EPAPER

SC Dismisses Plea Seeking Menstrual Leave: నెలసరి సెలవులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

SC Dismisses Plea Seeking Menstrual Leave: నెలసరి సెలవులపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు

Supreme Court on Menstrual Leave(Telugu breaking news): మహిళా ఉద్యోగులకు సంబంధించిన నెలసరి సెలవుల విషయమై సుప్రీంకోర్టు తాజాగా కీలక వ్యాఖ్యలు చేసింది. నెలసరి సెలవులను తప్పనిసరి చేయాలంటూ దాఖలైన పిటిషన్‌ను కొట్టివేస్తూ.. విధానపరమైన నిర్ణయాల్లో తాము జోక్యం చేసుకోబోమంటూ తేల్చి చెప్పింది. నెలసరి సెలవులు మంచి నిర్ణయమే.. కానీ, దాని వల్ల మహిళలు ఉద్యోగ అవకాశాలకు దూరం కావొచ్చంటూ సర్వోన్నత న్యాయస్థానం అభిప్రాయపడింది.


ప్రస్తుతం దేశంలో రెండు రాష్ట్రాలు మహిళలకు నెలసరి సెలవులు ఇస్తున్నాయని, ఇదే మాదిరిగా మిగతా రాష్ట్రాల్లో కూడా సెలవులు ఇచ్చేలా ఆదేశాలు జారీ చేయాలంటూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది. ఈ పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డి.వై. చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

Also Read: ‘నీట్’ తీర్పుపై సర్వత్రా ఉత్కంఠ..రేపు సుప్రీంకోర్టు లో విచారణ


ఈ సందర్భంగా న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ‘మహిళలకు నెలసరి సెలవులు(పీరియడ్ లీవ్) ఇస్తే వారు మరింత ఎక్కువగా ఉద్యోగాలు చేసేందుకు ప్రోత్సహించినట్లు అయితుంది. వీటిని తప్పనిసరి చేయాలని యజమానులను బలవంతపెడితే అది ప్రతికూల పరిస్థితులకు దారి తీసే అవకాశాలు లేకపోలేదు. మహిళలను ఉద్యోగాల్లో నియమించుకునే అవకాశాలు కూడా తగ్గే అవకాశముంటుంది. అది మేం కోరుకోవడంలేదు. మహిళల ప్రయోజనాల కోసం పలుసార్లు మనం చేసే ప్రయత్నాలు వారి భవిష్యత్తుకు అడ్డంకిగా మారుతుంటాయి’ అని సుప్రీంకోర్టు పేర్కొన్నది.

అదేవిధంగా.. ఇది విధానపరమైన నిర్ణయం.. ఇందులో తాము జోక్యం చేసుకోబోమంటూ న్యాయస్థానం తేల్చి చెప్పింది. ఈ విషయంలో రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్ర ప్రభుత్వం విస్తృత చర్చలు జరిపి ఇందుకు సంబంధించిన ఫ్రేమ్‌వర్క్‌ను రూపొందించే అంశంపై నిర్ణయం తీసుకోవాలని ధర్మాసనం పేర్కొన్నది. పిటిషనర్ తన అభ్యర్థనను కేంద్ర మహిళ, శిశు సంక్షేమశాఖ దృష్టికి తీసుకెళ్లాలని సూచించింది. అయితే, ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా నెలసరి సెలవులపై పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ఈ అంశంపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేసింది.

Also Read: బల పరీక్షలో నెగ్గిన హేమంత్ సర్కార్, విపక్షాలు వాకౌట్..

అయితే, బీహార్ రాష్ట్ర ప్రభుత్వం 1992 నుంచి అక్కడి ప్రభుత్వ మహిళా ఉద్యోగులకు రెండు రోజుల నెలసరి సెలవును ఇస్తున్నది. ఇటు కేరళ ప్రభుత్వం కూడా విద్యార్థినులకు మూడు రోజుల పీరియడ్ లీవ్ ను ఇటీవలే ప్రకటించిన విషయం తెలిసిందే.

Related News

6 వేల మీటర్ల ఎత్తులో 3 రోజులు అరిగోస, IAF సాయంతో ప్రాణాలతో బయటపడ్డ విదేశీ పర్వతారోహకులు

hairball in stomach: 2 కేజీల తల వెంట్రుకలను మింగిన మహిళ.. ఆమెకు అది అలవాటేనంటా!

Richest State in India : ఇండియాలో రిచెస్ట్ స్టేట్ జాబితా విడుదల.. టాప్‌లో ఉన్న రాష్ట్రం ఇదే..!

Biryani For Prisoners: మటన్ బిర్యానీ, చికెన్ కర్రీ – ఖైదీలకు స్పెషల్ మెనూ.. 4 రోజులు పండగే పండుగ!

Maldives Flight Bookings: మాల్దీవులకు ఫ్లైట్ బుకింగ్స్ ఆరంభం.. 9 నెలల తర్వాత మళ్లీ దోస్తీ, కానీ..

Naveen Jindal: గుర్రంపై వచ్చి ఓటేసిన నవీన్ జిందాల్, వీడియో వైరల్

Exist Polls Result 2024: బీజేపీకి షాక్.. ఆ రెండు రాష్ట్రాలూ కాంగ్రెస్‌కే, ఎగ్జిట్ పోల్స్ ఫలితాలివే!

×