Jupiter Transit 2024: దేవగురువు బృహస్పతి ప్రస్తుతం వృషభ రాశిలో సంచరిస్తున్నాడు. గత నెల జూన్ 13న బృహస్పతి రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. రోహిణి నక్షత్రం, వృషభం రెండింటికి శుక్రుడు అధిపతి. అటువంటి పరిస్థితిలో బృహస్పతి, శుక్రుడు ఈ రాశి నక్షత్రరాశిలో ఉండటం అరుదైన సంఘటన. సుమారు 12 సంవత్సరాల తర్వాత గురుడు రోహిణి నక్షత్రంలోకి సంచరిస్తున్నాడు. దీని ప్రభావంతో సంపద పెరుగుతుంది అనుకోని ప్రయోజనాలు అందుతాయి.
దేవ గురువు కృప వల్ల అదృష్టం పొందుతారు. జ్ఞానం, పిల్లలు, ధార్మిక పనులు, వివాహం, సద్గుణం, ఎదుగుదల, సంపద మొదలైన వాటికి గురుగ్రహం కారకుడిగా చెబుతారు. బృహస్పతి ఆగస్టు 20వ తేదీ వరకు రోహిణి నక్షత్రంలో సంచరిస్తాడు. ఈ పరిస్థితుల కారణంగా కొన్ని రాశి చక్రాలకు అనేక ప్రయోజనాలు అందుతాయి. శుక్రుడు, బృహస్పతి అనుగ్రహం కొన్ని రాశుల మీద పడుతుంది. ఇవి రెండూ శుభ గ్రహాలుగా పరిగణిస్తారు. రోహిణి నక్షత్రంలో బృహస్పతి సంచరించడం వల్ల గొప్ప ప్రయోజనాలు పొందనున్న రాశుల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
వృషభ రాశి:
గురు సంచారం వృషభ రాశిలో ఉంటుంది. రోహిణి నక్షత్రంలోకి బృహస్పతి సంచారం కూడా వృషభ రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. మీ ఆత్మవిశ్వాసం ఈ సమయంలో చాలా బాగా పెరుగుతుంది. అంతే కాకుండా ఈ కాలంలో మీ జీవితం పూర్తి ఆనందంతో ఉంటుంది. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగం ఉన్న వారికి ప్రమోషన్లు వచ్చే అవకాశాలున్నాయి. సామాజిక గౌరవం బాగా పెరుగుతుంది. అవవాహితులకు వివాహ ప్రతిపాదనలు కూడా వస్తాయి. భార్యభర్తలు వైవాహిక జీవితాన్ని సంతోషంగా గడుపుతారు. సమస్యలను సులువుగా పరిష్కరించుకుంటారు. కుటుంబ సభ్యుల మద్దతు మీకు లభిస్తుంది.
సింహ రాశి:
బృహస్పతి రోహిణి నక్షత్రలో ఉండడం వల్ల సింహ రాశి వారు మంచి ఫలితాలు పొందుతారు. కర్మ ఇంట్లో బృహస్పతి గృహం ఉండడం వల్ల ఈ కాలం మీ జీవితంలో వివిధ అంశాలకు అనుకూలంగా ఉంటుంది. వ్యాపారం, వృత్తిలో విజయం సాధించడానికి గురువు మీకు సహాయం చేస్తాడు. మీరు ఏ పని చేసినా సొంత గుర్తింపును సృష్టించుకోవడంలో విజయం సాధిస్తారు. సొంతంగా వ్యాపారం చేస్తున్న వారికి మంచి లాభాలు అందుతాయి. ఉద్యోగాల కోసం ఎదురు చూస్తున్న వ్యక్తులు శుభవార్తలు వింటారు. ఈ కాలంలో మీ తండ్రికి మీకు సంబంధం బాగా మెరుగుపడుతుంది. వ్యాపారాన్ని కూడా మీరు విస్తరించుకుంటారు.
Also Read: వృషభరాశిలోకి కుజుడి ప్రవేశం.. ఈ ఐదు రాశులవారికి ఊహించని ప్రయోజనాలు
ధనస్సు రాశి:
రోహిణి నక్షత్రంలో ఉన్న బృహస్పతి ధనస్సు రాశి వారికి శుభ ఫలితాలను ఇస్తాడు. బృహస్పతి మీకు ఊహించని ఆర్థిక ప్రయోజనాలను అందిస్తాడు. దీని కారణంగా మీరు భవిష్యత్తు కోసం డబ్బు ఆదా చేయగలుగుతారు. ఈ కాలంలో మీ కోరికలన్నీ నెరవేరడానికి అవకాశాలున్నాయి. చాలా మంది కొత్త వ్యక్తులను మీరు కలుస్తారు. వారి నుంచి భవిష్యత్తులో ప్రయోజనం పొందుతారు. మీ ఆదాయం పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఉద్యోగస్తులకు ప్రమోషన్ కూడా లభిస్తుంది.