EPAPER

Xiaomi Bluetooth Speakers: పార్టీకి వెళ్తున్నారా.. షియోమీ రెండు బ్లూటూత్ స్పీకర్లు.. ఇక అమ్మోరు జాతరే!

Xiaomi Bluetooth Speakers: పార్టీకి వెళ్తున్నారా.. షియోమీ రెండు బ్లూటూత్ స్పీకర్లు.. ఇక అమ్మోరు జాతరే!

Xiaomi Bluetooth Speakers: ప్రస్తుత కాలంలో బ్లూటూత్ స్పీకర్లు చాలా ఫేమస్ అయ్యాయి. స్మార్ట్‌ఫోన్‌లు, ల్యాప్‌టాప్‌ల స్పీకర్లు పెద్ద సౌండ్ ఇవ్వకపోవడంతో బ్లూటూత్ స్పీకర్లు ఎక్కువగా వినియోగిస్తున్నారు. వీటితో థియేటర్ ఫీల్‌ను పొందొచ్చు. అంతేకాకుండా వైర్‌లెస్‌గా కనెక్ట్ చేసి యూజ్ చేయవచ్చు. సైజు కూడా చిన్నగా ఉండటంతో ఈజీగా ఎక్కడికైనా తీసుకెళ్లవచ్చు. ట్రావెలింగ్ సమయంలో ఇవి చాలా యూజ్‌ఫుల్‌గా ఉంటాయి.


ఈ క్రమంలోనే షియోమీ చైనాలో రెండు కాంపాక్ట్ బ్లూటూత్ స్పీకర్లను పరిచయం చేసింది. ఇప్పుడు కంపెనీ బ్లూటూత్ స్పీకర్, బ్లూటూత్ స్పీకర్ మినీ స్పీకర్లను షియోమీ గ్లోబల్ వెబ్‌సైట్‌లో అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇంతకుముందు ఈ స్పీకర్లు చైనాలో మాత్రమే కొనుగోలు చేయడానికి అందుబాటులో ఉండేవి. స్పీకర్‌లు అధికారిక సైట్‌లో జాబితా చేయబడినప్పటికీ, ధర సమాచారం ఇంకా వెల్లడి కాలేదు.

Also Read: రూ. 14 వేల ఫోన్‌పై భారీ ఆఫర్.. 5G స్మార్ట్‌ఫోన్.. చీప్‌గా కొట్టేయండి!


చైనాలో అందుబాటులో ఉన్న పెద్ద బ్లూటూత్ స్పీకర్ ధర చైనాలో $86 (సుమారు రూ. 7,178) కంటే తక్కువ ధరకు అందుబాటులో ఉంది. బ్లూటూత్ స్పీకర్ మినీ ధర దాదాపు $30 (సుమారు రూ. 2,504). ఇప్పటి వరకు వీటిని AliExpress, ఇతర రిటైల్ స్టోర్ల ద్వారా మాత్రమే ఆర్డర్ చేయవచ్చు. లాంచ్ గురించి షియోమీ ఇంకా ఎటువంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు. అధికారిక లాంచ్ ఇప్పుడు సమీపంలో ఉన్నట్లు కనిపిస్తోంది. అంచనా ధరల గురించి ఇంకా సమాచారం లేదు.

షియోమీ బ్లూటూత్ స్పీకర్ 40W పవర్‌ని కలిగి ఉంటుంది. ఇది గరిష్టంగా 93DB వాల్యూమ్‌తో 360 డిగ్రీల సౌండ్ ఫీల్ అందిస్తుంది. ఇందులో 2 ట్వీటర్లు, మిడ్-ఫ్రీక్వెన్సీ డ్రైవర్, డ్యూయల్ పాసివ్ రేడియేటర్లు ఉన్నాయి. స్పీకర్ IP67 రేటింగ్‌ను కలిగి ఉంది. దీన్ని పూల్ లేదా బీచ్‌లో ఉపయోగించవచ్చు. ఇది RGB లైటింగ్ సిస్టమ్‌తో మల్టీ-డివైస్ పెయిరింగ్, స్టీరియో ప్లేబ్యాక్ కోసం HyperOS కనెక్ట్‌కి కూడా సపోర్ట్ ఇస్తుంది. బ్యాటరీ బ్యాకప్ గురించి చెప్పాలంటే స్పీకర్‌ను ఒక్కసారి ఛార్జ్‌పై 17 గంటల పాటు ఉపయోగించవచ్చు.

Also Read: కలలో కూడా అనుకోలేదు.. సామ్‌సంగ్ అల్ట్రా‌పై బిగ్ డిస్కౌంట్.. పూనకాలు లోడింగ్!

షియోమీ బ్లూటూత్ స్పీకర్ మినీ మరింత కాంపాక్ట్, పోర్టబుల్‌గా ఉంటుంది. దీని పొడవు 10 సెంమీ. వెడల్పు 7 సెంమీ. మందం 7 సెంమీ. బరువు 330 గ్రాములు మాత్రమే. ఇది 360 డీగ్రీ ఓమ్నిడైరెక్షనల్ సౌండ్ అవుట్‌పుట్‌ని అందించడానికి రెండు ఫుల్ రేంజ్ స్పీకర్‌లను, పాసివ్ రేడియేటర్‌ను ఉపయోగిస్తుంది. బ్యాటరీ బ్యాకప్ గురించి చెప్పాలంటే ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 8 గంటల వరకు ఉంటుంది. ఇది బ్లూటూత్ కనెక్టివిటీ, హైపర్‌ఓఎస్ కనెక్ట్‌ని కలిగి ఉంది. ఇది IP67 రేటింగ్‌తో వస్తుంది. పైన యాంబియంట్ RGB లైట్ సిస్టమ్‌ను కూడా కలిగి ఉంది.

Tags

Related News

Apple Sale : ఆహా ఏమి ఆఫర్… ఐపాడ్, ల్యాప్​టాప్​, మ్యాక్​బుక్స్​ – ఇప్పుడు కొనకపోతే ఇంకెప్పుడు కోనలేరేమో!

Festival Sale : వారెవ్వా.. ఏమి సేల్స్ బ్రదర్.. వారంలోనే వేల కోట్లు కొనేసారుగా!

Amazon Echo Show 5 : అదిరే ఆఫర్ – సగం ధరకే లభిస్తోంది అమెజాన్ ఎకో షో 5

Flipkart : అదిరిపోయే ఆఫర్.. వివో సిరీస్ పై భారీ తగ్గింపు

DigiYatra Airport : విదేశాల్లో ప్రయాణానికీ ‘డిజియాత్ర’ ఎఫ్‌ఆర్‌టీ..

Online Shopping : టాప్ సీక్రెట్… అమెజాన్, ఫ్లిప్కార్ట్ ప్రొడక్ట్స్ నిజమైన ధరలు తెలుసుకోండిలా!

Google Storage : గూగుల్‌ స్టోరేజీ నిండిపోయిందా? – ఇలా చేస్తే డబ్బులు కట్టకుండానే స్టోరేజీ పెంచుకోవచ్చు!

×