TGPSC JL GRL Released: తెలంగాణలోని ప్రభుత్వ ఇంటర్మీడియట్ కాలేజీల్లో జూనియర్ లెక్షరర్ పోస్టుల భర్తీకి నిర్వహించిన పరీక్ష ఫలితాలను ఇవాళ టీజీపీఎస్సీ విడుదల చేసింది. మొత్తం 1392 జేఎల్ పోస్టుల భర్తీకి గతేడాది సెప్టెంబర్ 12 నుంచి అక్టోబర్ 3 వరకు వివిధ తేదీల్లో సీబీటీ మోడ్లో పరీక్షలు నిర్వహించాంది టీజీపీఎస్సీ.
తాజాగా ఈ పరీక్ష జనరల్ ర్యాంకింగ్ లిస్టును వెబ్సైట్లో పొందుపరిచింది టీజీపీఎస్సీ. సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం అభ్యర్థులను 1:2 నిష్పత్తిలో, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు 1:5 నిష్పత్తిలో త్వరలో ఆహ్యానించనున్నట్లు కమిషన్ పేర్కొంది.
ఇక షెడ్యూల్ ప్రకారమే డీఎస్సీ పరీక్ష నిర్వహించనున్నట్లు విద్యాశాఖ ప్రకటించింది. జులై 11 నుంచి హాల్ టికెట్లను వెబ్ సైట్ లో పొందుపరచనున్నట్లు తెలిపింది.