారత క్రికెట్ జట్టుకు ప్రత్యేక ఆహ్వానం.. మాల్దీవుల్లో సంబరాలు చేసుకోవాలని విజ్ఞప్తి

ఒకవేళ జై షా గనుక ఐసీసీ చీఫ్ అయితే కీలక మార్పులకు శ్రీకారం చుట్టడం ఖాయమని అంటున్నారు. బీసీసీఐ మాజీ సెక్రటరీ నిరంజన్ షా వారసుడిగా 2009లో గుజరాత్ క్రికెట్ అసోసియేషన్‌లో ఎంట్రీ ఇచ్చారు జై షా. అక్కడి నుంచి వెనుదిరిగి చూడలేదు. అంచెలంచెలుగా ఎదుగుతూ బీసీసీఐ సెక్రటరీగా ప్రస్తుతం పని చేస్తున్నారు. ఒకవేళ ఐసీసీకి జై షా వెళ్తే… బీసీసీఐ మార్పులు తప్పవని అంటున్నారు. ఆ పదవిని ఆటగాళ్లకు అప్పగిస్తారా? లేదా జై షా కొత్త వ్యక్తిని తీసుకొస్తారా? అన్నది అసలు పాయింట్.

Tags

Related News

IND vs BAN 1st Test: కపిల్, ధోనీ సరసన.. అశ్విన్

India vs Bangladesh 1st Test: భారత్ 376 ఆలౌట్.. తొలి టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో భారీ స్కోరు చేసిన భారత్..

Shikhar Dhawan: ఆ హాట్‌ బ్యూటీతో గబ్బర్‌ ఎఫైర్‌..సీక్రెట్‌ ఫోటోలు లీక్‌ !

Ravichandran Ashwin: తనే నన్ను ఆడించాడు: సెంచరీ హీరో అశ్విన్

IPL 2025: కోహ్లీ భారీ ప్లాన్‌..RCBలోకి అర్జున్‌ టెండూల్కర్‌ ?

Ravichandran Ashwin: టీమిండియాలో గొడవలు…అశ్విన్‌ ను అవమానించిన గంభీర్‌..?

Mahmud Hasan: మనోళ్లకే చుక్కలు చూపించిన.. హసన్ ఎవరు?

Big Stories

×