EPAPER

France Elections| హంగ్ దిశగా ఫ్రాన్స్ ఎన్నికలు.. అధ్యక్షుడు మాక్రాన్ కు ఇకముందు కష్టాలే!

France Elections| హంగ్ దిశగా ఫ్రాన్స్ ఎన్నికలు.. అధ్యక్షుడు మాక్రాన్ కు ఇకముందు కష్టాలే!

France Elections| ఫ్రాన్స్ లో ఆదివారం జరిగిన రెండవ రౌండ్ పార్లమెంట్ ఎన్నికలలో వామపక్ష కూటమి అత్యధిక స్థానాలను గెలుచుకుంది. అయితే ఏ పార్టీకి కూడా సంపూర్ణ మెజారిటీ రానందున ఫ్రాన్స్ లో హంగ్ పార్లమెంట్ ఏర్పడే అవకాశాలున్నాయి. విచిత్రమేమిటంటే.. అధ్యక్షుడు మాక్రాన్ కు గట్టిపోటీ అనుకున్న మెరైన్ లీ పెన్ నాయకత్వంలోని నేషనల్ ర్యాలీ పార్టీకి తక్కువ సీట్లు వచ్చాయి.


ఈ ఎన్నికలు ప్రధాన మంత్రి పదవికి జరుగుతుండడంతో ప్రస్తుతానికి అధ్యక్షడు మాక్రాన్ కు పదవీ గండం లేకపోయినా.. మూడేళ్ల పాటు ఆయన పదవిలో ఉండగా ఒక మిశ్రమ పార్టీ కూటమి పార్లమెంటుని నడిపించడం ఆయనకు ముళ్లబాట మీద నడవడమే అవుతుంది.

Also Read: Pakistan| 15 రోజుల చంటి పాపను సజీవంగా పాతిపెట్టిన తండ్రి!.. ఎందుకంటే?


ఇప్పటివరకు జరిగిన ఎన్నికల్లో ఆశ్చర్యకరంగా అనేక లెఫ్ట్, సోషలిస్టులు కలిసి ఏర్పాటు చేసిన న్యూ పాపులర్ ఫ్రంట్ (NFP) నేషనల్ అసెంబ్లీలో 182 సీట్లు గెలుచుకుంది. కానీ మెజారిటీ సాధించాలంటే 289 సీట్లు కావాలి. మరోవైపు మాక్రాన్ సెంట్రిస్ట్ సమిష్టి కూటమి 163 సీట్లు గెలుచుకుంది. ఇక్కడ అతిపెద్ద షాక్ విషయం.. మాక్రాన్ కు గట్టిపోటీ ఇస్తుందని అందరూ భావించిన లీ పెన్.. నేషనల్ ర్యాలీ పార్టీకి కేవలం 143 సీట్లు దక్కడం.

ఈ ఫలితాలను బట్టి చూస్తే.. మాక్రాన్ ఇప్పటికైతే గండం తప్పించుకున్నారు. కానీ ఫ్రాన్స్ లో రాజకీయ సంక్షోభం ఏర్పడింది. దీనికి కారణం.. అధ్యక్షడు మాక్రాన్ కు సొంత పార్టీలో నుంచే వ్యతిరేకత రావడం. ఆయన త్వరలోనే నాటో కూటమి సమావేశాల కోసం అమెరికా బయలుదేరుతున్న సమయంలో ఇలాంటి ఫలితాలు రావడం.. ఆయనకు సవాలుగా మారాయి.

Also Read: Joe Biden| బైడెన్ పనితీరుపై సందేహాలు!.. అధ్యక్ష ఎన్నికల నుంచి వైదొలగాలని డెమోక్రాట్ సెనేటర్ల సూచన

గత నెలలో జరిగిన EU పార్లమెంట్ ఎన్నికలలో మాక్రాన్ పార్టీ ఓటమి పాలైన తర్వాత, మూడు సంవత్సరాల ముందుగానే శాసనసభ ఎన్నికలను ముందస్తుగా నిర్వహించాలనే మాక్రాన్ నిర్ణయంపై ఆయన మిత్రపక్షాలు ఇప్పటికీ కోపంగా ఉన్నాయి. ముఖ్యంగా మాజీ ప్రధాన మంత్రి ఎడ్వర్డ్ ఫిలిప్.. మాక్రాన్ తీసుకున్న ముందస్తు ఎన్నికల నిర్ణయాన్ని బహిరంగంగా తప్పుబట్టారు. మరోవైపు ప్రస్తుత ప్రధాన మంత్రి గాబ్రియేల్ అట్టల్, తాను సోమవారం రాజీనామాను అందిస్తానని, అయితే ఏ పార్టీకి మెజారిటీ రాని కారణంగా పదవిలో తాత్కాలికంగా కొనసాగడానికి కూడా సిద్ధంగా ఉన్నానని తెలిపారు.

మాక్రాన్ కు గట్టిగా వ్యతిరేకించే లీ పెన్ మాట్లాడుతూ.. తాము చివరి రౌండ్ లో ఓడిపోయినా.. క్రమంగా ప్రజల సహకారంతో కోలుకుంటామని.. మాక్రాన్ కు వ్యతిరేకంగా పోరాడుతామని చెప్పారు.

 

 

Tags

Related News

Elon Musk: ట్రంప్ ర్యాలీలో మస్క్ మామ డ్యాన్స్.. ఇలా తయారయ్యావేంటి సామి

Continent Turns Green: అక్కడ మొక్కలు మొలిచాయంటే.. భూమి అంతమైనట్లే, శాస్త్రవేత్తల తాజా పరిశోధనలో తేలింది ఇదే!

Conflict: మూడో ప్రపంచ యుద్ధం తప్పదా..?

Dominica Citizenship: ‘ఎవరైనా రావొచ్చు’.. తక్కువ ధరకే పౌరసత్వం విక్రయిస్తున్న దేశం ఇదే..

Elon Musk Brazil: బ్రెజిల్‌లో ట్విట్టర్ ఎక్స్ ఆగని కష్టాలు.. తప్పుడు బ్యాంకులో ఫైన్ చెల్లింపులు!

India’s Iron Dome: ఇండియాపై శత్రువులు మిసైల్ దాడి చేస్తే పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్ తరహా యాంటి మిసైల్ టెక్నాలజీ మన దగ్గర ఉందా?

Trump Advice To Israel: ‘ఇరాన్ అణు స్థావారాలపై వెంటనే దాడి చేయండి’.. ఇజ్రాయెల్ కు ట్రంప్ సలహా

×