EPAPER

7- Second Coffee Loophole: 7-సెకన్ల కాఫీ లూప్‌హోల్ ట్రెండ్.. ఇది నిజంగా బరువు తగ్గిస్తుందా ?

7- Second Coffee Loophole: 7-సెకన్ల కాఫీ లూప్‌హోల్ ట్రెండ్.. ఇది నిజంగా బరువు తగ్గిస్తుందా ?

7-Second Coffee Loophole: బరువు తగ్గడానికి అధిక బరువుతో ఇబ్బంది పడుతున్నవారు రకరకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. ఏవైతే త్వరగా ఎఫెక్టివ్‌గా ఫలితాలుస్తుంటాయో అలాంటి చిట్కాల కోసం ప్రయత్నిస్తుంటారు. ఆ క్రమంలో వచ్చినవే వేగన్ డైట్, కీటో డైట్, వాటర్ డైట్, ఓమాడ్ డైట్ అంటూ వివిధ రకాల డైట్ లు మొన్నటి వరకు ఇంటర్నెట్‌లో బాగా ట్రెండ్ అయ్యాయి. అయితే లేటెస్ట్‌గా నెట్టింట ఓ కాఫీ ట్రెండ్ తెగ వైరల్ అవుతోంది.


కాఫీ ట్రెండ్, కాఫీతో బరువు తగ్గొచ్చా.. మరి నిపుణులు కాఫీని మితంగా తాగాలని సూచిస్తుంటారు? కాఫీ బరువు ఎలా తగ్గిస్తుంది? ఇందులో ఉండే కెఫిన్ బరువును నియంత్రించడానికి ఎలా సహాయపడుతుంది? ఇదేగా మీ సందేహం రండి.. ఈ ఫిట్‌నెస్ సీక్రెట్ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంటర్నెట్ పుణ్యమా అని ప్రపంచంలో ఏ మూల ఏం జరిగినా క్షణాల్లో ఇంటర్నెట్‌లో ప్రత్యక్షమవుతుంది. దీంతో ప్రతీ విషయం ట్రెండ్ అవుతున్నాయి. బరువు తగ్గడానికి వివిధ రకాలుగా చాలా మంది ప్రయత్నిస్తుంటారు. బరువు తగ్గడం కోసం పూర్తిగా అన్నం మానేసి ఆకలిని నియంత్రించే వారు కూడా ఉంటారు. బరువు తగ్గించడం కోసం ఈ టిప్స్ పాటించండి వీటితో ఆకలిని కంట్రోల్ చేయడం సులభం అంటారు. ఇందులో భాగంగా కానే పుట్టుకొచ్చింది 7-సెకన్ల కాఫీ డైట్.


ఇది ఇప్పుడు మరో ట్రెండ్‌గా మారింది. దీనిని సెవెన్ సెకన్ల కాఫీ లూప్ హోల్ అని అంటారు. దీని సహాయంతో ఆకలిని అదుపులో ఉంచుకోవచ్చు. ఆకలిగా అనిపించినప్పుడు దాల్చిన చెక్క లేదా నిమ్మకాయ వంటి పదార్థాలతో తయారు చేసుకునే బ్లాక్ కాఫీ ఏడు సెకన్లలోపు తీసుకోవాలి. ఇది బరువు తగ్గడానికి సులభమైన పద్ధతి అంటూ నెట్టింట వీటికి సంబంధించిన చాలా వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. అయితే ఇది బరువు తగ్గడానికి ప్రభావవంతంగా పనిచేస్తుందా? అంటే ఎలాంటి ఆధారాలు లేవనే విషయాన్ని గమనించాలి.

7- సెకన్ల కాఫీ అంటే ఏంటి?
సెవెన్ సెకండ్ కాఫీ లూప్ హోల్ ప్రకారం ఆకలిగా అనిపించినప్పుడు ఏడు సెకన్లలోపు బ్లాక్ కాఫీని కొన్ని పదార్థాలతో కలిపి తాగడం వల్ల ఇవి ఆకలిని తగ్గిస్తాయి. అంతేకాకుండా బరువు తగ్గడంలో ఉపయోగపడుతాయి. దాల్చిన చెక్క లేదా నిమ్మకాయ వంటి ఇతర ఆహార పదార్థాలతో పాటు కెఫిన్ ఆకలిని నియంత్రించడానికి జీర్ణక్రియను పెంచడానికి సహాయపడుతుందని దీని సిద్ధాంతం.
కాఫీలో ఉండే కెఫిన్ అనే పదార్థం శరీరంపై అనేక ప్రభావాలను కలిగిస్తుంది. కెఫిన్ జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది. ఆ క్రమంలో కేలరీలు తగ్గించడంలో సహాయపడుతుంది. అలాగే కేఫిన్ తాత్కాలిక ఆకలి రాకుండా చేస్తుంది.

Also Read: జుట్టుకు రంగు వేస్తున్నారా ? అయితే ఈ సమస్యలు గ్యారంటీ !

స్వల్ప ప్రభావం:
ఇలాంటి బరువు తగ్గించే సులభమైన మార్గాలను ఎంచుకున్నప్పుడు ఇవి తాత్కాలికమైనవని గ్రహించాలి. వీటి వల్ల మొదటికే మోసం వస్తుంది. బంగారం లాంటి ఆరోగ్యాన్ని చేజేతులారా పాడు చేసుకోవద్దు. బరువు తగ్గడానికి ఆహారం, వ్యాయామం రెండింటిపై దృష్టి పెట్టడం చాలా ముఖ్యం. బరువు తగ్గడానికి ప్రాసెస్ చేయని ఆహారాన్ని తినండి. శరీరానికి సరిపడా నీళ్లు తాగి హైడ్రేటెడ్ గా ఉండండి. క్రమం తప్పకుండా నడక, యోగా వంటి వ్యాయామాలు మర్చిపోవద్దు. త్వరగా శాశ్వతంగా బరువు తగ్గడానికి సత్వర మార్గం అంటూ ఏదీ లేదని గుర్తుంచుకోండి.

Related News

Walnuts: వాల్ నట్స్ తింటున్నారా ? అయితే ఈ విషయాలు తప్పక తెలుసుకోండి

Health Tips: ఈ జ్యూస్‌లు తాగితే ప్లేట్ లెట్స్ కౌంట్ రెట్టింపు

Fashion Tips: మీడియం స్కిన్ టోన్ ఉన్న వారికి ఏ రంగు చీరలు బాగుంటాయ్

Throat pain: గొంతు నొప్పితో బాధపడుతున్నారా? ఇంట్లోనే ఈ చిన్న చిట్కాలను పాటిస్తే గొంతు దురద, నొప్పి తగ్గిపోతాయి

Hair Colour: సెలూన్‌కు వెళ్లాల్సిన పని లేదు.. ఇంట్లోనే ఇలా హెయిర్ కలర్ వేసుకోండి

Curry Leaves Hair Oil: కరివేపాకుతో ఇలా చేస్తే.. తెల్లజుట్టు నల్లగా మారడం పక్కా

Beetroot Face Pack: బీట్ రూట్ ఫేస్ ప్యాక్.. ఎలాంటి మచ్చలైనా మాయం

×