EPAPER

Dhanwantari Foundation Fraud: ఫౌండేషన్ పేరుతో భారీ మోసం.. 540 కోట్లు స్వాహా !

Dhanwantari Foundation Fraud: ఫౌండేషన్ పేరుతో భారీ మోసం.. 540 కోట్లు స్వాహా !

Dhanwantari Foundation Fraud: హైదరాబాద్‌లో ధన్వంతరి ఇంటర్నేషనల్ ఫౌండేషన్ పేరుతో భారీ మోసం జరిగింది. పౌండేషన్‌లో పెట్టుబడులు పెడితే అధిక వడ్డీ ఇస్తామంటూ ఆశ చూపి భారీ మొత్తంలో డబ్బులు కాజేశారు. తాజాగా ఇదంతా మోసం అని తేలడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు.


ధన్వంతరి ఫౌండేషన్‌లో భారీగా పెట్టుబడులు పెట్టాలని నిర్వాహకులు కమాలకర్ శర్మ బాధితులపై ఒత్తిడి తెచ్చాడు. పెట్టుబడులకు అధిక వడ్డీ ఇస్తామని మభ్యపెట్టాడు. ఈ క్రమంలోనే వారు పెట్టిన పెట్టుబడులకు ప్లాట్స్ ఇస్తామని ఆశ చూపించారు. దీంతో నాలుగు వేల మంది దగ్గర సూమారు రూ. 540 కోట్ల వరకు డిపాజిట్లు సేకరించారు. బాధితులు అందరూ ఒకే కమ్యూనిటీకి చెందిన వారు కావడం గమనార్షం. అయితే ఇదంతా మోసం అని గమనించిన బాధితులు సీసీఎస్ పోలీసులను ఆశ్రయించారు.

ఈ క్రమంలో బాధితులు ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా సీసీఎస్ డీసీపీ శ్వేతా రెడ్డి మాట్లాడుతూ కమలాకర్ శర్మను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అంతే కాకుండా ధన్వంతరి ఫౌండేషన్ పేరు మీద ఉన్న ఆస్తులను సీసీఎస్‌కు అటాచ్ చేసినట్లు తెలిపారు. అలాగే సీజ్ చేసిన ఆస్తులను అమ్మి బాధితులకు డబ్బులు వచ్చేలా చూస్తామన్నారు.


Tags

Related News

Etela: సీఎం రేవంత్ రెడ్డికి ఈటల లేఖ.. హైడ్రాకు వ్యతిరేకం కాదంటూ…

TG Govt: కార్పొరేట్ పాఠశాలలకు దిమ్మ తిరిగే న్యూస్ అంటే ఇదే.. యంగ్ ఇండియా స్కూల్స్ రాబోతున్నాయ్..

CM Revanth Reddy: ఇది ఉద్యోగం కాదు.. భావోద్వేగం: సీఎం రేవంత్ రెడ్డి

Ponguleti: త్వరలోనే ROR చట్టాన్ని తీసుకురాబోతున్నాం: మంత్రి పొంగులేటి

Derogatory Comments: బూతులపై ఉన్న శ్రద్ధ.. ప్రజలకు సేవ చేయడంపై లేదా..?

KCR: కేసీఆర్ కనిపించడం లేదంటూ.. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు.. ఫిర్యాదు చేసింది ఎవరంటే ?

Secunderabad To Goa Trains: సికింద్రాబాద్ టూ గోవా రైలును ప్రారంభించిన కిషన్ రెడ్డి

×