డొక్కా సీతమ్మ గురించి...

డొక్కా సీతమ్మది తూర్పు గోదావరి జిల్లాలోని లంకల గన్నవరం గ్రామం

డొక్కా సీతమ్మ గొప్ప అన్నదాత.. అన్నదానంతోపాటు తనకు తోచినంత పేదలకు ఆర్థిక సాయం చేసేవారు

1841, అక్టోబర్ నెలా రెండో వారంలో సీతమ్మ జన్మించారు

సీతమ్మ తల్లిదండ్రులు కూడా ప్రజలకు ఉచితంగా అన్నదానం చేసేవారు

తల్లిదండ్రుల లక్షణాలు సీతమ్మకు వచ్చాయి

తమ చుట్టు పక్కల గ్రామాల ప్రజలు ఎప్పుడు వచ్చి అడిగినా లేదనకుండా వారికి అన్నదానం చేసేవారు

దీంతో ఉభయ గోదావరి జిల్లాల్లో ఆమె పేరు మార్మోగింది

బ్రిటీష్ చక్రవర్తికి కూడా ఈమె గొప్పతనం, సేవగుణం గురించి తెలిసి ఆనందించారు.

1903లో బ్రిటీష్ చక్రవర్తిగా ఏడవ ఎడ్వర్డ్ కు జరిగిన పట్టాభిషేకం సందర్భంగా ఢిల్లీలో దర్బారు జరిగింది.

ఈ కార్యక్రమానికి హాజరుకావాలని సీతమ్మను ఆహ్వానించారు. అయితే వయోభారం వల్ల రాలేనని చెప్పింది సీతమ్మ

దీంతో దర్బారులోని ఒక కుర్చీలో ఆమె ఫొటోను పెట్టి గౌరవించారు.

ఆమెకు అభినందనలు చెబుతూ ఓ లెటర్ కూడా పంపాడు. అది వారి కుటుంబ సభ్యుల వద్ద ఇప్పటికీ ఉంది.

డొక్కా సీతమ్మ 69 ఏళ్ళ వయసులో 28 ఏప్రిల్ 1909న కన్నుమూశారు

జాతి, కుల, ప్రాంతం భేదం చూపకుండా నిస్వార్ధంగా అన్నదానం చేసిన ఈమె విగ్రహాన్ని గన్నవరంలో ఏర్పాటు చేశారు

అంతేకాదు Apలో చాలా చోట్ల కనిపిస్తాయి

సీతమ్మ ఇప్పుడు మన మధ్య లేకపోయినా  మనందరికీ ఆదర్శం, స్ఫూర్తి దాయకం

అందుకే పవన్ కల్యాణ్ డొక్కా సీతమ్మ గారి పేరు మీద క్యాంటీన్లు ఏర్పాటు చేసి ఉచితంగా భోజనం అందించాలని ప్రస్తుత ఏపీ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు